...
...
Next Story

Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2- మాలినిని దెబ్బకొట్టిన కార్తీక్- మెచ్చుకున్న శివ నారాయణ- జ్యోత్స్న మాయం

Karthika Deepam 2 Serial October 10th Episode: కార్తీక దీపం 2 సీరియల్ అక్టోబర్ 10వ ఎపిసోడ్‌‌‌లో జ్యోత్స్న కోసం సుమిత్ర ఏడుస్తుంటే బిడ్డ మీద ఒట్టు అని చెప్పి మరి అన్నం తినిపిస్తుంది దీప. మాలిని పెట్టించిన టిఫిన్ బండి దగ్గరికి వెళ్లి మొత్తం టిఫిన్స్ కొంటాడు కార్తీక్. 10 వేలు అడ్వాన్స్ కూడా ఇస్తాడు.

Published on: Oct 10, 2026, 07:38:09 IST
Advertisement

Karthika Deepam 2 Serial Today Episode: కార్తీక దీపం 2 ఈరోజు ఎపిసోడ్‌లో గుమ్మం ముందు ఉండి సుమిత్ర ఏడుస్తుంటుంది. ఇంతలో దీప వచ్చి భోజనం చేయమంటుంది. సుమిత్ర ఏడవటం చూసి ఏమైందమ్మా అని దీప అడుగుతుంది. నీ కూతురు ఇంట్లో ఉంది కాబట్టి నీకు తెలియట్లేదు. కానీ, నా కూతురు వస్తా అని ఇంకా రాలేదని సుమిత్ర అంటుంది.

100 కారణాలు ఉండొచ్చు

కార్తీక దీపం 2 సీరియల్ అక్టోబర్ 10 ఎపిసోడ్
కార్తీక దీపం 2 సీరియల్ అక్టోబర్ 10 ఎపిసోడ్

జ్యోత్స్న వస్తానందిగా వస్తుంది. ఫోన్‌లో చార్జింగ్ లేదేమో, ఇంకా 100 కారణాలు ఉండొచ్చు అని కార్తీక్ అంటాడు. సూరజ్ కోసం వెంటపడే మనిషి ఉండదని మాలిని బెదిరించిన విషయం కార్తీక్ గుర్తు చేసుకుని జరుగుతున్నదానికి సరిగ్గా సరిపోయిందని కార్తీక్ అనుకుంటాడు. కానీ, సుమిత్రకు మాత్రం భోజనం పెట్టమని దీపకు చెబుతాడు.

మరోవైపు జ్యోత్స్న ఇంకా రిప్లై ఇవ్వకపోవడంతో సూరజ్ కోప్పడతాడు. ఇక ఆఫీస్‌కు రావాల్సిన అవసరం లేదు. పీఏగా ఉండాల్సిన పనిలేదని వాయిస్ మెసేజ్ పెడతాడు సూరజ్. ఇంతలో దక్షిణామూర్తి వచ్చి నవ్వుతాడు. సూరజ్ కోప్పడితే.. పైకి కోపం కాదు లోపల ప్రేమ కనిపిస్తుందంటాడు. అదేం లేదని సూరజ్ అంటే.. మరెందుకు జ్యోని పీఏగా సంతకం చేశావని తాత అడిగితే.. నీ మీద గౌరవంతో పెట్టానంటాడు సూరజ్.

అదే గౌరవంతో జ్యోత్స్న మెడలో తాళి కడతావా అని దక్షిణామూర్తి అంటాడు. జ్యోత్స్న మన శత్రువు కూతురు అని సూరజ్ అంటాడు. జ్యోత్స్న రక్తంలో దశరథ రక్తం ఉండొచ్చు కానీ, నా కూతురు రక్తం కూడా ఉంది. నీ మనసులో వన్ పర్సంట్ ప్రేమ ఉన్నా జ్యోత్స్నతో నీ పెళ్లి చేస్తానని దక్షిణామూర్తి అంటాడు. సూరజ్ మాట దాటేస్తాడు.

బిడ్డ మీద ఒట్టేసి

శౌర్య కూడా వస్తుంది. అటు తల్లికి ఇటు కూతురుకి ఇద్దరికి దీప అన్నం తినిపిస్తుంది. చందమామను చూపి బిడ్డకు అన్నం తినిపించినట్లు నా కూతురు పేరు చెప్పి నాతో తినిపించావని సుమిత్ర అంటుంది. జ్యోత్స్న కోసం తాను ఉంటానని చెప్పి సుమిత్రను పడుకోమంటాడు కార్తీక్. అమ్మమ్మ నీ దగ్గరే పడుకుంటానని సుమిత్రతో వెళ్లిపోతుంది శౌర్య.

జ్యోత్స్న ఇంకా రాకపోవడం ఏంటీ. మాలిని అత్త ఏమైనా.. ఇంట్లో అందరికి నిజం చెప్పేద్దామని జ్యోత్స్న అంటుంది. అది జ్యోత్స్న చెప్పాలి. రేపు ఎలాగైన ఆఫీస్‌కు రావాలి. తర్వాత ఇంటికి తీసుకొచ్చి నిజం చెప్పిద్దామని కార్తీక్ అంటాడు. మరుసటి రోజు ఉదయం టిఫిన్ బండి దగ్గర మూడు రకాల చట్నీలు చేశామని శివ నారాయణ చెబుతాడు.

మొత్తం టిఫిన్స్ కొన్న కార్తీక్

ఒక నిమిషం తర్వాత దీప, మాస్టారు మీరిద్దరు చెరో గిన్నె పట్టుకొచ్చేయండని కార్తీక్ అంటాడు. ఏం చేయబోతున్నావురా అని శ్రీధర్ అంటే.. ముల్లును ముల్లుతోనే తీయబోతున్నాం అని మాలిని టిఫిన్ బండి దగ్గరికి వెళ్తాడు కార్తీక్. ఏవండి గిరి గారు అని కార్తీక్ అక్కడున్న వర్కర్‌ని పిలుస్తాడు. మీరేనా నన్ను ఇంత మర్యాదగా పిలిచింది అని అతనంటాడు.

నాకు మనుషులంటే గౌరవం అని చెప్పి టిఫిన్స్ 20 రూపాయలకేనా అని అడుగుతాడు. అవును సర్ అని అతనంటాడు. అయితే, మొత్తం టిఫిన్స్ కావాలి. అమ్ముతావా అని కార్తీక్ అడుగుతాడు. అమ్ముతానని గిరి అంటాడు. అయితే, ఈ నిమిషం నుంచి ఈ బండి దగ్గరున్న టిఫిన్స్ అన్ని నావే. ఎవరికి అమ్మొద్దు. నా పార్సల్స్ అయిపోయాకే అమ్ముకోవాలని కార్తీక్ చెబుతాడు.

ఓకే సర్ మీలాంటి గోల్డెన్ కస్టమర్ కోసమే ఎదురుచూస్తున్నాను అని గిరి అంటాడు. కార్తీక్ విజిల్ కొడతాడు. దాంతో గిన్నెలు పట్టుకుని దీప, శ్రీధర్ వస్తారు. గిరి అందులో టిఫిన్స్ వేస్తాడు. అదంతా చూసిన దశరథ వాడి ప్లాన్ నాకు అర్థమవుతుంది నాన్న అని అంటాడు. వాడిది మాస్టర్ మైండ్‌రా అని శివ నారాయణ మెచ్చుకుంటాడు. మొత్తం 70 ప్లేట్స్ అయ్యాయి సర్ అని గిరి అంటాడు.

10 వేల అడ్వాన్స్

కార్తీక్ డబ్బులిస్తాడు. దీప, శ్రీధర్ టిఫిన్స్ తీసుకెళ్లిపోతారు. ఇవే కాకుండా నా ఆర్డర్ ఫినిష్ అయ్యేవరకు ఎవరికి అమ్మడానికి వీళ్లేదు అని రూ. 10 వేలు అడ్వాన్స్ ఇస్తాడు కార్తీక్. ఆ డబ్బు గిరి తీసుకుంటాడు. చాలా మంది కస్టమర్స్ వస్తారు. ఇక్కడ టిఫిన్స్ అయిపోయాయి. ఆ ఎదురుగా ఉన్న బండి దగ్గరికి వెళ్లండని కార్తీక్ చెబుతాడు. దాంతో అంతా వెళ్లిపోతారు.

ఏంటీ సర్ అలా పంపించారని గిరి అడుగుతాడు. ఎక్కడికి పంపిస్తేంటయ్య.. నీకు కావాల్సింది ప్లేట్‌ 20 రూపాయలకు అమ్మడం. నీ టిఫిన్స్ మొతమతం ఒకేసారి అమ్ముడుపోతుంది అంతేగా అని కార్తీక్ అంటే.. అంతే సర్ అని గిరి అంటాడు. మరి ఇంకా బోర్డ్ ఎందుకు అని బోర్డ్ మీద ఈరోజు ఇక్కడ టిఫిన్స్ లేవు అని రాస్తాడు కార్తీక్.

ఈ బోర్డ్ ఇలాగే ఉండాలి. నేను మళ్లీ వస్తాను బజ్జీలు, ఇడ్లీలు రెడీ చేయమని చెప్పి కార్తీక్ వెళ్లిపోతాడు. గిరి సరేనంటాడు. శివ నారాయణ బండి దగ్గరికి వెళ్లి అందరికి టిఫిన్స్ ఇవ్వండి. సాధారణంగా ప్లేట్ 40 రూపాయలు. కానీ, ఇవాళ స్పెషల్ ఆఫర్ కింద 20 రూపాయలే అని కార్తీక్ చెబుతాడు. అదంతా మాలిని బాడీగార్డ్ విజయ్ వీడియో తీస్తుంటాడు.

10 రూపాయల లాభం

అక్కడ 20కి కొన్నాం. ఇక్కడ 30కి అమ్ముతున్నాం. కష్టపడకుండానే 10 రూపాయలు లాభం. అక్కడ కొనడం ఇక్కడ అమ్మడం. ఏమంటావ్ సత్తిబాబు అని కార్తీక్ అంటాడు. చాకులా నువ్వు ఉన్నాకా ఏమంటాను. ఏం పెద్దమనిషి ఇతను చెప్పింది విను ఎక్కడికో వెళ్తావ్ అని శివ నారాయణతో అంటాడు సత్తిబాబు. అలా విని ఎక్కడో ఉన్న మమ్మల్ని ఇక్కడికి తెచ్చాడని తాత అంటాడు.

నువ్వు సాధించావయ్యా. తెలివితేటలతో కొట్టావ్. నచ్చావ్. ఇక నీకు తిరుగులేదు అని సత్తిబాబు వెళ్తాడు. నీది మాస్టర్ మైండ్‌రా. కానీ దాంతో ఎదుటివాళ్లను మోసం చేయడానికే పనికి వస్తుంది. అప్పుడు మమ్మల్ని ఇప్పుడు వాళ్లని అని శివ నారాయణ అంటాడు. మంచే జరిగింది మావయ్య గారు అని శ్రీధర్ అంటే.. అవును ఫొటో కూడా పెట్టుకోవాలని తాత అంటాడు.

ఫొటో పెట్టుకునే రోజు కూడా రావొచ్చు మావయ్య గారు. నా కొడుకు కొట్టిన దెబ్బ మాలినికి తగిలే ఉంటుందని శ్రీధర్ అంటాడు. విజయ్ వీడియో తీసింది చూసిన మాలిని షాక్ అవుతుంది. ఏమైందని విజయ్‌కి కాల్ చేసి అడుగుతుంది మాలిని. కార్తీక్ తెలివితో దెబ్బ కొట్టాడు. మన టిఫిన్స్ కొనేసి వాళ్ల దగ్గర అమ్ముతున్నాడని చెబుతాడు విజయ్.

దెబ్బ మీద దెబ్బ కొట్టడం

మీలాంటి దద్దమ్మలను నమ్ముకుంటే ఇలాగే ఉంటుందని. వస్తానని మాలిని అంటుంది. తన నెక్ట్స్ ఆర్డర్ గురించి గిరిని అడుగుతాడు కార్తీక్. ఇంతలో మాలిని వస్తుంది. ఏంటీ పిన్ని ఇలా వచ్చావ్. నీ కొత్త వ్యాపారం ఎలా ఉందో చూద్దామని వచ్చావా. ఇది నువ్వు పెట్టించిన బండి అని నాకు నిన్ననే డౌట్ వచ్చింది అని కార్తీక్ వెటకారంగా అడుగుతాడు.

అందుకేనా మోసం చేసి గెలుస్తున్నావ్ అని మాలిని అంటుంది. దీన్ని తెలివితేటలు అంటారు. దెబ్బ మీద దెబ్బ కొట్టడం అంటారు. నువ్వు మరీ ఇంత దిగజారిపోయావేంటీ అత్తా. లాక్కున్న రెస్టారెంట్స్ సరిపోలేదా. ఇది కూడా లాక్కోవాలో అని దీప అంటుంది. నీ బండి దగ్గర నేను మొత్తం టిఫిన్స్ కొన్నాను. ఇది నేను నీకు ఆఫర్ ఇచ్చినట్లు అని కార్తీక్ అంటాడు.

మాలిని చేసింది గుర్తు చేస్తూ అలా చేస్తే తప్పు మేము న్యాయబద్ధంగా చేస్తున్నామని కార్తీక్ అంటాడు. కష్టం మీది లాభం మాది అని దీప అంటుంది. గిరిని పిలిచి ప్రస్తుతం నీ దగ్గరున్న సరుకు అంతా నాకే అమ్మాలి. అడ్వాన్స్ ఇచ్చానని మాలినికి అర్థమయ్యేలా చెబుతాడు కార్తీక్.

రేపటి నుంచి కనపడను సర్

బాబు గిరి నీతో ఈ టిఫిన్ బండి ఎవరు పెట్టించారో బట్టబయలు అయిపోయింది కాబట్టి రేపటి నుంచి నువ్వు కనపడకు. కనిపిస్తే మొదట నేను నోరు వాడతాను. తర్వాత తెలివి వాడతాను. అది కూడా కాకపోతే చివరిలో చేయి వాడతాను అని కార్తీక్ అంటాడు. అర్థమైంది సర్ రేపటి నుంచి కనపడం అని గిరి భయంతో అనేసి వెళ్లిపోతుంది. పెట్టిన మనకే లాభమని దీప అంటుంది.

మాలిని పిన్నిని తక్కువ అంచనా వేయలేం. తినేదాంట్లో ఏమైనా కలపొచ్చు అని కార్తీక్ అంటాడు. అంతలా దిగజారిపోలేదని మాలిని అంటే.. నీ గురించి నాకు తెలియదా అత్తా. నీ కొడుకు విషయంలో మా బావ తెలివిగానే ఉన్నాడు. కానీ, నేనే గుడ్డిగా నమ్మాను లేదంటే పెళ్లి మండపంలో కాదు అని దీప అంటుంది. ఇంకా ఆ కథలెందుకులే. దెబ్బ కొట్టడం నీకే కాదు మాకు వచ్చు. నీది దొంగ దెబ్బ మాది స్ట్రైట్ దెబ్బ చెప్పే కొడతాం అని కార్తీక్ అంటాడు.

అత్తకు నోరు పడిపోయినట్టుందని దీప అంటుంది. ఎందుకు వాగడంలే అని ఊరుకున్నా. పెద్దవాళ్లు చేసే పనులు పిల్లలకు అర్థం కాకపోవచ్చురా. ఒక తప్పును గుర్తించకుండా చేయడానికి ఒక సమస్యను ముందుకు తీసుకురావడమే తెలివి అనుకుంటే అప్పుడు అసలు విషయం వదిలేసి అందరూ సమస్య గురించే మాట్లాడుకుంటారు. నా చేతలు ఊహతీతంగా ఉంటాయి. దెయ్యాల్లా మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటాయి అని మాలిని అంటుంది.

జ్యోత్స్న మాయం

ఒకటి మేము ఓడిపోయామని మీరు ఒప్పుకోవాలి. రెండు మా మామగారు క్షమించమని అడిగే ఆఫర్‌ను మీ తాత ఓకే చేయాలి. ఈ రెండు జరగనంతకాలం ఈ మాలిని అనే నీడ వెంటాడుతూనే ఉంటుంది. అవును మీ జ్యోత్స్న కనిపించడంలేదు. ఎక్కడుంది. ఎక్కడ ఉంటే ఏంటీలే. మీ తాత టిఫిన్ బండి జాగ్రత్త అని మాలిని చెప్పి వెళ్లిపోతుంది.

దాంతో కార్తీక్, దీప షాక్ అవుతారు. జ్యోత్స్న గురించి తెలిసే అడిగిందా లేదా మనకు ఏదైనా తెలియాలని చెప్పిందా అని దీప డౌట్ పడుతుంది. జ్యోత్స్నను ఏదో చేసినట్లు హింట్ ఇచ్చి మాలిని వెళ్లినట్లు అర్థం అవుతుంది. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks