కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: అసలైన వారసురాలంటూ కార్తీక్‌కు దొరికిపోయిన పారు-షాక్‌లో జ్యో-రౌడీల నుంచి తప్పించుకున్న దాసు
కార్తీక దీపం 2 సీరియల్ టుడే జనవరి 22 ఎపిసోడ్ లో కాంచన రాకపోవడంతో సుమిత్ర బాధ పడుతుంది. జ్యోత్స్న బయటకు వెళ్లకుండా కార్తీక్ ఆపుతాడు. చచ్చిపోతానేమోనని భయంగా ఉందని సుమిత్ర ఏడుస్తుంది. అసలైన వారసురాలంటూ పారు నోరు జారుతుంది. రౌడీల నుంచి దాసు తప్పించుకుంటాడు.
కార్తీక దీపం 2 సీరియల్ టుడే జనవరి 22 ఎపిసోడ్ లో నేను ఈ ఇంటి దేవతను అని పారిజాతం అంటుంది. అంటే నీ చుట్టూ తిరగాలా? నా కంటికి ఏదీ కనిపించడం లేదని శివ నారాయణ అంటాడు. కాంచన కోసం ఎదురు చూస్తుంటాడు శివ నారాయణ. కానీ కార్తీక్, దీప, శౌర్య మాత్రమే వస్తారు.

అమ్మకు ధైర్యం లేదని
నానమ్మ ఏదీ అని శివ నారాయణ అడిగితే నానమ్మ రావడం లేదని శౌర్య చెప్తుంది. వదిన ఎందుకు రాలేదని సుమిత్ర అడుగుతుంది. అమ్మకు ధైర్యం సరిపోవడం లేదు. రమ్మని మీరు చెప్పారు, నేను చెప్పా. రాలేనని చెప్పిందని కార్తీక్ అంటాడు. జ్యోత్స్న పరిస్థితి కూడా అలాగే ఉంది. అందుకే గదిలో నుంచి బయటకు రావడం లేదని పారు అంటే, నేను రప్పిస్తా కదా అని కార్తీక్ చెప్తాడు.
విందు భోజనం
దీప మన ఇంట్లో ఈ రోజు విందు భోజనాలు ఏర్పాటు చేయ్. ఈ రోజు మన ఇంట్లో పండగ. నువ్వు నవ్వడమే పండగ సుమిత్ర అని దశరథ అంటాడు. అమ్మ నవ్వే పండగ నాన్న అని దీప అని మళ్లీ సారీ చెప్తుంది. పర్లేదు నేనే పిలవమని చెప్పా కదా అని దశరథ అంటాడు. వదిన నా గురించి ఎంత బాధపడుతుందో ఏమో, నేను అందరినీ బాధ పెడుతున్నానని సుమిత్ర బాధ పడుతుంది.
నోరు జారిన పారు
జ్యోత్స్న దగ్గరకు కార్తీక్ వెళ్లి అందరూ కింద ఉంటే ఎందుకు రావడం లేదని అడుగుతాడు. పారిజాతం, కార్తీక్ మాటలనుకుంటారు. ఈ క్రమంలోనే నా కొడుకు ఎక్కడ ఉన్నాడో నాకు తెలుసు, అసలైన వారసురా.. అని పారిజాతం ఆపేస్తుంది. నేను వచ్చింది మిమ్మల్ని ఇంట్లో నుంచి బయటకు పంపించేందుకు వచ్చా. మీ భయాన్ని తగ్గిస్తా. వాతావరణం మామూలుగా ఉన్నా చెమటలు పడుతున్నాయంటే లోపల భయం ఉన్నట్లేనని కార్తీక్ అంటాడు.
సుమిత్ర టైమింగ్
కర్మ కాలితేనే రహస్యాలు బయటపడతాయి. అప్పుడే ఎవరు ఎలాంటి వాళ్లో తెలుస్తాయని కార్తీక్ అంటాడు. అమ్మాయి గారు టెన్షన్ లో ఉన్నట్లున్నారు కాఫీ తాగండని దీప అంటుంది. నేను రెండు రోజుల వరకు రాను అని జ్యో వెళ్తుండగా, ఎక్కడికి వెళ్తున్నావని సుమిత్ర వచ్చి అడుగుతుంది. వాట్ ఏ టైమింగ్ చిన్న మేడం గారు అని కార్తీక్ అంటాడు. ఫ్రెండ్ దగ్గరకు వెళ్తున్నా మమ్మీ అని జ్యో చెప్తుంది.
చచ్చిపోతానేమోనని
జ్యో బాధపడుతుంటే నేనే బయటకు వెళ్లమన్నా అని పారిజాతం అంటుంది. పారు చెప్పింది పచ్చి నిజం, అందుకే జ్యో లంచ్ కు ఉండట్లేదని కార్తీక్ ఇరికిస్తాడు. మీ నాన్న అందరికీ లంచ్ ఏర్పాటు చేస్తున్నారు. నువ్వు మాత్రం ఎక్కడికి వెళ్లడానికి వీల్లేదు. ఏదో ఒక క్షణంలో నాకు తెలియకుండానే చచ్చిపోతానేమోనని భయంగా ఉంది. నేను కన్ను మూసేటప్పుడు చూసే ఆఖరి రూపం నా కూతురిదే అయి ఉండాలి. కార్తీక్ నా కూతురు నా కళ్ల ముందే ఉండాలిరా అని ఏడ్చేస్తుంది సుమిత్ర.
నీకేం కాదు అత్త. మేమంతా నీతోనే ఉన్నాం. నీతోనే ఉంటామని కార్తీక్ చెప్తాడు. రాబోతున్న మెడికల్ టెస్టు రిపోర్ట్స్ కు ఇదే సెలబ్రేషన్ లాగా ఉందని జ్యో అంటుంది. డాక్టర్ ఎవరికి ఫోన్ చేస్తుందో అర్థం కావడం లేదంటుంది. ముందు కార్తీక్ ను బయటకు పంపించేస్తానని పారు వెళ్తుంది.
పేగు బంధం
సుమిత్ర చావు గురించి ఒక మాట అనగానే నీ భార్య ఎందుకు కన్నీళ్లు పెట్టుకుంటుందని కార్తీక్ ను పారు అడుగుతుంది. పేగు బంధం కదా ఆ మాత్రం ప్రేమ ఉంటుందని కార్తీక్ అంటాడు. ఏంట్రా పేగు బంధమా? అని పారు అడిగితే, ప్రేమ బంధం పారు అని కవర్ చేస్తాడు కార్తీక్. జ్యోత్స్నది పేగు బంధమే కదా మరి ఎందుకు కన్నీళ్లు కార్చదని అడుగుతాడు కార్తీక్. అమ్మను కాపాడుకుంటాననే నమ్మకం జ్యోకు ఉందని పారు చెప్తుంది.
అత్తకు ఏం జరిగిందో తెలుసు. త్వరలో ఆపరేషన్ జరుగుతుంది. అందుకే ఇలాగే సరదగా ఉంటా. అత్తను ఆ శాడ్ మూడ్ లో నుంచి బయటకు రప్పించేందుకు ఎన్ని రూపాలైనా మారుస్తానని కార్తీక్ అంటాడు. మీ అత్తను ఇలాగే నవ్వించమని కార్తీక్ కు చెప్తాడు దశరథ. బాధ్యతలు తీర్చకుండానే చనిపోతానేమోనని అత్త భయమని కార్తీక్ అంటాడు.
తప్పించుకున్న దాసు
దాసు టిఫిన్ చేసేందుకు రౌడీ కట్లు విప్పి బయటకు వెళ్లిపోతాడు. అప్పుడు కార్తీక్ కు కాల్ చేస్తాడు దాసు. కానీ రౌడీ వస్తున్నాడని కట్ చేసి ఫోన్ జేబులో పెట్టుకుంటాడు. అప్పుడే కార్తీక్ కాల్ రావడంతో ఫోన్ మోగుతుంది. రౌడీ ఫోన్ లాగేసుకుంటాడు. రౌడీలను నెట్టేసి దాసు తప్పించుకుంటాడు. జ్యోత్స్న పాపం పండే రోజు వచ్చిందని పరుగెత్తుతాడు. ఇక్కడితో కార్తీక దీపం 2 సీరియల్ నేటి ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


