Karthika Deepam 2 Serial Today Episode: కార్తీక దీపం 2 ఈరోజు ఎపిసోడ్‌లో సూరజ్, దశరథ గొడవ పడుతూనే ఉంటారు. దశరథను జ్యో ఆపుతుంది. సూరజ్‌ను కూడా ఆపేందుకు ట్రై చేస్తుంది. కానీ ఎవ్వరు తగ్గరు. సూరజ్‌ను మతిపోయిందా అని జ్యోత్స్న అంటుంది.
మతిపోయింది వీళ్లకి

మతిపోయింది నాకు కాదు వీళ్లకి. ఎక్కడి కోపం ఎక్కడ చూపిస్తున్నారు. నా క్యారెక్టర్ గురించి తక్కువ మాట్లాడితే ఊరుకోను అని సూరజ్ అంటాడు. నువ్వు ఏం చేసిన చూస్తూ ఉంటానా అని మళ్లీ మీదకు వెళ్తాడు దశరథ. అంతలో శౌర్య వస్తుంది. ఎందుకు కోప్పడుతున్నారని అడుగుతుంది. లేదు మాట్లాడుకుంటున్నారని చెప్పి శౌర్యతోపాటు అంతా వెళ్తారు.
ఇంటికెళ్తారు. శౌర్యను లోపలికి వెళ్లమంటుంది సుమిత్ర. తర్వాత జ్యోత్స్నను లాగిపెట్టి ఒక్కటి కొడుతుంది సుమిత్ర. దాంతో అంతా షాక్ అవుతారు. ఎందుకు జ్యోత్స్నును కొట్టావని కార్తీక్ అడుగుతాడు. ఈరోజు ఇది చేసిన పని నాకు ఎంత కోపం తెప్పించిందో చెప్పడానికి. దీని గురించే ముందు మాలినితో మాట్లాడాలి అని కార్తీక్‌తో ఫోన్ చేయిస్తుంది సుమిత్ర.
నువ్వు నీ కొడుకు కలిసి నా కూతురుని ఏం చేయాలనుకుంటున్నారు. బుద్ధి లేకుండా నా కూతురుని బయట ఎందుకు కలవాలి. అధికారాన్ని అడ్డుపెట్టుకుని నీ కొడుకు నా కూతురుని ఐస్‌క్రీమ్ తినేందుకు తీసుకెళ్లాడు. బుగ్గపై ఐస్‌క్రీమ్ పడితే తుడిచేంత చనువుతో ఉన్నాడు. నీకు సిగ్గు లేదు వాడికి కూడా సిగ్గులేదా. గాలికి వాన్ని వదిలేశావా. అమ్మాయిల జీవితాలను నాశనం చేయరా అని లైసెన్స్ ఇచ్చావా అని సుమిత్ర రెచ్చిపోయి మాట్లాడుతుంది.
మాలినికి మాటకు మాట తిరిగి ఇచ్చిన సుమిత్ర
సూరజ్ చాలా మంచివాడమ్మా అని దక్షిణామూర్తి అంటే.. శివ నారాయణ అరుస్తాడు. అంతా గొడవ పడతారు. మాలిని నీ కొడుకును అదుపులో పెట్టుకోవడం చేతకాకపోతే చెప్పు నేను అదుపులో పెడతాను. నీ కొడుకు మంచి సంబంధం చూసి పెళ్లి చేయి. కొడుకును కంటే కాదు పెంచడం తెలయాలి. నా కూతురుపైకి నీ కొడుకును ఎగదోస్తున్నావ్ అని ఇదివరకు మాలిని అన్నట్లే సుమిత్ర అంటుంది.
{{/usCountry}}సూరజ్ చాలా మంచివాడమ్మా అని దక్షిణామూర్తి అంటే.. శివ నారాయణ అరుస్తాడు. అంతా గొడవ పడతారు. మాలిని నీ కొడుకును అదుపులో పెట్టుకోవడం చేతకాకపోతే చెప్పు నేను అదుపులో పెడతాను. నీ కొడుకు మంచి సంబంధం చూసి పెళ్లి చేయి. కొడుకును కంటే కాదు పెంచడం తెలయాలి. నా కూతురుపైకి నీ కొడుకును ఎగదోస్తున్నావ్ అని ఇదివరకు మాలిని అన్నట్లే సుమిత్ర అంటుంది.
{{/usCountry}}నాలో తల్లి ఆవేశాన్ని నువ్వు పూర్తిగా చూడలేదు. చూడాలనుకోకు. ఇలా మాటలతో వదిలేయను. పీఏ అంటే ఆఫీస్ వరకే. బయట ఐస్‌క్రీమ్ తినిపించడానికి కాదు అని సుమిత్ర వార్నింగ్ ఇచ్చి కాల్ కట్ చేస్తుంది. మాలిని అవమానంగా ఫీల్ అవుతుంది. ఇప్పుడు ఏం జరిగిందో అందరికి అర్థమయిందిగా అని సుమిత్ర అంటుంది. అందరికి అర్థమైంది. కానీ మీకే కాలేదని జ్యోత్స్న లోపలికి వెళ్తుంది.
వెళ్లనివ్వండి. అక్కడ మీరు ఏం చూశారో తెలియదు కానీ అందులో జ్యోత్స్న తప్పు ఉండదని నేను నమ్ముతున్నాను అని దీప అంటుంది. అయినా నా బంగారమే సరిగ్గా ఉంటే ఎవరినో అనాల్సిన అవసరం రాదని దక్షిణామూర్తితో అంటుంది మాలిని. సూరజ్ వచ్చి ఏమైందని అడుగుతాడు. వెటకారంగా మాట్లాడుతుంది మాలిని. నీ మేనత్త తిట్టినతిట్టి తిట్టకుండా తిట్టిందని సుమిత్ర అన్నదంతా చెబుతుంది.
చాలా పెద్ద డ్యామేజ్ జరిగింది
మీరిద్దరు మనింట్లో సోఫాలో కూర్చుని తినండి. నేను ఐస్‌క్రీమ్ ఆర్డర్ తెప్పిస్తానంటుంది. చాలా పెద్ద డ్యామేజ్ జరిగింది. మీ అత్త నన్ను మాములుగా తిట్టలేదు. నువ్వు ఐస్‌క్రీమ్ తినలేదని నువ్వు చెబుతున్నావ్. నేను ఏం చేయాలో. వాళ్లందరికి ఎలా సమాధానం చెప్పాలో చెబుతాను అని మాలిని కోపంతో రగిలిపోతుంది. అది నిజమే అమ్మా. జరిగింది ఒకటి అర్థం చేసుకుంది ఇంకోటి మాట్లాడింది మరోటి. జ్యోత్స్న శౌర్యతో వచ్చిందని సూరజ్ చెబుతుంటాడు.
నువ్వు వివరంగా చెబితేనే నేను అర్థం చేసుకుంటే మన మధ్య ఉన్న బంధానికి పాడే కట్టేసినట్లే. మీ అత్త నన్ను తిట్టేందుకు అవకాశం నువ్వు ఇచ్చావు అని మాలిని అంటుంది. నువ్వైనా ఆపుగా అమ్మా. ఇదివరకు అస్సలు మాట్లాడకపోయేవాళ్లు. ఇప్పుడు కోపం వస్తే వెంటనే కాల్ చేస్తున్నారంటే కాస్తా దగ్గరైనట్లేగా అని దక్షిణామూర్తి షాక్ ఇస్తాడు. ఇది ఇలాగే జరిగితే ఇంటికే వస్తారనని మాలిని అంటుంది. అది కావాల్సిందేగా అని దక్షిణామూర్తి అంటాడు.
మీకు ఇలా అర్థమైందా అని మాలిని మనసులో అనుకుంటుంది. మనం తప్పుచేసినట్లు అయింది. మనం ఒకరిచేత మాటలు పడాల్సిన అవసరం ఏముంది. అది అర్థం చేసుకుంటే చాలని వెళ్లిపోతుంది మాలిని. రేయ్ మనవడ మీ అత్త తిట్టింది కాస్తా బాధగా అనిపించినా నువ్వు జ్యోత్స్న ఐస్‌క్రీమ్ తిన్నారన్నది సంతోషంగా ఉందని దక్షిణామూర్తి అంటాడు.
ఎవరి కంటపడకుండా తినండి
సూరజ్ చెప్పిన దక్షిణామూర్తి వినిపించుకోడు. ఎవరికి కంటపడకుండా ఇవన్ని చేయమని దక్షిణామూర్తి వెళ్లిపోతాడు. మరోవైపు జ్యోత్స్నకి కాఫీ ఇచ్చి తాగమంటుంది సుమిత్ర. నీ చేతలు బాధపడేలా ఉంటున్నాయంటుంది. నేనేం తప్పు చేయలేదు. అది నమ్మాలిగా. తప్పు చేయాల్సిన మనిషిగా చూస్తున్నారని అడుగుతుంది జ్యోత్స్న.
తల్లిదండ్రులుగా మేము తప్పు చేశాం. దాన్ని సరిదిద్దుకుంటాం. నీకు పెళ్లి చేయాలనుకుంటున్నాం. సంబంధాలు అడిగితే అమ్మాయి ఇంటిపట్టునే ఉంటుందని చెబుతాం. ఆఫీస్‌కు వెళ్లకని సుమిత్ర వాళ్లు అంటారు. నేను పెళ్లి చేసుకోను జ్యోత్స్న అంటుంది. ఇప్పిటికీ 3 సార్లు పెళ్లి ఆగిపోయింది. నా మనవరాలి జీవితం ఇలా అయిపోయిందని రోజు బాధపడుతుంటానని శివ నారాయణ అంటాడు.
నా జీవితం ఇది. మరి నాకెలా ఉంటుందని జ్యోత్స్న అంటుంది. పెళ్లే చేసుకోవా. సూరజ్‌ను తప్పా ఇంకెవరిని చేసుకోవా అని సుమిత్ర నిలదీస్తుంది. కార్తీక్ అడ్డుపడితే నీకెం తెలుస్తుందిరా దాని బాధ అని పారిజాతం వారిస్తుంది. నా వల్ల మీకు ఇబ్బంది అయితే చెప్పండి నేను బయటకు వెళ్తానంటుంది జ్యోత్స్న. దీప తిడుతుంది. జ్యోత్స్న పెళ్లి చేసుకోను అంటుంది.
సూరజ్‌నే పెళ్లి చేసుకుంటాను
సూరజ్‌ను చేసుకుంటావా అని పారు అంటే.. నువ్వు మాట్లాడకు అని జ్యో అంటుంది. ఎందుకు మాట్లాడకూడదని పారిజాతం అంటుంది. మా అమ్మనాన్న నా పెళ్లి గురించి మాట్లాడుతున్నారు. మధ్యలో నీకేంటీ సంబంధం. ఎంతమందికని ఒకేసారి సమాధానం చెప్పగలను. అవును నీకు సంబంధం లేదు అని షాక్ ఇస్తుంది జ్యోత్న్న.
సంబంధం ఉంది. నాకే సంబంధం ఉంది. అది నా మనవరాలు. అది నా సొంత మనవరాలు. నీ జీవితం గురించి నేను ఆలోచించకూడదా. నాకు విలువ లేదా. సూరజ్ గాడిని మనసులో పెట్టుకుని అంటుంది. చూస్తుంటే వాడినే పెళ్లి చేసుకునేలా ఉందని కోప్పడుతుంది పారిజాతం. అవును, సూరజ్‌నే పెళ్లి చేసుకుంటాను అని పెద్ద షాక్ ఇస్తుంది జ్యోత్స్న.
అంతా మనం అనుకున్నట్లే మన భవిష్యత్తు ఉంటే ఇప్పుడు మనం ఇలా ఉండేవాళ్లం కాదుగా. నాకు కొన్ని గోల్స్ ఉన్నాయి. అవి రీచ్ అయ్యాక పెళ్లి చేసుకుంటాను. ఆ గోల్స్ తర్వాత చెబుతాను. మనకు పోయినవన్నీ తిరిగి వచ్చాకా పెళ్లి చేసుకుంటాను. మన నుంచి లేగేసుకున్నవన్నీ తిరిగి రావాలి. అది డబ్బు, ఆస్తి, పరువు, పేరా, మర్యాద అన్ని తిరిగిరావాలి. అన్ని తిరిగి రప్పిస్తా అని జ్యోత్స్న అంటుంది.
ఆస్తులన్నీ తిరిగి తీసుకొస్తాను
ఇది పెద్ద సుడిగుండం అమ్మా అని దశరథ అంటే.. చావుకు తెగించినవాడికి సుడిగుండం ఏంటీ అగ్నిగుండం ఏంటి. ఏదైనా పర్వాలేదు. నేను లూజర్‌ని కాది ఫైటర్‌ని. నా మీద మీకు నమ్మకం ఉంది. మీ మీద నాకు ప్రేమ ఉంది. నాకోసం అన్ని కోల్పోయారు. మీకోసం అవన్నీ నేను తిరిగి తీసుకొస్తాను. ఆరోజు అడుగుతాను నాకు పెళ్లి చేయమని. అప్పటివరకు నన్ను ఏం అడగొద్దు అని జ్యో అంటుంది. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.