కార్తీక దీపం 2 సీరియల్ లో దీపనే తన మనవరాలు అని పారిజాతం తెగ ప్రేమ కురిపించేస్తుంది. శివ నారాయణ ఇంటికి కాంచన ఫ్యామిలీ వెళ్తారు. జ్యోత్స్నను ఢీ కొట్టి శౌర్య కిందపడిపోతుంది. కోపంతో ఊగిపోయిన పారిజాతం.. జ్యోత్స్నను చెంపపై కొట్టి శౌర్యకు సారీ చెప్పమంటుంది. మరి ఆ తర్వాత ఏం జరిగిందో కార్తీక దీపం 2 టుడే ఏప్రిల్ 2 ఎపిసోడ్ లో చూద్దాం.
సారీ చెప్పిన జ్యోత్స్న

ఈ పారిజాతం న్యాయం చేస్తుంది కదా అని పారు ఓవరాక్షన్ చేస్తుంది. నాకేం దెబ్బలు తగల్లేదని శౌర్య అంటే, నాకు దెబ్బలు తగిలాయని పారు అంటుంది. కార్తీక్ కూడా పారిజాతానికి సపోర్ట్ చేస్తాడు. ఇక చెలరేగిపోతానని పారు అంటుంది. సారీ చెప్పమని జ్యోత్స్నను మళ్లీ మళ్లీ అడుగుతుంది పారు. పారు వదలకపోవడంతో జ్యోత్స్న సారీ చెప్తుంది.
దీపకు జ్యూస్
దీపను సోఫాలో కూర్చోబెట్టి పారు తెగ ప్రేమ చూపించేస్తుంది. పారు ఎందుకు ఇంతలా మారిపోయిందని దశరథ, కాంచన అనుకుంటారు. ఇక కార్తీక్ మరో ఫిటింగ్ పెడతాడు. పారిజాతం తెచ్చిన జ్యూస్ ను మనవరాలికి ఇవ్వమంటాడు. ఎంతైనా మనవరాలికి జ్యోత్స్న అంటే చాలా ఇష్టమని శ్రీధర్ అంటాడు. నా మనవరాలికే ఇస్తానని చెప్పిన పారు జ్యూస్ ను దీపకు ఇవ్వడంతో అందరూ షాక్ అవుతారు.
నానమ్మ పోలికలే
హలో తను దీప.. జ్యోత్స్న కాదని శివనారాయణ అంటాడు. మనవడి భార్య మనవరాలే కదా అని దీప వద్దన్నా పారు జ్యూస్ తాగించేందుకు ట్రై చేస్తుంది. దీనికి అన్ని ఈ నానమ్మ పోలికలే అనడంతో మరోసారి అందరూ షాక్ అవుతారు. దీపకు నీ పోలికలు వచ్చాయని చెప్తావేంటీ పిన్ని అని దశరథ అడుగుతాడు. శ్రీధర్, కార్తీక్ కూడా ఇదే పాయింట్ ను బట్టి కూపీ లాగుతారు. అందరూ పారును ఇదే విషయం అడుగుతారు.
పనిమనిషిగా
ఒకప్పుడు ఈ ఇంట్లో నేను ఏం చేసేదాన్నో దీప ఇప్పుడు అదే కదా. ఆ విధంగా పోలికలు కలిశాయి కాబట్టి ఆ బాధలు తెలుస్తాయని అన్నానని ఒకప్పుడు పని మనిషిగా చేసిన పారిజాతం గతం గుర్తు చేసుకుంటుంది. అందరి ముందు తాగితే దిష్టి తగులుతుంది, పైకి వెళ్లి జ్యూస్ తాగు అని దీపను పారు పంపిస్తుంది. దీపపై పారుకు ఇంత ప్రేమ ఎందుకో తెలుసుకోవాలని జ్యోత్స్న అనుకుంటుంది.
గ్రానీని ఏం చేశారు?
{{/usCountry}}ఒకప్పుడు ఈ ఇంట్లో నేను ఏం చేసేదాన్నో దీప ఇప్పుడు అదే కదా. ఆ విధంగా పోలికలు కలిశాయి కాబట్టి ఆ బాధలు తెలుస్తాయని అన్నానని ఒకప్పుడు పని మనిషిగా చేసిన పారిజాతం గతం గుర్తు చేసుకుంటుంది. అందరి ముందు తాగితే దిష్టి తగులుతుంది, పైకి వెళ్లి జ్యూస్ తాగు అని దీపను పారు పంపిస్తుంది. దీపపై పారుకు ఇంత ప్రేమ ఎందుకో తెలుసుకోవాలని జ్యోత్స్న అనుకుంటుంది.
గ్రానీని ఏం చేశారు?
{{/usCountry}}దీప దగ్గరకు వెళ్లి జ్యోత్స్న మాట్లాడుతుంది. మా గ్రానీ కోరలు బావ పీకేశాడు. అందుకే నీ మీద ప్రేమ చూపిస్తుందని జ్యో అంటుంది. మనుషులు మారుతారు జ్యోత్స్న. మంచనీళ్లు కూడా ఇవ్వని పారిజాతం ఇప్పుడు జ్యూస్ తీసుకొచ్చిందని దీప అంటుంది. మా గ్రానీని ఏం చేశారని జ్యోత్స్న అంటుంది. అది పారునే అడుగు అని దీప చెప్తుంది. మీ అమ్మానాన్న బతికే ఉన్నారని మాట వరసకు అనుకో అని జ్యో అంటే, నిజంగానే బతికి ఉన్నారని దీప అంటుంది.
చావుకు ముహూర్తం
మీ అమ్మానాన్న ఎవరో తెలిసే నాటికి నువ్వు ఉండవు దీప అని జ్యోత్స్న ఇండైరెక్ట్ గా వార్నింగ్ ఇస్తుంది. మా అమ్మానాన్నలనే నీ అమ్మానాన్నలను అనుకో, ఈ ఇల్లే నీ పుట్టిల్లు అనుకో అని జ్యో అంటుంది. కడుపులో బిడ్డ జాగ్రత్త దీప. బిడ్డ గండం దాటిందని జ్యో కన్నింగ్ గా చెప్తుంది. దీప అక్కడి నుంచి వెళ్లిపోతుంది. నీ చావుకు ముహూర్తం పెట్టే ఈ మీటింగ్ పెట్టానని జ్యో అనుకుంటుంది.
శౌర్యపై ప్రేమ
శౌర్యకు చాక్లెట్స్ ఇచ్చి పారు మురిసిపోతుంది. ఇప్పుడు పారు మారిపోయింది కదా. నువ్వు నా ముని మనవరాలు కూతురు కాబట్టి అని శౌర్యతో పారు చెప్తుంది. మీ అమ్మను ఇంకెప్పుడూ తిట్టనని శౌర్యకు పారు ప్రామిస్ చేస్తుంది. దొంగ, పోలీస్ ఆట ఆడుదామని అనుకుంటారు. జ్యో రూమ్ కు వెళ్తే తిడుతుందని శౌర్య చెప్తే, నిన్న ఎవరే తిట్టేదని శౌర్యను ఆ బెడ్ రూమ్ లోకి పారు తీసుకెళ్తుంది.
పారు చేతికి రిపోర్ట్స్
జ్యో బెడ్ మీద దిండు కింద ఉన్న హాస్పిటల్ రిపోర్ట్స్ ను పారు తీసుకుంటుంది. ఇంగ్లీష్ లో ఉన్న ఆ రిపోర్ట్స్ ను పారు చదవలేకపోతుంది. ఆ రిపోర్ట్స్ ను తీసుకుని వస్తున్న పారు.. శివ నారాయణకు డాష్ ఇస్తుంది. ఆ పేపర్స్ ఏంటో ఇవ్వమని శివ నారాయణ అడుగుతాడు. ఇవి చిత్తు కాగితాలు, డస్ట్ బిన్ లో పారేస్తానని పారు అబద్ధం చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
కార్తీక్ కు తెలిసిన నిజం
ఇందులో ఏముందో చెప్పమంటూ ఆ రిపోర్ట్స్ ను కార్తీక్ కు పారు ఇస్తుంది. సుమిత్ర అత్త, దీప, జ్యోత్స్న డీఎన్ఏ టెస్టులు ఇందులో ఉన్నాయని కార్తీక్ కు తెలుస్తుంది. అంటే జ్యోత్స్నకు నిజం తెలిసిందని కార్తీక్ అనుకుంటాడు. అప్పుడే జ్యోత్స్న వస్తే ఆ రిపోర్ట్స్ ను పారు చీరకొంగు చాటున దాస్తుంది. జ్యో బెడ్ రూమ్ లోకి వెళ్లి దిండు కింద ఆ రిపోర్ట్స్ ను పారు పెట్టేస్తుంది.
జ్యోత్స్నకు డౌట్ వస్తుంది. కవర్ ఎవరో తీసినట్లున్నారే అని రిపోర్ట్స్ చెక్ చేస్తుంది. బావకు నిజం తెలిసిందా? నేను చేయాల్సిన పని చేయాలని జ్యోత్స్న అనుకోవడంతో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.