Karthika Deepam 2 Serial: బుల్లితెరపై తిరుగులేని రేటింగ్ తో దూసుకుపోతోంది కార్తీక దీపం 2 సీరియల్. ఈ సీరియల్ లోని ఎమోషన్స్, ట్విస్ట్, రివేంజ్ డ్రామాకు ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే సీరియల్ రీచ్ ను మరింత పెంచడం కోసం మేకర్స్ జ్యోత్స్నతో బాగానే మైండ్ గేమ్స్ ఆడిస్తున్నారని చెప్పొచ్చు.
రివేంజ్ డ్రామా

కార్తీక దీపం 2 సీరియల్ ఫస్ట్ నుంచి రివేంజ్ డ్రామాగానే సాగుతుంది. కార్తీక్ ను పెళ్లి చేసుకుందని దీపపై రివేంజ్ తీర్చుకోవాలని జ్యోత్స్న నానా కుట్రలు చేసింది. తన సొంత అమ్మానాన్నలకు దూరం చేసి, వారసురాలిగా ఉంటున్న జ్యోత్స్న మోసాన్ని బయటపెట్టాలని కార్తీక్, దీప ట్రై చేస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు స్టోరీ ఏమో మాలిని, సూరజ్ పై రివేంజ్ డ్రామాగా మారిపోయింది.
ట్విస్టులే ట్విస్టులు
కార్తీక దీపం 2 సీరియల్ లోకి సూరజ్, మాలిని అడుగుపెట్టినప్పటి నుంచి ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. తల్లి చెప్పిందని వెనుకా ముందు ఆలోచించకుండా ప్రేమ పేరుతో జ్యోత్స్నను సూరజ్ మోసం చేశాడు. ఇక మాలిని ఏమో కొడుకును పావుగా వాడి శివ నారాయణ ఆస్తులు మొత్తం లాక్కుంది. శివ నారాయణ ఫ్యామిలీని రోడ్డున పడేసింది.
జ్యోత్స్న ఊరుకుంటుందా?
తన కుటుంబాన్ని అవమానించిన మాలినిపై రివేంజ్ కోసం జ్యోత్స్న గేమ్ స్టార్ట్ చేసింది. డైరెక్ట్ గా సూరజ్ పీఏ పోస్టు పట్టేసింది. ఏకంగా దక్షిణామూర్తి రికమండేషన్ తో జ్యోత్స్న అదిరే ట్విస్ట్ ఇచ్చింది. అయితే సూరజ్ ఎక్కడ జ్యోత్స్న ప్రేమలో మునిగిపోతాడేమోనని భయపడి మాలిని మరో సంచలన నిర్ణయం తీసుకుంది. జ్యోత్స్నను మాయం చేసింది.
భయపడ్డ మాలిని
{{/usCountry}}తన కుటుంబాన్ని అవమానించిన మాలినిపై రివేంజ్ కోసం జ్యోత్స్న గేమ్ స్టార్ట్ చేసింది. డైరెక్ట్ గా సూరజ్ పీఏ పోస్టు పట్టేసింది. ఏకంగా దక్షిణామూర్తి రికమండేషన్ తో జ్యోత్స్న అదిరే ట్విస్ట్ ఇచ్చింది. అయితే సూరజ్ ఎక్కడ జ్యోత్స్న ప్రేమలో మునిగిపోతాడేమోనని భయపడి మాలిని మరో సంచలన నిర్ణయం తీసుకుంది. జ్యోత్స్నను మాయం చేసింది.
భయపడ్డ మాలిని
{{/usCountry}}జ్యోత్స్ననైతే మాలిని మాయం చేసింది కానీ తన కొడుకు సూరజ్ లో మార్పు చూసి కంగుతింది. జ్యోత్స్న కనిపించకపోవడంతో సూరజ్ టెన్షన్ పడ్డాడు. జ్యోత్స్న కోసం వెతికాడు. తన సొంత తల్లి మాలినిపై అనుమానపడ్డాడు. దీంతో మాలినిలో భయం స్టార్ట్ అయింది. వెంటనే జ్యోత్స్నను విడిచిపెట్టిందని చెప్పొచ్చు.
జ్యో ఛాలెంజ్
సూరజ్ కు తన మీద ఉన్న ప్రేమను పూర్తిగా అర్థం చేసుకున్న జ్యోత్స్న ఇక చెలరేగేందుకు రెడీ అయింది. మాలినికి ఛాలెంజ్ విసిరింది. సూరజ్ ను తన తల్లి నుంచి దూరం చేసి, నిజం తెలుసుకునేలా చేస్తానని చెప్పింది. జ్యోత్స్న చెప్పిందంటే కచ్చితంగా చేస్తుంది. మరి సూరజ్ కు నిజం తెలిసే దిశగా జ్యో ఎలాంటి ప్లాన్ అమలు చేస్తుందనేది ఉత్కంఠ రేపుతోంది.
కార్తీక్, దీప ఎందుకు?
కార్తీక దీపం 2 సీరియల్ లో కార్తీక్, దీపనే మెయిన్ క్యారెక్టర్లు. కానీ ఇప్పుడు మాత్రం ఈ క్యారెక్టర్లు పెద్దగా ఇంపాక్ట్ చూపించడం లేదనే టాక్ వినిపిస్తోంది. స్టోరీ మొత్తం సూరజ్, మాలిని, జ్యోత్స్న చుట్టూనే తిరుగుతుంది. మాలిని, సూరజ్ కు వార్నింగ్ ఇవ్వడం తప్పా కార్తీక్ చేసిందేమీ లేదు. ఇక దీప కూడా ఏం చేస్తుందో తెలియడం లేదు. మరి రాబోయే ఎపిసోడ్లలో అయినా కార్తీక్, దీప మళ్లీ ఫామ్ లోకి వస్తారేమో చూడాలి.