Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2- తల్లికొడుకుల ఫ్యూజులు అవుట్- దక్షిణామూర్తితో ట్విస్ట్ ఇచ్చిన జ్యోత్స్న
Karthika Deepam 2 Serial October 3rd Episode: కార్తీక దీపం 2 సీరియల్ అక్టోబర్ 3వ ఎపిసోడ్‌లో ఆఫీస్ ముందు జ్యోత్స్న ఉంటుంది. సూరజ్ వచ్చి లాభం లేదంటే గతంలో బతుకున్నాడని కౌంటర్ ఇస్తుంది. జ్యోత్స్న పీఏగా ప్రయత్నించడం గురించి కార్తీక్, దీపతో హేళనగా మాలిని మాట్లాడుతుంది. అంతలోనే జ్యోత్స్న పీఏగా వస్తుంది.
Karthika Deepam 2 Serial Today Episode: కార్తీక దీపం 2 ఈరోజు ఎపిసోడ్‌లో తొలిరోజే టిఫిన్ బండికి నష్టాలు వచ్చాయని, ఒక్కరు కూడా కొనలేదని పారిజాతం చెబుతుంది. ఇడ్లీలు వేస్ట్ కాకుండా నీ స్టైల్‌లో ఉప్మా చేయి. ఈరోజు అందరం ఉప్మానే తిందాం. అసలే తాతకు ఫుడ్ వేస్ట్ చేయడం నచ్చదని కార్తీక్ అంటాడు.

మనమీద మనకే నమ్మకం పోతుంది
నువ్వు ఆ మాట అంటే ఫుడ్ వేస్ట్ కాదు నేను వేస్ట్ అన్నట్లుంది. కొంతమంది మన పక్కన ఉంటే మనమీద మనకే నమ్మకం పోతుంది. నేను ఇడ్లీ బండి తీసుకోడానికి కారణమే కార్తీక్. వాడు అక్కడికి రాకుంటే వాడు ఆ మాటలు అనేవాడు కాదు. వాడితో నేను పౌరుషానికి పోయి ఇడ్లీ బండి తీసుకునేవాన్ని కాదు. నా కర్మకు ఇంకెవరినో బాధ్యులను చేయడమెందుకులే. మీకు కావాల్సింది మేము ఇలా ఉండటమేగా అని తాత అంటాడు.
దమ్మిడి సంపాదన లేదు. వేడి నీళ్లు పోసుకుంటే కానీ ఈ నీరసం పోదు. ఏం కర్మ వచ్చిందిరా కుటుంబానికి అని పారిజాతం వెళ్లిపోతుంది. తాత అన్న మాటలకు బయటకు వెళ్లిపోతాడు. దీప వెళ్లి మాట్లాడుతుంది. జ్యోకి జాబ్ దొరకలేదు. తాత టిఫిన్ బండి తొలిరోజే అట్టర్ ఫ్లాప్. మనం ఏం మాట్లాడిన నెగెటివ్ అయిపోతుంది. మాలిని కొట్టిన దెబ్బకు అందరి జీవితాలు చెల్లాచెదురు అయిపోయాయి అని కార్తీక్ అంటాడు.
మరుసటి రోజు ఉదయం ఆఫీస్‌కి జ్యోత్స్న వస్తుంది. అక్కడికి సూరజ్ వస్తాడు. రెజెక్ట్ చేశానుగా. మళ్లీ ఎందుకు వచ్చావని సూరజ్ అడిగితే.. నేనెందుకు వచ్చానో నీకెం తెలుసు అని వాదిస్తుంది. నా ఆఫీస్ ముందు ఎందుకున్నావని సూరజ్ అడుగుతాడు. ఇది మా తాత ఆఫీస్. ఒకరిది అని చెప్పుకోడానికి అర్హత ఉండాలని జ్యో అంటుంది.
గతంలో బతుకుంది నువ్వు
మా అమ్మ ఐదోతనం లాక్కున్నదానికి ఇది చాలా తక్కువ. మీ ఆఫీస్ ముందు మీరే ఇలా నిల్చోడం తప్పని శిక్ష అని సూరజ్ అంటాడు. నీకో పవర్‌ఫుల్ కోట్ చెప్పనా.. ఈ సమయం వెళ్లిపోతుంది.. మనల్ని సంతోషపెట్టేదైనా, బాధపెట్టేదైనా నిలబడదు. వెళ్లిపోతూనే ఉంటుంది. ఈ ఆఫీస్ నిన్న మాది ఇవాళ మీది రేపు ఇంకెవరిదో అని జ్యో అంటుంది.
నువ్వు అయితే గతంలో, భవిష్యత్తులో బతుకుతావ్ తప్పా ప్రజెంట్‌లో బతకట్లేదని సూరజ్ అంటాడు. నువ్వు పుట్టకముందు జరిగినదానికి ఇప్పుడు పగ తీర్చుకుంటున్నావ్ అంటే గతంలో బతుకుతుంది నువ్వా నేనా. నా పరిస్థితి తెలిసి జాబ్ కోసం తిరుగుతున్నాను అంటే ప్రజెంట్‌లో బతుకుతుంది నువ్వా నేనా. నేను ఇక్కడ నిల్చుంటే ఏదో జరుగుతుందని భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంది నువ్వా నేనా అని దిమ్మతిరిగే కౌంటర్ ఇస్తుంది జ్యోత్స్న.
నిజాన్ని ఒప్పుకోడం రానివాళ్లకు 100 అబద్ధాలు మనకు రెడీగా ఉంటాయని సూరజ్ అంటే.. నిజాన్ని చూడలేనివానికి ప్రాక్టికల్‌గా చెప్పే 100 ఉదాహరణలు అబద్ధాలుగానే కనిపిస్తాయని జ్యో అంటుంది. సూరజ్ గురించి వ్యాసం రాయమంటే 10 పేజీలు అనర్గలంగా రాయగలను. నాతోపాటు పోటీ పడి మీ అమ్మ ఎగ్జామ్ రాసిన నేనే ఫస్ట్ వస్తానని జ్యోత్స్న అంటుంది.
మీ అమ్మ గెలవనివ్వట్లేదుగా
మా అమ్మకంటే బాగా అర్థమయ్యానా అని సూరజ్ అంటాడు. అమ్మలకంటే అమ్మాయిలకే బాగా అర్థం అవుతారు. నువ్వు అర్థం లేనివాడివని అర్థమైంది. ఈ వ్యాధి ఈ మధ్య మొదలైంది. ఇంతకుముందు అర్థవంతంగా మాట్లాడేదాన్ని. ఒకన్ని లవ్ చేసి గొయ్యిలో పడ్డాను. తీరా చూస్తే అది నుయ్యి అని అర్థమైంది. మరి ఇంత లోతులో పడిపోయాను ఏంట్రా అనుకుని రోజుకో మోటివేషన్‌తో పైకి ఎక్కుతున్నా. కానీ మీ అమ్మ నువ్వు గెలవనివ్వట్లేదని జ్యో అంటుంది.
అందుకే ఓడించేవాళ్లతోనే యుద్ధం చేస్తున్నా. ఆలోచనలతో అని జ్యో అంటే.. ఓడిపోతావ్ అని సూరజ్ అంటాడు. గెలవలాంటే ముందు ఓడిపోవాలి అని జ్యోత్స్న అంటుంది. నువ్వు అనుకుంది జరగదు వెళ్లు అని సూరజ్ వెళ్లిపోతాడు. వచ్చింది పోడానికి కాదబ్బాయి.. కాసేపు వచ్చింది ఎందుకో తెలుస్తుందని జ్యో అనుకుంటుంది.
మరోవైపు కార్తీక్, దీపతో మీకు అదృష్టం కలిసిరావట్లేదు కదూ. జ్యోత్స్నని సూరజ్‌కి దగ్గర చేసేందుకు ప్రయత్నిస్తున్నారుగా. మేము పీఏగా కండక్ట్ చేస్తున్న ఇంటర్వ్యూకి జ్యోత్స్న ఎందుకు వచ్చిందని మాలిని అంటుంది. తమకు తెలియదని కార్తీక్, దీప అంటారు. ఇంత సహజంగా నటిస్తున్నారు కాబట్టే ఇన్నేళ్లైనా మీకు ఫ్యాన్స్ తగ్గలేదని మాలిని అంటుంది.
జ్యో అనుకుంటే సాధిస్తుంది
నిన్న నా కొడుకు రెజెక్ట్ చేశాడు. ఏడుపొక్కటే తక్కువ దాని మొహంలో అని మాలిని అంటుంది. జ్యోత్స్న సంగతి నాకు బాగా తెలుసు. సూరజ్ దగ్గర జ్యోత్స్న పీఏగా జాయిన్ అవ్వాలనుకుందంటే దాన్ని ఆపడం నీ జేజమ్మ వల్ల కూడా కాదు. మనసు పెట్టి చేస్తే ఎంత దూరమైన వెళ్తుంది. నువ్వు జ్యోని ఆపలేవని సూరజ్ అంటాడు. మరోవైపు శివ నారాయణ టిఫిన్ బండి దగ్గరికి ఓనర్ సత్తిబాబు వచ్చి ఈరోజు కూడా ఎవ్వరు రారు అంటాడు.
దాంతో ఇడ్లీ ఫ్రీ అని బోర్డ్ రాసిపెడతాడు శివ నారాయణ. నా టిఫిన్ బండిని ధర్మసత్రం చేశావు కదయ్యా అని సత్తిబాబు అంటాడు. ఇంతలో ఒకతను వచ్చి ఇడ్లీ అడుగుతాడు. ఇడ్లీ తిని ఇంత బాగుంది. ఫ్రీగా ఎందుకు పెట్టారు. పక్కన జ్యోత్స్న రెస్టారెంట్ ఉంది. అచ్చం అదే క్వాలిటీతో ఉంది. ఇలాంటి చట్నీ ఎప్పుడు తినలేదు. ఫ్రీ అని పెట్టాల్సిన అవసరం లేదని కస్టమర్ అంటాడు.
ఇంతమంచి టిఫిన్ చేసి ఊరికే పోలేను. 40 రూపాయలు తీసుకోండి. పర్లేదు మీరు 40కి అమ్మొచ్చు అని బోణీ చేసి వెళ్లిపోతాడు అతను. ఆ కస్టమర్ వెళ్లి మరొకరికి చెబుతాడు. మీ వ్యాపారసూత్రం నిలబడిందండి. మీరు కస్టమర్స్‌ని సృష్టించారు అని పారిజాతం అంటుంది. అలా కస్టమర్స్ వస్తూనే ఉంటారు. అందరూ సూపర్‌గా ఉందని తింటుంటారు.
క్షమించమన్న సత్తిబాబు
మీ గురించి తెలియక తప్పుగా మాట్లాడాను. క్షమించండి. మీకు సహయంగా ఉంటాను. మీరు ఇతర పనులు చూసుకోండి. గళ్లాపెట్టి నేను చూసుకుంటాను అని సత్తిబాబు అంటాడు. శివ నారాయణ సరేనంటాడు. కస్టమర్స్‌ను పిలుస్తాడు సత్తిబాబు. గర్వంతో సంతోషంతో పొంగిపోతాడు శివ నారాయణ. మరోవైపు నేను ఆల్రెడీ ఒక పీఏను అపాయింట్ చేశానని కార్తీక్, దీపతో చెబుతుంది మాలిని.
అప్పుడే సూరజ్ వస్తాడు. ఇంతలో మేనేజర్ వచ్చి పీఏ వచ్చేసిందని, నాకు ఏదోలా ఉందని అంటాడు. ఇంతలో జ్యోత్స్న వస్తుంది. జ్యోత్స్నను చూసి అంతా షాక్ అవుతారు. నువ్వు నా కాళ్లపై పడి బతిమిలాడిన నిన్ను ఆఫీస్‌లో ఉంచను అని మాలిని కోపంగా అంటుంది. నేను కాళ్లపై పడే టైప్ కాదులే. నేనేం ఊరికే రాలేదు. అపాయింట్‌మెంట్ లెటర్‌తో వచ్చాను అని జ్యోత్స్న మాలినికి దిమ్మతిరిగే షాక్ ఇస్తుంది.
అపాయింట్‌మెంట్ లెటర్ చూస్తుంది మాలిని. దీనికి విలువ ఉండాలంటే సంతకం ఉండాలి. లేకుంటే ఇది చెత్త పేపరే అని చింపేయబోతుంది మాలిని. అప్పుడే దక్షిణామూర్తి ఎంట్రీ ఇచ్చి ఆపుతాడు. చించేముందు అది ఎవరిచ్చారని అడగాలిగా అని దక్షిణామూర్తి అంటాడు. ఎవరిచ్చారని చెబుతారు మావయ్యగారు అని మాలిని అంటే.. నేను ఇచ్చాను అని చెప్పిన గానీ చింపుతావా అని దక్షిణామూర్తి అంటాడు.
తల్లికొడుకుల ఫ్యూజులు అవుట్
దాంతో తల్లికొడుకులు మాలిని, సూరజ్ ఫ్యూజులు అవుట్ అవుతాయి. కార్తీక్, దీప షాక్ అవుతారు. జ్యోత్స్నకు ఆఫీస్‌లో పీఏగా నేను అపాయింట్‌మెంట్ లెటర్ ఇచ్చానని చెప్పినా కూడా చింపుతావా అని దక్షిణామూర్తి అంటాడు. నేనే ఇచ్చాను. ఈరోజు నుంచి నా మనవరాలు జ్యోత్స్న సూరజ్‌కి పీఏగా ఉంటుంది అని దక్షిణామూర్తి అంటాడు. దాంతో కార్తీక్ జ్యో గురించి చెప్పింది తలుచుకుంటుంది మాలిని.
మీతో మాట్లాడాలని దక్షిణామూర్తిని పక్కకు తీసుకెళ్తుంది మాలిని. ఏం జరుగుతుంది జ్యోత్స్న అని దీప అడిగితే.. అంతా తాత చెబుతాడని జ్యో అంటుంది. కార్తీక్‌ను పక్కకు తీసుకెళ్తుంది దీప. జ్యోత్స్నను సూరజ్ చూస్తాడు. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


