రికార్డులు బ్రేక్ చేస్తున్న కార్తీకదీపం సీరియల్.. 45వ వారం టీఆర్పీ రేటింగ్స్ ఇలా.. తెలుగులో టాప్ 10 సీరియల్స్ ఇవే

కార్తీకదీపం సీరియల్ టీఆర్పీ రేటింగ్స్ విషయంలో రికార్డులు బ్రేక్ చేస్తోంది. తాజాగా ఈ ఏడాది 45వ వారం రేటింగ్స్ రిలీజ్ కాగా.. గతంలోని అన్ని రికార్డులను బ్రేక్ చేసి బెస్ట్ రేటింగ్ అందుకుంది. తాజాగా టాప్ 10 తెలుగు టీవీ సీరియల్స్ ఏవో చూద్దాం.

Published on: Nov 20, 2025, 15:16:12 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలుగు టీవీ సీరియల్స్ 45వ వారం టీఆర్పీ రేటింగ్స్ గురువారం (నవంబర్ 20) రిలీజ్ అయ్యాయి. వీటిలో కార్తీకదీపంతోపాటు స్టార్ మా సీరియల్స్ హవా కొనసాగింది. టాప్ 10 సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్ అన్నీ చాలా మెరుగయ్యాయి. ముఖ్యంగా కార్తీకదీపం దుమ్ము రేపింది. 16కుపైగా రేటింగ్ తో కొత్త రికార్డులు క్రియేట్ చేసింది.

రికార్డులు బ్రేక్ చేస్తున్న కార్తీకదీపం సీరియల్.. 45వ వారం టీఆర్పీ రేటింగ్స్ ఇలా.. తెలుగులో టాప్ 10 సీరియల్స్ ఇవే
రికార్డులు బ్రేక్ చేస్తున్న కార్తీకదీపం సీరియల్.. 45వ వారం టీఆర్పీ రేటింగ్స్ ఇలా.. తెలుగులో టాప్ 10 సీరియల్స్ ఇవే

స్టార్ మా సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్ ఇలా..

ఈవారం స్టార్ మా సీరియల్స్ మరింత దూకుడు పెంచాయి. 45వ వారానికి రిలీజైన రేటింగ్స్ లో టాప్ 6లో అన్నీ ఈ ఛానెల్ సీరియల్స్ ఉండగా.. వాటి రేటింగ్స్ కూడా గణనీయంగా పెరగడం విశేషం. తొలి స్థానంలో ఉన్న కార్తీకదీపం 2 సీరియల్ అయితే ఏకంగా 16.16 రేటింగ్ తో తన అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకుంది. ఇక రెండో స్థానంలో ఉన్న ఇల్లు ఇల్లాలు పిల్లలు కూడా తన బెస్ట్ టీఆర్పీ సొంతం చేసుకుంది. 15.15 రేటింగ్ తో రెండో స్థానంలో కొనసాగుతోంది.

మూడో స్థానంలోకి మరోసారి ఇంటింటి రామాయణం వచ్చింది. ఈ సీరియల్ కు 13.84 రేటింగ్ నమోదు కావడం విశేషం. ఇది కూడా రికార్డే. నాలుగో స్థానంలో ఉన్న గుండె నిండా గుడి గంటలు సీరియల్ కు 13.16 రేటింగ్ వచ్చింది. ఇక ఐదో స్థానంలో చిన్ని సీరియల్ 11.71 రేటింగ్ తో ఉంది. నిండు మనసులు సీరియల్ 9.71 రేటింగ్ తో ఆరో స్థానంలో కొనసాగుతోంది. ఒకటి నుంచి ఆరు వరకు ప్రతి సీరియల్ 45వ వారం మెరుగైన రేటింగ్ నమోదు చేసింది.

జీ తెలుగు సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్

ఇక టాప్ 10లో మిగిలిన నాలుగు స్థానాలను జీ తెలుగు సీరియల్స్ సొంతం చేసుకున్నాయి. వీటిలో మేఘసందేశం సీరియల్ 8.14 రేటింగ్ తో ఓవరాల్ గా ఏదో స్థానంలో ఉంది. తర్వాత మూడు స్థానాల కోసం గట్టి పోటీ నెలకొంది. 8వ స్థానంలో ఉన్న చామంతికి 7.96 రేటింగ్ రాగా.. 9వ స్థానంలో జగద్ధాత్రి 7.88తో ఉంది. ఇక పదో స్థానంలో లక్ష్మీనివాసం 7.83 రేటింగ్ తో ఉంది. మరో జీ తెలుగు సీరియల్ జయం కూడా 7.16 రేటింగ్ సాధించింది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More