కార్తీక దీపం 2 టుడే జనవరి 20 ఎపిసోడ్ లో రేపో ఎల్లుండో రిపోర్ట్స్ వస్తాయి. సుమిత్ర శాంపిల్ తో జ్యోత్స్న శాంపిల్ మ్యాచ్ కావడం లేదని డాక్టర్ చెప్తుంది. అప్పుడు అందరిలో డౌట్ మొదలవుతుంది. అప్పుడు డాక్టర్ జ్యోత్స్న మీ కూతురు కాదని చెప్తుంది. మనకు గట్టిగానే మూడిందని జ్యోతో పారిజాతం అంటుంటే తథాస్తు అంటూ కార్తీక్ వస్తాడు.
జ్యోకు షాక్

మనకు గట్టిగానే మూడిందన్నారు కదా అందుకే తథాస్తు అన్నా. చేసిన తప్పులు బయటపడతాయని అన్నారు. ఒక నిజం తెలుసుకోవడానికి వచ్చా. బయటకు తెలియకూడదని మీలో మీరే టెన్షన్ పడుతున్నారో అదే నిజమని కార్తీక్ అడుగుతాడు. దీనికి హాస్పిటల్ అంటే భయం కదా సూది గుచ్చి మరీ బ్లడ్ తీశారు. మరి సర్జరీ అప్పుడు ఎలా అని భయపడుతుందని పారు అంటుంది. బోన్ మ్యారో ఇవ్వాల్సింది పెద్ద మేడం గారు కాదు కన్న కూతురు అని కార్తీక్ షాక్ ఇస్తాడు.
దాసు మామయ్యకు ఏమైంది?
ఎవరైనా కన్నతల్లిని కాపాడుకునే అవకాశం వస్తే లక్కీగా ఫీల్ అవుతారు. కానీ పెద్ద మేడం ఎందుకు తప్పించుకోవాలని చూస్తుంది? దాసు మామయ్యకు ఏమైంది? అని తాయిత్తు బయటకు తీస్తాడు కార్తీక్. ఇది మా దాసుగాడిదేరా అని పారు అంటుంది. గార్డెన్ లో దొరికింది. మెడలో ఉండాల్సిన తాయిత్తు గార్డెన్ లో ఎలా ఉంటుంది? తెగిపోయిందా? ఎవరైనా తెంపేశారా? రాత్రి నుంచి ఆ మనిషి ఇంటికి కూడా వెళ్లలేడు. ఫోన్ రింగ్ అవుతున్నా లిఫ్ట్ చేయడం లేదు. చెప్పు పారు దాసు మామయ్య నీతో ఏమైనా చెప్పాడా? అని కార్తీక్ అడుగుతాడు.
పోలీస్ కంప్లెయింట్
దాసు బాబాయి సంగతి మనకు తెలిసిందే కదా సైలెంట్లో పెట్టి బ్యాగులో పెట్టి ఉంటాడు. తాయిత్తు తెగిపోయి ఉంటుందని జ్యోత్స్న కవర్ చేస్తుంది. దాసు మామయ్య కనిపించడం లేదని పోలీసు కంప్లెయింట్ ఇస్తానని కార్తీక్ అనగానే జ్యో కంగుతింటుంది. ఇంకొక్క రోజు చూసి కంప్లెయింట్ ఇస్తానని కార్తీక్ అంటాడు. మామయ్య ఎక్కడున్నాడో తెలుసుకుంటానంటాడు. నువ్వు తెలుసుకోలేవు బావ అని జ్యో అనుకుంటుంది. పారుకు జ్యోపై అనుమానం వస్తుంది.
నిజం చెప్పాలన్న దీప
{{/usCountry}}దాసు బాబాయి సంగతి మనకు తెలిసిందే కదా సైలెంట్లో పెట్టి బ్యాగులో పెట్టి ఉంటాడు. తాయిత్తు తెగిపోయి ఉంటుందని జ్యోత్స్న కవర్ చేస్తుంది. దాసు మామయ్య కనిపించడం లేదని పోలీసు కంప్లెయింట్ ఇస్తానని కార్తీక్ అనగానే జ్యో కంగుతింటుంది. ఇంకొక్క రోజు చూసి కంప్లెయింట్ ఇస్తానని కార్తీక్ అంటాడు. మామయ్య ఎక్కడున్నాడో తెలుసుకుంటానంటాడు. నువ్వు తెలుసుకోలేవు బావ అని జ్యో అనుకుంటుంది. పారుకు జ్యోపై అనుమానం వస్తుంది.
నిజం చెప్పాలన్న దీప
{{/usCountry}}బిడ్డ గురించి గురువు చెప్పిన మాటలు భయాన్ని కలిగిస్తున్నాయి బావ. జ్యోత్స్న అంత ధైర్యంగా ఎలా శాంపిల్ ఇచ్చిందని కార్తీక్ ను దీప అడుగుతుంది. తాత పేరు చెప్పి తప్పించుకునే అవకాశం ఇవ్వకుండా భయపెట్టా. వేరే దారిలేక టెస్టులు చేయించుకుందని కార్తీక్ అంటాడు. జ్యోత్స్న నీ కూతురు కాదని ఇప్పుడే చెప్పేద్దాం బావ. జ్యోత్స్న ముందుగానే జాగ్రత్త పడుతుంది. అమ్మనే లేకుండా చేయొచ్చు. అలాంటి అవకాశం ఇవ్వొద్దు. వెంటనే అమ్మకు నిజం చెప్పేద్దామని దీప అంటుంది.
సుమిత్ర భయాలు
అత్తకు నిజం చెప్పగానే జ్యోను దూరం పెడుతుందని అనుకోవద్దు. కాబట్టి అత్తకు నిజం చెప్పలేమని కార్తీక్ అంటుంటే సుమిత్ర వచ్చి నా దగ్గర ఇంకా ఏ నిజం దాచావని అడుగుతుంది. మా అమ్మ నీ గురించి బాధ పడుతుందంటే చెప్పొద్దని అంటున్నానని కార్తీక్ కవర్ చేస్తాడు. నా లోపల చాలా భయాలున్నాయి. నా కూతురి గురించి. బ్లడ్ క్యాన్సర్ అని తెలిసిన తర్వాత నా సంతోషాలన్నీ భయాలుగా మారిపోయాయి. నేను మీతో ఉండాలి కదా. మిమ్మల్ని అందరిని వదిలేసి పోతున్నట్లు అనిపిస్తోందని సుమిత్ర అంటుంది.
కూతురే కాపాడుతుందని
నా కూతురు జ్యోత్స్న అంటే నాకు చాలా ఇష్టం. నాలా అది నన్ను ప్రేమించదు. అయినా నేను ఎందుకు కోరుకోవాలి. నేను మాత్రం ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటా. కార్తీక్ నా కూతురికి పెళ్లి చేయాలి. నీలాంటి మంచి వ్యక్తిని భర్తగా చేయాలి. అప్పటిదాకా బతికి ఉంటానంటావా? అని సుమిత్ర బాధపడుతుంది. నీ కూతురు ప్రాణాలు అడ్డుపెట్టయినా నీ ప్రాణాలు కాపాడుతుందని దీప ఎమోషనల్ అవుతుంది. అవునత్తా నీ కూతురే నిన్ను కాపాడుతుందని కార్తీక్ చెప్తాడు.
అత్త నవ్వాలని
మనిషి బతికే కాలం కూడా కొండపై దొర్లుతున్న రాయిలాంటిదే దశరథ. ఒకప్పుడు ఈ ఇంట్లో మీ అమ్మ దీపం పెట్టేదే. ఇప్పుడు ఆ దీపాన్ని నా కోడలు పెడుతుంది. సుమిత్ర ముఖంలో నవ్వు లేదు. నా భయం ధైర్యం కంటే పెద్దది అని ఏడ్చేస్తాడు శివ నారాయణ.
అత్తను నవ్వించాలని దీపతో కార్తీక్ అంటాడు. చిన్నప్పుడు ఆడపిల్లలా రెడీ అయిన తన ఫొటోను సుమిత్ర ఫోన్ కు పంపిస్తాడు కార్తీక్. అది చూసి సుమిత్ర, దశరథ, పారు, జ్యోత్స్న, శివ నారాయణ నవ్వుతాడు. ఈ ఫొటో మీ బావదే, దీని వెనుక ఉన్న కథ కూడా చెప్పాల్సిందేనని సుమిత్ర అంటుంది. నిజం చెప్పాల్సిందేనని సుమిత్ర అనడంతో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.