Karthika Deepam 2 Serial Today Episode: కార్తీక దీపం 2 ఈరోజు ఎపిసోడ్లో కార్తీక్ ఇంట్లో మాలిని చేసిన రచ్చతో తల్లికి కొడుకును దూరం చేస్తానని కార్తీక్ ఛాలెంజ్ చేస్తాడు. కార్తీక్, జ్యోత్స్న, దీప ముగ్గురు కలిసి సూరజ్ ముందు మాలిని పరువు తీయాలనుకుంటారు.
ఈడుజోడు బాగుంది

అందులో భాగంగానే మాలిని బలవంతంగా దక్కించుకున్న హోటల్ యజమాని, ఇదివరకు జ్యోత్స్న పనిచేసిన రెస్టారెంట్‌కి వెళ్తుంది. మీరు మళ్లీ నా కేఫ్‌లో అడుగుపెట్టారని తెలిస్తే నాకు ఇది కూడా ఉండదని అతనంటాడు. ఎవరు మాలినియా అని జ్యో అంటే.. అమ్మా మీరు ఆమె మేనకోడలు. పైగా శివ నారాయణ మనవరాలు. నాకెందుకమ్మా సమస్యలు అని అతనంటాడు.
నేను వచ్చింది కాఫీ తాగడం కోసమని, ఒకరు వచ్చాక నేను చెప్పిన స్టైల్లో కాఫీ తీసుకురమ్మని జ్యో అంటుంది. ఎవరు అని అతను అడిగితే.. సూరజ్ వస్తుంటాడు. జ్యో చూపిస్తుంది. మీ బాయ్‌ఫ్రెండా అని అతను అడిగితే.. అలా ఉన్నాడా అని జ్యో అంటుంది. హీరోలా ఉన్నాడు, మీ ఈడుజోడు చాలా బాగుందని అతనంటాడు. కాఫీ తీసుకొచ్చేందుకు వెళ్తాడు.
సూరజ్‌ను కూర్చోమంటుంది జ్యో. ఎందుకు రమ్మన్నావని సూరజ్ అడిగితే.. వచ్చినందుకు థ్యాంక్స్ చెబుతుంది జ్యో. ఇంతలో రెస్టారెంట్ మేనేజర్ వచ్చి కాఫీ ఇస్తాడు. మీరు తెచ్చారేంటని అంటే.. మీలాంటివాళ్లకు తీసుకురావచ్చని అంటాడు. ఇద్దరుంటే ఒక్కటే కాఫీ చెప్పారేంటని మేనేజర్ అడిగితే.. సర్కి మాత్రమే అని జ్యో అంటుంది.
పెదాలకు ప్రేమ అంటుకుంది
సర్ ఒక్కరిటే స్పెషల్‌గా కాఫీ ఆర్డర్ చేశారంటేనే అర్థమైపోతుందని మేనేజర్ వెళ్లిపోతాడు. కాఫీపై సింబల్ ఆఫ్ లవ్ ఉంటుంది. అలా పెట్టినందుకు సూరజ్ కోప్పడతాడు. తీసేస్తానని జ్యో అంటే.. ఇలా ఉన్న తాగుతానని తాగుతాడు. పెదాలకు ప్రేమ అంటుకుందని జ్యో అంటుంది. సూరజ్ తుడుచుకుంటాడు. మేనేజర్ని పిలిచి కాఫీ చాలా బాగుందట అని జ్యో అంటుంది.
బాగుందని చెప్పకండి మేడమ్. అదో తెలియని భయం. అదొక చేదు జ్ఞాపకం అని మేనేజర్ అంటాడు. మీ పీడ జ్ఞాపకాలన్నీ డెడ్ ఎండ్‌కి వచ్చే సమయం వచ్చింది చైర్ తీసుకుని కూర్చోండని చెప్పిన జ్యో ఇంతకుముందు నాతో అన్నమాట ఇతనికి చెప్పండని అంటుంది. మీ బాయ్‌ఫ్రెండా అని అడిగాను, ఈడుజోడు బాగుందని చెప్పానని మేనేజర్ అంటాడు.
{{/usCountry}}బాగుందని చెప్పకండి మేడమ్. అదో తెలియని భయం. అదొక చేదు జ్ఞాపకం అని మేనేజర్ అంటాడు. మీ పీడ జ్ఞాపకాలన్నీ డెడ్ ఎండ్‌కి వచ్చే సమయం వచ్చింది చైర్ తీసుకుని కూర్చోండని చెప్పిన జ్యో ఇంతకుముందు నాతో అన్నమాట ఇతనికి చెప్పండని అంటుంది. మీ బాయ్‌ఫ్రెండా అని అడిగాను, ఈడుజోడు బాగుందని చెప్పానని మేనేజర్ అంటాడు.
{{/usCountry}}ఈ అబ్బాయి మాలిని గారి ఏకైక అబ్బాయని జ్యోత్స్న అంటుంది. దాంతో అతను భయంతో లేచి సారీ సర్ తెలియక అన్నాను. మీరు కోపంతో ఈ కెఫెని లాక్కోకండని అంటాడు. నేనెందుకు లాక్కుంటానని సూరజ్ అంటే.. ఇదివరకు ఇలాగే మీ అమ్మగారు బలవంతంగా నా రెస్టారెంట్ లాక్కున్నారు. ఇది కూడా లాక్కుంటే రోడ్డున పడతానంటాడు. మీరు అందుకే వచ్చినట్టున్నారు అని మేనేజర్.
బేరాలు ఆడే కొంటాం
దాంతో మాలిని చేసిందంతా చెబుతాడు మేనేజర్. రెస్టారెంట్ పోయి కేఫ్ మిగిలిందంటాడు. ఇంతపెద్ద నింద వేశాక ఇక్కడికే పిలిపించి తేలుస్తానని సూరజ్ అంటాడు. దాంతో మాలిని వస్తుంది. జ్యోత్స్న ఫ్యామిలీది తప్పా ఎవరి దగ్గర లాక్కోలేదని, నేను కొన్నాను అని మాలిని అంటుంది. అది కొనడమేంటని ముందు 4 కోట్లకు బేరం ఆడారు. నేను కొనను అన్నాను. తర్వాత అమ్మితే 2 కోట్లు ఇచ్చారని అతనంటాడు.
అది లాక్కోవడమేగా అమ్మ అని సూరజ్ అంటాడు. ఇది వ్యాపారంరా. బేరాలు ఆడే కొంటాం అని మాలిని అంటుంది. సూరజ్, మాలిని గొడవపడతారు. అతను బాధపడుడుతు ఇచ్చాడంటే లాక్కున్నట్లేగా అని సూరజ్ అంటాడు. నేను అందరిని మోసం చేస్తున్నానని ఈ జ్యోత్స్న చెప్పిందా అని మాలిని అంటుంది. ఒకరు చెబితే నేను వినను నమ్మను నా తల్లిని తక్కువ చేయొద్దని చూస్తానని సూరజ్ అంటాడు.
మన కారణంగా మనకు సంబంధం లేని మనిషి బాధపడుతున్నాడంటే నేను ఒప్పుకోను అని సూరజ్ అంటాడు. నా కొడుకు ముందు చెడ్డదాన్ని చేయడానికే ఇది కంకణం కట్టుకుందని మాలిని మనసులో అనుకుటుంది. సరే అతనికి న్యాయం ఎలా చేస్తే జరుగుతుందో చెప్పమని మాలిని అంటుంది. అతని రెస్టారెంట్ అతనికి ఇచ్చేద్దాం అమ్మా అని సూరజ్ అంటాడు.
2 కోట్లకు 2 కోట్ల 10 లక్షలు
దాంతో మాలిని షాక్ అవుతుంది. ఓకే నాన్న మ్యాటర్ ఓవర్. మీరు ఆఫీస్‌కు రండి మిగతా విషయాలు అక్కడ మాట్లాడుకుందామని మాలిని అంటుంది. తర్వాత కార్తీక్, జ్యోత్స్నతో మేనేజర్ మాట్లాడుతాడు. ఏం జరిగిన ధైర్యంగా మాట్లాడండని జ్యోత్స్న చెబుతుంది. మేనేజర్‌తో మాలిని, సూరజ్ మాట్లాడుతారు. ఆ రెస్టారెంట్ తనకొద్దని, ఇదివరకు ఇవ్వని మిగతా 2 కోట్లు ఇస్తే దూరంగా వెళ్లి రెస్టారెంట్ పెట్టుకుంటానని అతనంటాడు.
దాంతో మాలినితో రూ. 2 కోట్ల చెక్ రాసి ఇప్పిస్తాడు సూరజ్. నాకు ఎవరి ఆస్తి లాక్కోవాలని లేదు. ఆరోజు కూడా మీరు నష్టాల్లో ఉంటేనే తీసుకున్నా. మీరు అడిగిన రెండు కోట్లకు 10 లక్షలు ఎక్కువగా యాడ్ చేసి ఇస్తున్నాను అని మాలిని అంటుంది. ఇంకోసారి మా అమ్మ మంచిది కాదని అనకండి. నా తల్లిని ఎవరు తప్పుడు మనిషిలా గుర్తుపెట్టుకోకూడదని మీకు న్యాయం చేస్తున్నాను అని సూరజ్ అంటాడు.
ఆ చెక్ చూసి మేనేజర్ చాలా సంతోషిస్తాడు. వెళ్లిపోతాడు. వాడు ఈసారి మీ అమ్మ ఫొటో పెట్టుకుని పూజ చేస్తాడు. మిమ్మల్ని, మీ అమ్మగారిని ఆ ఏడుకొండల వెంకటేశ్వరుడు ఎల్లవేలలా కాచి కాపాడుగాక అని దీవించి వెళ్లిపోతాడు కార్తీక్. అంతా వెళ్తారు. అమ్మా నువ్వు తప్పు చేశావంటే తట్టుకోలేనమ్మా. నాన్నకి న్యాయం జరిగింది. అంతటితో వదిలేద్దాం. ఇంకా ఎవరివి లాక్కోవాల్సిన అవసరం లేదు. నిన్నెవరు వేలెత్తి చూపించకూడదని సూరజ్ అంటాడు.
అసలు నువ్వు ఉంటే కదరా
జ్యోత్స్నకు మేనేజర్ థ్యాంక్స్ చెబుతాడు. మీరు థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు కాదు మా బావకి అని జ్యో అంటుంటే.. ఆ మాటలు మాలిని వింటుంది. మీకు న్యాయం జరగడానికి కావాల్సిన సలహా ఇచ్చిందని జ్యో చెబుతుంది. ఇదంతా నడిపించింది నువ్వా అని మాలిని అనుకుంటుంది. అతనికి న్యాయం జరిగింది కానీ అలా అడిగించింది మనమే అని తెలుస్తుందని దీప అంటుంది.
శిక్ష అంటే క్రిమినల్‌ను చంపడం కాదు వాడు చేసిన తప్పును వాడిచేత సరిదిద్దించడం. పిన్ని చేసిన ఒక్కో తప్పును సూరజ్ చేత సరిదిద్దిస్తాం. చివరిగా పిన్నిని జన జీవన స్రవంతిలో కలుపుతాం. చివరికి మన ఆస్తి కూడా పిన్నితో తీసుకుంటాం. అందుకేగా నేను అడుగుపెట్టిందని కార్తీక్ అంటాడు. అప్పటివరకు నువ్వు ఉంటే కదరా అని మాలిని వెళ్లిపోతుంది.
మరోవైపు శౌర్యతో జ్యో ఐస్‌క్రీమ్ దగ్గర ఉంటే.. సూరజ్ కనిపించి పిలుస్తుంది శౌర్య. ఇదివరకు సూరజ్ తినిపించిన ఐస్‌క్రీమ్‌కి బదులు తీర్చుకుంటానని జ్యో అంటుంది. మూడు ఐస్‌క్రీమ్స్ తీసుకుంటుంది. ముగ్గురు తింటారు. బటర్‌ఫ్లై అంటూ శౌర్య వెళ్లిపోతుంది. సూరజ్, జ్యో ఐస్‌క్రీమ్ తింటుంటారు. అటు నుంచే దశరథ, సుమిత్ర నడుచుకుంటూ వస్తారు.
రోడ్డుపై దశరథ్, సూరజ్ గొడవ
జ్యోకి ఐస్‌క్రీమ్ అంటుకుంటే సూరజ్ చెబుతాడు. జ్యోకి అర్థం కాదు. నోరు తెరిచి చెబితే మీ అమ్మ ఏమైనా అంటదా అని జ్యో నిలదీయడంతో జ్యో పెదాలపై ఉన్న ఐస్‌క్రీమ్ తుడుస్తాడు సూరజ్. అది సుమిత్ర, దశరథ చూస్తారు. సూరజ్ కాలర్ పట్టుకుని కోప్పడతాడు దశరథ. మీ అమ్మ కదరా నీతో ఇలాంటి పనులు చేయించేదని దశరథ అంటాడు.
మరి నువ్వేం చేశావం. నీ కూతురు ఆఫీస్‌కు రాకుండా ఆపాలిగా అని సూరజ్ అంటాడు. అది నా సొంతం విషయం అని జ్యో అంటే.. ఆ సొంత విషయమే రోడ్డుకెక్కింది. మీ నాన్న నా కాలర్ పట్టుకుని అడుగుతున్నాడు. తప్పు నాదని ఒప్పుకోమంటావా అని సూరజ్ అంటాడు. కాలర్ వదలమని జ్యో అంటుంది. మరొకసారి నా కూతురుని కలిస్తే అని దశరథ అంటే.. కలుస్తాను. రోజు కలుస్తాను అని ఐస్‌క్రీమ్ తినడానికి కారణాలు చెబుతాడు సూరజ్.
మీకు కారణాలు ఉంటాయి. వాటితో మా జీవితాలు ఎందుకు ఆడుకుంటారు అని సుమిత్ర అంటుంది. నేను మీ కూతురుని మీరు అనుకున్న దృష్టితో చూడట్లేదు. కూతురుని గడప దగ్గర ఆపడం చేతకాదు కానీ రోడ్డు మీద మాత్రం అరుస్తారు అని సూరజ్ అంటాడు. ఎంత మాట అన్నావురా అని సూరజ్ కాలర్ మళ్లీ పట్టుకుంటాడు దశరథ. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.