Karthika Deepam 2 Serial: కార్తీక దీపం 2-అసలేం జరుగుతోంది? మాలిని భయమే నిజమవుతుందా? ప్రేమ కోసం తల్లికి సూరజ్ షాకిస్తాడా?
Karthika Deepam 2 Serial: తెలుగులో టాప్ రేటెడ్ సీరియల్ గా కార్తీక దీపం 2 దూసుకెళ్తోంది. ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తూ ఈ సీరియల్ అదరగొడుతోంది. అయితే తాజాగా సీరియల్ లో చోటు చేసుకుంటున్న పరిణామాలు మరింత ఇంట్రెస్ట్ ను పెంచేస్తున్నాయి. మాలినికి సూరజ్ ఎదురు తిరుగుతాడా? అన్నది క్యూరియాసిటీ పెంచుతోంది.
Karthika Deepam 2 Serial: బుల్లితెరపై కార్తీక దీపం 2 సీరియల్ కు ఎదురు లేదనే చెప్పాలి. బ్లాక్ బస్టర్ సీరియల్ కార్తీక దీపానికి సీక్వెల్ గా వచ్చిన కార్తీక దీపం 2 టీఆర్పీ రేటింగ్స్ లో దూసుకెళ్తోంది. ఈ టాప్ సీరియల్ కు తెలుగు జనాలు బ్రహ్మరథం పడుతున్నారు. తాజాగా ఈ సీరియల్ స్టోరీలోని ట్విస్ట్ లు మరింత ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి.

సూరజ్ ఏం చేస్తాడు?
ప్రస్తుతం కార్తీక దీపం 2 సీరియల్ కార్తీక్, దీప క్యారెక్టర్లకంటే కూడా జ్యోత్స్న, సూరజ్, మాలిని పాత్రల చుట్టూ ఎక్కువగా తిరుగుతోంది. ముఖ్యంగా సూరజ్ ఏం చేస్తాడనే ఉత్కంఠ సీరియల్ పై మరింత క్యూరియాసిటీని కలగజేస్తోంది. జ్యోత్స్న ప్రేమ కోసం తన తల్లి మాలినిని సూరజ్ ఎదురిస్తాడా? అనేది సస్పెన్స్ క్రియేట్ చేస్తోంది.
జ్యోత్స్నను పెళ్లి చేసుకోమ్మని
కార్తీక దీపం 2 సీరియల్ లో జ్యోత్స్నను సూరజ్ పెళ్లి చేసుకునేలా అతని మనసు మారుతుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. జ్యోత్స్నను పెళ్లి చేసుకుంటేనే సమస్యకు పరిష్కారం లభిస్తుందని కార్తీక్, దీప ఇద్దరూ కలిసి సూరజ్ మైండ్ లో బలంగా నాటారు. అంతే కాకుండా జ్యోత్స్న దాచుకున్న తాళిని కూడా సూరజ్ చేతిలో పెట్టారు. ఈ పెళ్లితో మూడు ఫ్యామిలీస్ హ్యాపీగా ఉంటాయన్నారు.
తాత కూడా అదే మాట
ఇక తన కూతురు సుమిత్ర, మనవరాలు జ్యోత్స్నను ఇంటికి తీసుకురావాలనే కలతో బతుకుతున్న దక్షిణామూర్తి కూడా సూరజ్ కు ఇదే మాట చెప్పాడు. జ్యోత్స్నను పెళ్లి చేసుకోమ్మని సూరజ్ ను అడిగాడు. తన మనసు మాట వినమని చెప్పాడు. ఇలా కార్తీక్, దీప, దక్షిణామూర్తి మాటలతో సూరజ్ మనసు మారుతున్నట్లే కనిపిస్తోంది.
జ్యోతో పెళ్లి
జ్యోత్స్నను సూరజ్ పెళ్లి చేసుకుంటాడా? లేదా ఇంకేమైనా ట్విస్ట్ ఇస్తాడా? అన్నది ఇప్పుడు అతి పెద్ద ప్రశ్నగా మారింది. జ్యోత్స్నతో పర్సనల్ గా మాట్లాడేందుకు సూరజ్ వెళ్లాడు. అతను జ్యోకు ఏం చెప్తాడన్నది ఆసక్తి రేపుతోంది. జ్యోతో పెళ్లి విషయం మాట్లాడతాడా? ఒకవేళ జ్యో ఒప్పుకొన్నా కూడా శివ నారాయణ ఫ్యామిలీ రియాక్షన్ ఎలా ఉంటుంది? అనేది ఇంకా ఇంట్రెస్ట్ కలిగిస్తుంది.
మాలిని భయం
సూరజ్ తో కార్తీక్, దీప.. ఆ తర్వాత తన మామయ్య దక్షిణామూర్తి మాట్లాడిన మాటలను మాలిని దొంగచాటుగా విన్నది. దీంతో తన కొడుకు ఎక్కడ చేయి దాటిపోతాడో? జ్యోత్స్నను పెళ్లి చేసుకుంటాడో అని మాలిని భయపడుతుంది. ఆ భయాన్ని మరింత పెంచేలా జ్యోను సూరజ్ పెళ్లి చేసుకొని తీసుకొని వచ్చినట్లు కల కూడా కన్నది.
తల్లికి ఎదురు తిరిగి
కార్తీక దీపం 2 సీరియల్ లో ప్రస్తుతం స్టోరీ సాగే తీరు చూస్తుంటే జ్యోత్స్నకు తన మనసులోని మాటను సూరజ్ చెప్పేలా కనిపిస్తున్నాడు. జ్యోను పెళ్లి చేసుకోవడానికే అతను రెడీ అయినట్లు తెలుస్తోంది. కానీ మాలిని ఆ పెళ్లి జరగనిస్తుందా? శివ నారాయణ కుటుంబాన్ని నాశనం చేయాలనే పగతో రగిలిపోతున్న ఆమె వేరే ప్లాన్ ఏమైనా వేస్తుందా? అనేది రాబోయే ఎపిసోడ్లలో చూడాల్సిందే.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


