కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్:అత్త కూతురు జ్యో కాదు-కాంచ‌న‌కు షాకిచ్చిన కార్తీక్‌-దాసు వార్నింగ్-దీప‌ను చంపేలా జ్యో ప్లాన్

కార్తీక దీపం 2 సీరియల్ టుడే జనవరి 27 ఎపిసోడ్ ఉత్కంఠగా సాగుతుంది. జ్యోత్స్న సుమిత్ర అత్త కూతురు కాదని కాంచనతో అంటాడు కార్తీక్. ఈ గండం నుంచి ఎలాగైనా గట్టెక్కాలని జ్యోత్స్న ఆలోచిస్తుంది. జ్యోకు దాసు వార్నింగ్ ఇస్తాడు. దీపను చంపేలా రౌడీలతో డీల్ సెట్ చేసుకుంటుంది జ్యో. కానీ దీప తప్పించుకుంటుంది.

Published on: Jan 27, 2026, 07:04:37 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కార్తీక దీపం 2 సీరియల్ టుడే జనవరి 27వ ఎపిసోడ్ లో జ్యోత్స్న మా అన్నయ్య కూతురు కాదని ఎవరైనా చెప్తారేమో అనిపిస్తుంది. నా ప్రతి అనుమానానికి ఆధారం ఉంది. సాక్ష్యం కార్తీక్, ఆధారం దీప అని కాంచన అంటుంది. ఆధారం లేదు ఆధార్ కార్డు లేదని కార్తీక్ అంటాడు. ముందు నిజం చెప్పు అని కాంచన అడుగుతుంది.

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)

సుమిత్ర కూతురు కాదు

జ్యోత్స్న సుమిత్ర అత్త కూతురు కాదు, అందుకే శాంపిల్స్ మ్యాచ్ కాలేదు ఓకేనా? అని కార్తీక్ అనడంతో అందరూ షాక్ అవుతారు. అవునమ్మా జ్యోత్స్న మామయ్య కూతురు కాదు. నువ్వెళ్లి అసలైన కూతురిని తీసుకురా. అపోహలు పెరిగే కొద్దీ అనుమానాలు పెరుగుతూనే ఉంటాయని కార్తీక్ కవర్ చేస్తాడు.

శాంపిల్స్ గురించి ఎలా తెలుసు?

నీకు ముందుగానే శాంపిల్స్ గురించి ఎలా తెలుసు? అని కార్తీక్ ను కాంచన అడుగుతుంది. డాక్టర్ చెప్పినట్లు శాంపిల్స్ మ్యాచ్ కాలేదు. జ్యోత్స్న ఏమో టెస్టింగ్ రాంగ్ అంటుంది. పారు అయితే శాంపిల్స్ మారిపోయాయని అంటుంది. ఏది నిజమో, ఏది అబద్దమో నాకు తెలియడం లేదు. కానీ క్లారిటీ వచ్చే రోజు తొందర్లోనే ఉందనిపిస్తోందని కార్తీక్ చెప్తాడు.

పారుకు షాక్

టెంపుల్ లో అన్నదానం చేస్తున్నప్పుడు మా మమ్మీని చంపబోయింది ఎవరో తెలియదు? కానీ చంపించాలనుకుంది మాత్రం నువ్వే అని నాకు తెలుసు గ్రానీ. అప్పుడు దీప కాపాడింది. దీప కాపాడకపోయి ఉంటే ఇప్పటికే మమ్మీకి సంవత్సరికం అయ్యేదని జ్యోత్స్న అంటుంది. నీకు ఎలా తెలుసు? అని పారు షాక్ అవుతుంది. కొన్ని నిజాలను ఎప్పుడు రివీల్ చేయాలో తెలుసుకోవడం ఇంపార్టెంట్. నీలాగే నేనూ ఓ తప్పు చేశా అని దాసును తలపై కొట్టినా బతకడం గురించి జ్యో అనుకుంటుంది.

కార్తీక్ గాడికి దొరికిపోయావు. శాంపిల్స్ మ్యాచ్ అవ్వవని ముందే తెలుసని వాడు నాతో అన్నాడు. వాడికి నిజం తెలిసినట్లే కదా అని పారు అంటుంది. బావకు నిజం తెలిస్తే జ్యోత్స్న నీ మనవరాలు కాదు తాత అని చెప్పేవాడు. ఈ గండం నుంచి ఎలా తప్పించుకోవాలో నాకు తెలియదు. కానీ సమాధానం చెప్తానని జ్యో వెళ్లిపోతుంది. సుమిత్ర అసలైన కూతురు ఎవరో తెలిస్తే ఈ గండం నుంచి బయటపడొచ్చని పారు అనుకుంటుంది.

దీప కన్నీళ్లు

సుమిత్ర గురించి ఆలోచిస్తూ దీప బాధపడుతుంది. నీ ఆరోగ్యం గురించి పట్టించుకోవడం లేదు. తినడానికి నేనే పిలవాలి. జ్యూస్ లు నేనే తీసివ్వాలి. నా గురించి పట్టించుకోవాలని కడపులో బిడ్డ అనుకుంటుంది కదా. బుల్లి రౌడీపైనే ప్రేమ అని కార్తీక్ అంటాడు. అయితే నువ్వే మోయాల్సిందని దీప అంటుంది. బయటకు వచ్చాక అదే పని చేస్తా. నా అరచేతుల మీద నడిపిస్తానని కార్తీక్ చెప్తాడు.

బరువు మోయొద్దు

నా తండ్రి నుంచి, తల్లి నుంచి ఏ ప్రేమను పొందలేదు. కానీ నాకు అవకాశం దక్కినా ప్రేమ పంచలేకపోతున్నా. నా తల్లిని దేవుడు నా కళ్లముందే దూరం చేయాలని అనుకుంటున్నాడు. నన్ను కాపాడటానికి నువ్వున్నావు. కానీ నా తల్లి కోసం నేను ఉన్నా ఫలితం లేదని దీప ఏడుస్తుంది. మోయలేనంత బరువు ఉన్నప్పుడే అడుగు వేయడం భారంగా ఉంటుందని కార్తీక్ అంటాడు. మనం ఇక బరువు మోయొద్దు బావ. మా అమ్మను వాళ్లు బతకనివ్వరు. మళ్లీ శాంపిల్ ఇచ్చినా సేమ్ రిజల్ట్ వస్తుందని వాళ్లకు తెలుసు. జ్యోత్స్న చంపడానికి వెనుకాడదని దీప భయపడుతుంది.

దాసు వార్నింగ్

మా అమ్మను మనమే కాపాడాలని దీప అంటుంది. ఈ రాత్రి గడవని ఏం చేయాలో నేను చెప్తానని కార్తీక్ అంటాడు. మరోవైపు తండ్రి దాసుకు భోజనం వడ్డిస్తుంది జ్యోత్స్న. హాస్పిటల్ లో ఇచ్చిన శాంపిల్స్ మ్యాచ్ కాలేదు. కూతురు ఇంత ఇబ్బంది పడుతున్నా సాయం చేయాలని అనిపించడం లేదా అని జ్యో అడుగుతుంది. అయితే నిజం చెప్పేయమని రాజు, ముగ్గురు దొంగల కథను దాసు చెప్తాడు. నీ కథ ఇంతకుమించి ముందుకు కొనసాగదు. లేదంటే ముగిస్తాడు నా అల్లుడు కార్తీక్ అని దాసు చెప్పగానే జ్యోకు పొలమారుతుంది.

మన కర్మ కాలిపోయినప్పుడు ఏం చేయకున్నా పక్కవాళ్లకు నిజం తెలుస్తుంది. కథ ఆపేయ్ జ్యోత్స్న. ఎలా తప్పించుకుంటావ్? మళ్లీ బ్లడ్ శాంపిల్స్ ఇవ్వాల్సిందే. లేదంటే డీఎన్ఏ టెస్టుకు వెళ్తారు. అల్లుడు ఆగే రకం కాదు అంతు చూసే రకం. దీపే శివనారాయణ ఆస్తికి వారసురాలు అని ప్రకటించే రోజు తొందర్లోనే ఉందమ్మా అని దాసు అంటాడు. అది నా కంఠంలో ప్రాణం ఉన్నంతవరకూ జరగదని జ్యో వెళ్లిపోతుంది.

రౌడీలతో డీల్

రూ.10 లక్షలు ఇస్తానని బయట రౌడీలతో డీల్ చేసుకుంటుంది జ్యోత్స్న. వాళ్లకు ఏదో చెప్తుంది.వెంటనే కార్తీక్ ఇంటికి వెళ్తాడు రౌడీ. దీపను కత్తితో పొడవాలనుకుంటాడు. అప్పుడే దీప పక్కకు జరుగుతుంది. మొలకువ వచ్చి కత్తిని పట్టుకుని బావ అని పిలుస్తుంది. కార్తీక్ లేచి రౌడీని పట్టుకోవాలని అనుకుంటాడు. కానీ రౌడీ తప్పించుకుంటాడు. ఇక్కడతో నేటి కార్తీక దీపం 2 ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More