కార్తీక దీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో రూ. 2 కోట్ల 34 లక్షల గురించి జ్యోత్స్నను అంతా నిలదీస్తారు. సుమిత్ర, దశరథ్ మ్యారేజ్ యానివర్సరీకి ల్యాండ్ కొని గిఫ్ట్‌గా ఇద్దామనుకున్నాను. కానీ అని కుదరలేదని జ్యోత్స్న చెబుతుంది. అదంతా పచ్చి అబద్ధం అని నీ పక్కనున్న పారిజాతం అనుకున్నా నేను నమ్ముతాను అని కార్తీక్ అంటాడు.
తల్లి మీద ఆస్తి లేదు

ఎవరిని అడిగి ల్యాండ్ కొన్నావ్ అని శివ నారాయణ అడుగుతాడు. అన్ని ఆస్తులు మీ పేరు మీదనే ఉన్నాయి. నా తల్లి మీద మాత్రం ఒక్క ఆస్తి లేదు. ఆడవాళ్ల మీద ఆస్తులు ఉండకూడదా అని జ్యోత్స్న అంటుంది. దాంతో జ్యోత్స్నను పారిజాతం తెగ పొగిడేస్తుంది. తల్లి హృదయం గెలుచుకున్న కూతురు అవార్డ్ ఇవ్వాలి అని పారు అంటుంది.
దాంతో కార్తీక్ వెటకారంగా మాట్లాడుతాడు. ఫంక్షన్ హాల్ బుక్ చేసి నాలుగు వందల మంది చూస్తుండగా అవార్డ్ ఇద్దామని సెటైర్లు వేస్తాడు. కార్తీక్‌ను పారు అంటే శివ నారాయణ కోప్పడతాడు. అసలు ఎవరిని అడిగి కంపెనీ అమౌంట్ ట్రాన్స్‌ఫర్ చేయించుకుంది. ముందు ఆ అకౌంటెంట్ మీద కేసు పెట్టాలి. వాడికి బుద్ధి చెబితే జ్యోత్స్నకు బుద్ధి వస్తుందని శివ నారాయణ కోప్పడుతాడు.
సరే ఆ ల్యాండ్‌ను కంపెనీ పేరు మీదకు మార్చేద్దామని శ్రీధర్ అంటాడు. అది అంతా ఈజీగా అయ్యేది కాదని దశరథ్ అంటాడు. శ్రీధర్‌ను భోజనం చేసి వెళ్లమంటారు. జ్యోత్స్న కోపంగా లోపలికి వెళ్తుంది. ల్యాండ్ గురించి పారు అడిగితే.. అది నా పేరు మీద కొనుక్కున్నా. రేపు నేను నిజమైన కూతురు కాదని తెలిసినప్పుడు నాకంటూ ఓ ప్రాపర్టీ ఉండాలని క్యాషియర్‌కు లక్ష లంచం ఇచ్చి నా పేరు మీద ల్యాండ్ తీసుకున్నా అని జ్యోత్స్న పారుకు చెబుతుంది.
డబ్బు నష్టాల్లో చూపించేదాన్ని
నేను సీఈఓగా ఉంటే ఈ డబ్బు నష్టాల్లో చూపించేదాన్ని కానీ బావ ఉన్నాడు చూడూ నా పాలిట భస్మాసురుడిలా ఉన్నాడు. నన్ను వెంటాడుతున్నాడు అని జ్యో అంటుంది. కానీ, మీరు దొరకరుగా అని దీప ఎంట్రీ ఇస్తుంది. ఎందుకొచ్చావ్ అని పారు అడిగితే భోజనాలకు పిలుద్దామని దీప అంటుంది. ఇంతలో కార్తీక్ వస్తాడు. ఆస్తి గురించి మాట్లాడుకుంటారు.
{{/usCountry}}నేను సీఈఓగా ఉంటే ఈ డబ్బు నష్టాల్లో చూపించేదాన్ని కానీ బావ ఉన్నాడు చూడూ నా పాలిట భస్మాసురుడిలా ఉన్నాడు. నన్ను వెంటాడుతున్నాడు అని జ్యో అంటుంది. కానీ, మీరు దొరకరుగా అని దీప ఎంట్రీ ఇస్తుంది. ఎందుకొచ్చావ్ అని పారు అడిగితే భోజనాలకు పిలుద్దామని దీప అంటుంది. ఇంతలో కార్తీక్ వస్తాడు. ఆస్తి గురించి మాట్లాడుకుంటారు.
{{/usCountry}}శివ నారాయణ కష్టార్జితం. అది దశరథ్ వారసులకు వస్తుందని కార్తీక్ అంటాడు. అది జ్యోత్స్నకే వచ్చేది అని పారు అంటే.. ఎహే.. నేను చెప్పేది నువ్వు చెప్పేది ఒక్కటి కాదు పారు.. బోత్ ఆర్ నాట్ సేమ్ అని బాలకృష్ణ డైలాగ్ చెప్పి వెళ్లిపోతాడు కార్తీక్. దాంతో పారు కన్‌ఫ్యూజ్ అవుతుంది. అంతా డైనింగ్ టేబుల్‌పై కూర్చుంటారు.
దీపకు కార్తీక్ ప్రేమగా వడ్డిస్తుంటాడు. అది చూసి ఓర్వలేకపోతుంది జ్యోత్స్న. తర్వాత వెళ్తూ దశరథ్‌తో నీ చెల్లికి అన్యాయం చేశానని కోపంగా ఉందా అని అడుగుతాడు. దానికి లేదని దశరథ్ అంటాడు. కాంచనను నన్ను కలపమని చేతులు పట్టుకుని కోరుతాడు. మావయ్య గారితో మాట్లాడి కాంచనను ఒప్పించండి అని వేడుకుంటాడు శ్రీధర్. ఇంతలో వచ్చిన పారు ఇలా అనడానికి బుద్ధి ఉండాలి అల్లుడు అంటుంది.
ఇద్దరు పెళ్లాలు కావాలట
మా నాన్న ఏ తప్పు చేశాడు అని కార్తీక్ అడుగుతాడు. మీ నాన్నకు ఇద్దరు పెళ్లాలు కావాలట అని అందరిముందు చెబుతుంది పారిజాతం. శివ నారాయణ వచ్చి కోప్పడుతాడు. అందులో తప్పేముందని అంటాడు. ఇప్పుడు కాంచన భర్తగా చేరదీస్తే మొదటి భార్యగా ఉండాలి. అలా అయితే ఎంత నీచంగా ఉంటుంది అని పారు అంటుంది. అది కలవడం కలవకపోవడం వాళ్లిష్టం. నీకెందుకని కార్తీక్ అంటాడు.
అడగడానికి ఆయనకు బుద్ధి లేకున్నా ఒప్పుకునేవాళ్లకు ఉండాలని దశరథ్‌ను అంటుంది పారిజాతం. దాంతో సుమిత్ర కోప్పడుతుంది. ఒక్కొక్కరు పారును అంటారు. కాంచన కాళ్లు పట్టుకుని అయినా శ్రీధర్‌తో కలుపుతాను. కానీ నేను చెప్పింది చేయాలి. కావేరి వదిలేయాలి అని పారిజాతం అంటుంది. దాంతో అంతా షాక్ అవుతారు. కావేరి, నీ కూతురుతో ఎలాంటి బంధం లేదని తెంచుకుని రా నేను మీ ఇద్దరిని కలుపుతాను అని పారు అంటుంది.
జ్యోత్స్న సపోర్ట్ చేస్తుంది. దాంతో జ్యోత్స్నపై కార్తీక్ ఫైర్ అవుతాడు. తర్వాత పారిజాతంను లాజిక్‌తో కొడతాడు కార్తీక్. ఎవరు మాట్లాడాల్సిన అవసరం లేదు. నా బాధలు నేను పడతాను అని వెళ్లిపోతాడు శ్రీధర్. శ్రీధర్ ల్యాప్‌టాప్ మర్చిపోతుంటే వెళ్లి ఇచ్చిరమ్మని శివ నారాయణ చెబుతాడు. మరోవైపు దీప గ్లాస్ తీసుకెళ్తుంటే ల్యాప్‌ట్యాప్ ఇచ్చి వచ్చిన జ్యోత్స్న దీపకు కాలు అడ్డం పెడుతుంది.
దీపను కాపాడిన సుమిత్ర
దాంతో దీప టీపాయ్‌కు తగలబోతుంటే సుమిత్ర దీప కడుపు పట్టుకుని ఆపుతుంది. అలా దీపను కాపాడుతుంది సుమిత్ర. కానీ, జ్యోత్స్నను కోపంగా దీప చూస్తుంది. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.