Karthika Deepam 2 Serial Today Episode: కార్తీక దీపం 2 ఈరోజు ఎపిసోడ్‌లో సూరజ్ ప్రేమను వదిలేయడానికి జ్యోత్స్న 2 కోట్లు తీసుకుందని మాలిని, దక్షిణామూర్తి అంటారు. నిజమే అని కార్తీక్ చెబుతాడు. ఇప్పుడేమంటావ్ అని దక్షిణామూర్తి అంటాడు.
నీ పేరుకున్న విలువ చచ్చిపోయింది

ఏం శివ నారాయణ నాలుక తెగ్గోకుసుకుంటావా, తల తీసేసుకుంటావా. నువ్వు డబ్బు మనిషివిరా.. నీ బుద్ధులే నీ మనవరాలికి వచ్చాయి. నా మనవడి మీద ప్రేమ ఉందనుకున్నా. నా మనవడి ఆస్తి మీద ప్రేమ ఉందని డబ్బు అడిగేదాకా తెలియదు. పిల్లను బాగా పెంచార్రా అని నానా మాటలు అంటాడు దక్షిణామూర్తి. ఇదే నీ పెంపకంరా. ఎంత దిగజారిపోయావేంట్రా అని దక్షిణామూర్తి అంటాడు.
అవమానంతో శివ నారాయణ కుంగిపోతాడు. ఈరోజుతో నీ పేరుకున్న విలువ చచ్చిపోయింది. ఇక్కడి నుంచి తలదించుకుని వెళ్లు.. పోరా.. పో.. అని దక్షిణామూర్తి అంటాడు. దాంతో అంతా వెళ్తారు. నేను ఏం అనుకున్నానో అదే జరిగింది. నేను మాట్లాడిన తీరు జ్యోత్స్నకు, దీపకు మింగుడుపడదు. నేను ఎందుకు మాట్లాడానో మీకిప్పుడు అర్థం కాదని కార్తీక్ మనసులో అనుకుంటాడు.
కార్తీక్‌ను ఆగ్రహంతో చూస్తుంది దీప. గేట్ బయట ఆపి చేసిందేంటీ. బుర్ర తిరిగిపోయింది. ఇలా మాట్లాడింది నా భర్తే అని షాక్ అయ్యాను దీప అంటుంది. పారిజాతం గారు చేసిన పనే నువ్వు చేశావ్.. అని అనాలని ఉంది. కానీ అనలేను. ఆవిడతో పోల్చలేను. కానీ నువ్వు చేసిన పని అలాగే ఉంది. ఇలా చేయడాన్ని ఏమనుకోవాలని దీప గట్టిగా నిలదీస్తుంది.
చెలగాటంలా ఉంది
ఆట.. ఆట ఇప్పుడే మొదలైంది అని కార్తీక్ అంటాడు. ఇది ఆటలా లేదు చెలగాటంలా ఉంది. జ్యోత్స్నతో అందరూ ఆడుకుంటున్నట్లుగా ఉందని దీప అంటుంది. మన చేతలు అందరికి అర్థమవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకు చేస్తున్నామో తెలిస్తే చాలు. నేను ఏం చెప్పాలనుకున్నానో అదే చెప్పాను. ఇదే అని కార్తీక్ అంటాడు.
{{/usCountry}}ఆట.. ఆట ఇప్పుడే మొదలైంది అని కార్తీక్ అంటాడు. ఇది ఆటలా లేదు చెలగాటంలా ఉంది. జ్యోత్స్నతో అందరూ ఆడుకుంటున్నట్లుగా ఉందని దీప అంటుంది. మన చేతలు అందరికి అర్థమవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకు చేస్తున్నామో తెలిస్తే చాలు. నేను ఏం చెప్పాలనుకున్నానో అదే చెప్పాను. ఇదే అని కార్తీక్ అంటాడు.
{{/usCountry}}జ్యోత్స్నకు బలం లేకుండా చేశావ్. అందరిముందు జ్యోని క్యారెక్టర్ లేని మనిషిలా నిలబెట్టావ్ అని దీప అంటుంది. దీన్ని ఎక్కడికి తీసుకెళ్లి ఆపాలో నాకు తెలుసు అని కార్తీక్ అంటాడు. ఆ కార్తీక్ గాడు ఏంటమ్మా అలా మాట్లాడాడు అని దక్షిణామూర్తి అంటాడు. అదే నాకు షాక్‌గా ఉంది. వాడు రివర్స్ అయిన విధానం చూసి నాకే తల తిరిగిపోయింది అని మనసులో అనుకుంటుంది మాలిని.
జ్యోత్స్నకు సపోర్టింగ్‌గా మాట్లాడే కార్తీక్ గాడు తప్పు చేసిందని చెప్పడం ఏంటని దక్షిణామూర్తి అంటాడు. అదే నిజం కాబట్టి చెప్పాడేమో అని మాలిని అంటుంది. అదేదో ఇక్కడెందుకు చెప్పడం, ఇంటి దగ్గరే చెప్పొచ్చుగా అని తాత అంటాడు. వాడు మహా తెలివైనవాడు. అంచనాలకు దొరకడు అని మాలిని అంటుంది. నా మనవరాలు ప్రేమకు ఖరీదు కట్టిందంటే నా కూతురు కన్నతల్లిగా సుమిత్ర ఎంత బాధపడుతుంటో కన్నతండ్రిగా నేను అంతే బాధపడుతున్నాను అని దక్షిణామూర్తి ఎమోషనల్ అవుతాడు.
మనవడి మాట అంటే అంత గురి
మనం అదృష్టవంతులం మావయ్య గారు. పెళ్లయిన తర్వాత జ్యోత్స్న బుద్ధి ఏంటో తెలిస్తే సూరజ్ ఎంత బాధపడేవాడు అని మాలిని అంటుంది. నువ్వు సూరజ్‌కి ఏం చెప్పావో నాకు తెలియదు కానీ నేను మాత్రం ఒక్కటే చెప్పాను. శివ నారాయణ నా విషయంలో చేసిన తప్పుకు ఈరోజుకు పశ్చాత్తాపడపట్లేదు. పైగా నేనేదో తప్పు చేసినట్లుగా నన్ను ద్వేషించాడు. నా బాధ ఏంటో వాడికి తెలియాలి. ఇది మాత్రమే సూరజ్‌కి చెప్పాను అని దక్షిణామూర్తి అంటాడు.
శివ నారాయణకు ఇది తల కొట్టేసినట్లు ఉంటుంది. శత్రువు కొడుక్కి మనవరాలు ప్రేమ అమ్మేసుకుందంటే ఎంతపెద్ద అవమానం. దీనికి సాక్ష్యం ఎవరు పారిజాతం, కార్తీక్. పారిజాతం చెబితే శివ నారాయణ నమ్మడు కానీ కార్తీక్ చెబితే నమ్ముతాడు. మనవడి మాట అంటే శివ నారాయణకు అంత గురి అని మాలిని అంటుంది. నాకు ఇప్పటికి ఆశ్చర్యంగా అనిపించేది కార్తీక్ గాడు ఇక్కడ చెప్పడం ఏంటని దక్షిణామూర్తి అంటాడు.
అదంతా వదిలేయండి. ఇక సూరజ్‌కి మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దామని మాలిని అంటుంది. ఇప్పుడు పెళ్లి ఏం వద్దమ్మా. ముందు వాడు పూర్తిగా కోలుకోని. అప్పుడు ఆలోచిద్దామని దక్షిణామూర్తి వెళ్లిపోతాడు. సారీ మావయ్య గారు ఈ కథంతా నడిపించింది నేనే. వాళ్లను ఈ విధంగానే మానసికంగా కుంగిపోవాలి. ఈపాటికి వాళ్లింట్లో రచ్చబండ మొదలై ఉంటుందని మాలిని అంటుంది.
ఇది ఒక బ్రతుకేనా
కట్ చేస్తే జ్యోత్స్న చెంపచెల్లుమనిపిస్తుంది సుమిత్ర. నా కడుపున ఎలా పుట్టావే అని మరోసారి కొడుతుంది. నీ విషయంలో పొంగిపోయానే. ఇంత దిగజారిపోతావనుకోలేదు. పోరాడటం అంటే ఇదా. సూరజ్ గాడి అమ్మతో బేరాలు ఆడతావా. ఇది ఒక బ్రతుకేనానే. మనసును అమ్మేసుకోవడం ఏంటే అని తిడుతుంది సుమిత్ర.
ఇది నా చేతకానీ తనం కూడా.. కూతురుగా ఇది ఓడిపోవడం కాదు నేను తల్లిగా ఓడిపోయాను అని సుమిత్ర అంటుంది. ఆ పని చేసింది వేరేవాళ్లు చేశారన్నావ్. అది ఎవరు. రాయబారం జరిపింది ఎవరు అని శివ నారాయణ అడుగుతాడు. అది మనవాళ్లే అని కార్తీక్ అంటుంటే.. వీడు చెప్పకముందే మనమే బయటపడటం మంచిది అని నేనే అని పారిజాతం అంటుంది.
దాంతో పారిజాతం పీక పట్టుకుంటాడు శివ నారాయణ. నాకే పాపం తెలియదు. జ్యోత్స్న చెప్పిందే నేను చేశానని జ్యోపైకి నెట్టేస్తుంది పారిజాతం. గ్రానీ అని షాక్ అవుతుంది జ్యో. జ్యోత్స్నకు తెలియకుండా నీ అంతట నువ్వెళ్లి అడగలేదా.. జ్యోత్స్నకు తెలియకుండా తన అకౌంట్‌లో 2 కోట్లు ఎవరు వేశారు అని కార్తీక్ అడుగుతాడు.
పారిజాతం అసలు బుద్ధి
దానికి తెలియకుండా ఎలా పడతాయిరా. నాకు ఏ పాపం తెలియదు. జ్యోత్స్న చెప్పిందే నేను చేశాను అని పారిజాతం అంటుంది. విన్నావుగా జ్యోత్స్న ఇది యదార్థం అని, పారిజాతం అసలు బుద్ధి అన్నట్లుగా కార్తీక్ అంటాడు. జ్యో కుమిలిపోతుంది. ఎందుకు చేశావ్ ఇదంతా అని శివ నారాయణ నిలదీస్తాడు.
ఆస్తులు పోయినప్పుడు కూడా ఇంత బాధపడలేదు. ఆత్మగౌరవంతో బతికాను. ఈరోజు నువ్వు అది చంపేశావ్. గళ్లపెట్టెలా చిల్లరకు కక్కుర్తి పడే మనిషిని బేరసారానికి పంపించావా. ఒక పని చేయాల్సింది. మా మనసులను కూడా అమ్మేయాల్సింది. అప్పుడు 8 కోట్లు వచ్చేవి. సూరజ్‌ని ప్రేమిస్తేనే ఖరీదు కడతావా. మాకు అంత ప్రేమ లేదమ్మా. మా మనసులు ఖరీదు కట్టేంత విలువ లేదని వదిలేశావమ్మా అని దెప్పిపొడుస్తాడు తాత శివ నారాయణ.
జ్యోత్స్నను వదిలేయండి తాతయ్య గారు. ఇంతకుమించి అది భరించలేదు అని దీప అంటుంది. మేము కూడా భరించలేం. దాని మొహం చూస్తే అసహ్యంగా ఉంది. కూతురుగా నువ్వు నాకు వద్దు. వెళ్లిపోవే.. ఎక్కడికైనా దూరంగా పో.. నీ మీద నాకు వస్తున్న కోపానికి నేనే గెంటేస్తానేమో అని సుమిత్ర అంటుంది. ఎక్కడికి పోతుందని బాధగా అంటుంది దీప.
జ్యోని గెంటేసిన సుమిత్ర
అది చాలా తెలివైనది. డబ్బు సంపాదించడం బాగా తెలుసు. నాకు ఇలాంటి దరిద్రపు కూతురు వద్దు. ఇది నా కూతురు కాదనుకుంటాను. ఎవరి బిడ్డనో ఇన్నాళ్లు పెంచాను అనుకుంటాను అని సుమిత్ర అంటుంది. జ్యోత్స్న కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఏయ్ పోవే.. నీలాంటి కూతురు నాకు వద్దు. నిన్ను చూడటం నా వాళ్ల కావట్లేదు. పోవే అని జ్యోత్స్నను గెంటేస్తుంది సుమిత్ర. కుర్చీపై పడుతుంది జ్యో. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHOR
చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.