కార్తీక దీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో కార్తీక్ ఇంట్లో సుమిత్ర ఉందని తెలిసి శివ నారాయణ ఉగ్రరూపం చూపిస్తాడు. కార్తీక్, దీప, కాంచనను నానా మాటలు అంటాడు శివ నారాయణ. ఇక మిమ్మల్ని ఎప్పటికి క్షమించను. మీ సంగతి తర్వాత నేను నా కోడలిని తీసుకోపోతా అని శివ నారాయణ అంటాడు. ఆగు తాత అని కార్తీక్ అంటే.. నన్ను ఆపితే నా మీద ఒట్టే అని శివనారాయణ అంటాడు.
అత్తను శవంగా చూడాలనుకుంటే తీసుకెళ్లు

అత్తను తీసుకెళ్తే అదే నీకు ఆఖరి చూపు అవుతుంది. అత్త ఆ ఇంట్లో అడుగుపెట్టిన మరుక్షణం ప్రాణాలతో ఉండదు. అత్తను శవంగా చూడాలనుకుంటే తీసుకెళ్లు అని కార్తీక్ అంటాడు. దాంతో ప్రాణాలతో ఉండకపోవడం ఏంట్రా. ఎందుకు అలా మాట్లాడుతున్నావని శివ నారాయణ అంటాడు.
ముందు మీరు వెళ్లండి తాతగారు. ఇప్పుడు మీరు ఎలా అర్థం చేసుకున్న పర్వాలేదు అని సుమిత్రతో జరిగింది అంతా చెబుతుంది దీప. సుమిత్ర ఒట్టు గురించి చెబుతుంది దీప. తనను మార్చిన తర్వాత ఇంటికి తీసుకొద్దామనుకున్నాం. అందుకే మీకు చెప్పలేదు. జ్యోత్స్నకు కూడా చెప్పలేదు. మీకు అమ్మ గురించి చెప్పకుండా మేమెంత బాధపడుతున్నామో మీకు తెలియదు అని దీప అంటుంది.
తనెవరో తెలియని చోటుకు వెళ్లిపోతానంటుంది. మన ఇంటికి ఏమైంది నాన్న. ఎవరి దిష్టి తగిలింది. మనకే ఎందుకు ఇలా జరుగుతుంది. అన్నయ్య అలా వదినా ఇలా. ఎవరిని కాపాడుకోవాలి. మాది స్వార్థమన్నావుగా నాన్న మీ అందరిని కాపాడుకోవాలనేది మా స్వార్థమే. చేయని తప్పులకు మాటలు పడుతున్నాం అని కుమిలి కుమిలి ఏడుస్తుంది.
నా కొడుకును మార్చాలి
మాటలు పడ్డారు అంటే ఇంట్లో ఉంచి నాకు చెప్పకుంటే ఎలా ఉంటుందో మీరే నా ప్లేసులో ఉండి ఆలోచించండి అని శివ నారాయణ అంటాడు. మనింటికి గ్రహణం పట్టిందనుకో. నేను చెప్పేవరకు ఓపికగా ఉండు. అత్తను మార్చి నేను ఇంటికి తీసుకొస్తాను. నీకు అత్త ఇక్కడ ఉన్నట్లు తెలిస్తే ఇక్కడ కూడా ఉండదు అని కార్తీక్ అంటాడు. వద్దురా వద్దు. సుమిత్ర క్షేమంగా ఉంటే చాలు శివ నారాయణ అంటాడు.
నువ్వు కూడా నాతో రారా. నా కొడుకును కూడా మార్చాలి. దీప కోపంలో మాటలు అన్నాను ఏమనుకోకు అని శివ నారాయణ అంటాడు. నేను మీ మనవరాలు లాంటిదాన్ని ఓ మాట అంటే పడనా అని దీప అంటుంది. మనవరాలి లాంటిదానివేంటీ మనవరాలివే. ఏ తాతా నా భార్య నీకు మనవరాలు కాదా అని కార్తీక్ అంటాడు. అవునురా దీప నా మనవరాలే అని శివ నారాయణ ఒప్పుకుంటాడు.
{{/usCountry}}నువ్వు కూడా నాతో రారా. నా కొడుకును కూడా మార్చాలి. దీప కోపంలో మాటలు అన్నాను ఏమనుకోకు అని శివ నారాయణ అంటాడు. నేను మీ మనవరాలు లాంటిదాన్ని ఓ మాట అంటే పడనా అని దీప అంటుంది. మనవరాలి లాంటిదానివేంటీ మనవరాలివే. ఏ తాతా నా భార్య నీకు మనవరాలు కాదా అని కార్తీక్ అంటాడు. అవునురా దీప నా మనవరాలే అని శివ నారాయణ ఒప్పుకుంటాడు.
{{/usCountry}}అమ్మా కాంచన నువ్వు ఏమనుకోకు అని చేతులుపట్టుకుని చెబుతాడు శివ నారాయణ. తాత వచ్చినట్లు తెలియకూడదు. శౌర్యకు కూడా చెప్పు అని కార్తీక్ వెళ్లిపోతాడు. ఇక ఈ విషయంలో మనల్ని ఎవరు తప్పు బట్టరు అని అనసూయ అంటుంది. మరోవైపు జాబ్‌కు వెళ్లాలనుకున్న కాశీ ఫోన్ కనిపించట్లేదని కంగారు పడతాడు. స్వప్న వెతికి ఇస్తుంది.
ఇదే సక్సెస్ అంటే
కాశీని చూసి నీ డెడికేషన్ నాకు నచ్చిందయ్యా. తినడానికి తిండిలేని టైమ్ నుంచి తింటానికి టైమ్ లేని స్థాయికి రావడమంటేనే సక్సెస్ అని శ్రీధర్ అంటాడు. ఇలా కాంప్లిమెంట్ ఇస్తారనుకోలేదు. తిడతారు అనుకున్నా అని వెళ్లిపోతాడు కాశీ. బయట బైక్ స్టార్ట్ కాదు. శ్రీధర్ వచ్చి కారులో డ్రాప్ చేస్తానంటాడు. కానీ, కాశీ వద్దని క్యాబ్‌లో వెళ్తానంటాడు.
అల్లుడు ఎందుకు అంతా కంగారుపడుతున్నాడని శ్రీధర్ అడిగితే.. బాస్‌తో మీటింగ్ ఉందట అని స్వప్న చెప్పి వెళ్లిపోతుంది. మరోవైపు సుమిత్రతో దీప, కాంచన మాట్లాడుతారు. అన్నయ్య గురించి నువ్వు ఎలా ఆలోచిస్తున్నావో అక్కడ అన్నయ కూడా నీ గురించి ఆలోచిస్తున్నాడని కాంచన చెబుతుంది.
సుమిత్ర, దశరథ్ బంధం గురించి దీప గొప్పగా చెబుతుంది. అంతా కలిసి సమస్యకు పరిష్కారం చూడరా అని దీప అంటే.. ఈ సమస్యకు పరిష్కారం నేను చెప్పనా. పరిష్కారం నాతోనే మొదలైంది. నేను ఆ ఇంట్లో ఉంటే నా భర్తకే సమస్య. ఆరోజు నేను పోయింటే బాగుండు అని సుమిత్ర అంటుంది. వదినా. చావులు గీవులు వద్దు బతికినంత కాలం సంతోషంగా ఉందాం అని కాంచన అంటుంది.
అంతా కలిసే ఉందాం
అయితే నాకో సాయం చేయి వదినా. నన్ను ఇక్కడి నుంచి పంపించేయండి. నిన్న జ్యోత్స్న వచ్చింది, ఇవాళ మావయ్య గారు వచ్చారు. చూడకుండా ఆపారు. మాట విని మెలకువ వచ్చింది. తర్వాత మళ్లీ పడుకుండిపోయాను. మీ అన్నయ్య గారు వచ్చారా అని సుమిత్ర అంటుంది. రాలేదు. కుమిలిపోతున్నాడని కాంచన అంటుంది. త్వరలో అందరి బాధ దూరం చేస్తాను అని సుమిత్ర అంటుంది.
అయ్యో వదినా అలా అనకు. ఇక్కడే ఉండు. అంతా కలిసే ఉందాం. సంతోషంగా కలిసే ఉందాం అని కాంచన అంటుంది. మరోవైపు రోడ్డు మీద కాశీ ఒకరితో మాట్లాడుతూ ఉంటాడు. అది శ్రీధర్ చూస్తాడు. అల్లుడు ఏంటీ ఇక్కడ ఉన్నాడు. ఏం చేస్తున్నాడో అడుగుదామని కాల్ చేస్తాడు. అల్లుడు నువ్వు అని శ్రీధర్ అంటుంటే ఇక్కడే ఆఫీస్‌లో ఉన్నాను అని కాశీ అబద్ధం చెబుతాడు.
ఆఫీస్‌లో చాలా బిజీగా ఉన్నాను. ఓ ప్రాజెక్ట్ గురించి మేనేజర్‌తో మాట్లాడుతున్నాను అని కాశీ అంటాడు. సరే అల్లుడు ఫ్రీ అయ్యాక మెసేజ్ చేయి కాల్ చేస్తాను అని శ్రీధర్ కాల్ కట్ చేస్తాడు. నాకు ఉద్యోగం వచ్చిందని అబద్ధం చెప్పానని తెలిస్తే ఘోరంగా తిడతారు అని కాశీ అంటాడు. తెలిసింది అల్లుడు. నువ్వు నాకంటే జాదు గాడిలా ఉన్నావ్. ఉండు నీ సంగతి చెబుతా అని ఫొటోలు తీస్తాడు శ్రీధర్.
బయటపడిన కాశీ జాబ్ డ్రామా
పెద్ద కంపెనీలో జాబ్ వచ్చిందని ఈ మావయ్యనే మోసం చేస్తావా. పైగా ఇంట్లో హడావిడి ఒకటి. ఇంటికి రా చెప్తా నీ సంగతి అని శ్రీధర్ అనుకుంటాడు. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.