కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: బాబోయ్ అదిరే ట్విస్ట్! శత్రువు దక్షిణామూర్తి ప్రాణం కాపాడిన శివనారాయణ-జ్యోకు తెలిసిన రహస్యం

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: కార్తీక దీపం 2 టుడే మే 26 ఎపిసోడ్ లో ట్విస్ట్ లు మామూలుగా ఉండవు. దక్షిణామూర్తికి యాక్సిడెంట్ అయితే కార్తీక్, దీప కలిసి హాస్పిటల్ కు తీసుకొస్తారు. దక్షిణామూర్తికి శివ నారాయణ బ్లడ్ ఇస్తాడు. పేషెంట్ ను చూసి శ్రీధర్ మైండ్ బ్లాక్ అవుతుంది. ఈ విషయం జ్యోత్స్నకు తెలుస్తుంది.

Published on: May 26, 2026, 07:16:51 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: కార్తీక దీపం 2 సీరియల్ లో దీప వర్సెస్ జ్యోత్స్న పోటీ కొనసాగుతోంది. ఇంట్లో అందరూ దీపకు సపోర్ట్ గా ఉండటం చూసి జ్యోత్స్న మండిపడుతుంది. దీపను ఎలాగైనా దెబ్బ కొట్టాలని ఆలోచిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో కార్తీక దీపం 2 టుడే మే 26 ఎపిసోడ్ లో చూసేయండి.

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)

దక్షిణామూర్తికి యాక్సిడెంట్

దీప, కార్తీక్ గుడికి వెళ్లి స్కూటీపై వస్తుంటారు. దారిలో వాళ్లను దక్షిణామూర్తి చూస్తాడు. కార్తీక్ అని పిలుస్తాడు. కార్తీక్ తో మాట్లాడాలని అంటాడు. అప్పుడే ఓ జీప్ వచ్చి దక్షిణామూర్తిని ఢీకొడుతుంది. తలకు తీవ్ర గాయమైన దక్షిణామూర్తిని కార్తీక్, దీప కలిసి హాస్పిటల్ కు తీసుకెళ్తారు.

శ్రీధర్ కు సర్జరీ

మరోవైపు శ్రీధర్, శివ నారాయణ డాక్టర్ ను కలుస్తారు. శ్రీధర్ పరిస్థితి ఎలా ఉందని డాక్టర్ ను శివ నారాయణ అడుగుతాడు. వీలైనంత త్వరలో శ్రీధర్ కు ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్పడంతో శివ నారాయణ షాక్ అవుతాడు. ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలని డాక్టర్ చెప్తాడు. నాకు స్ట్రెస్ తగ్గింది, హ్యాపీగా ఉన్నా. త్వరలోనే సర్జరీకి ప్లాన్ చేద్దామని శ్రీధర్ చెప్తాడు.

జ్యోకు అనుమానం

సీన్ శివ నారాయణ ఇంటికి మారుతుంది. కార్తీక్, దీప గుడికి వెళ్తే ఇప్పటికే ఇంటికి రావాలి కదా అని పారిజాతంతో జ్యోత్స్న అంటుంది. వాళ్లకు అంత ఫ్రీడమ్ ఇవ్వకూడదని కార్తీక్ కు జ్యో కాల్ చేస్తుంది. తాతకు యాక్సిడెంట్ జరిగిన విషయం జ్యోత్స్నకు తెలిసిందేమోనని దీప టెన్షన్ పడుతుంది. తెలిసిన మనిషికి యాక్సిడెంట్ అయితే హాస్పిటల్ తీసుకొచ్చామని జ్యోకు కార్తీక్ చెప్తాడు.

పిట్ట కథలు చెప్పకు బావ అని జ్యో అనగానే కార్తీక్ మండిపడతాడు. బుద్ధి ఉందా లేదా? నువ్వు అసలు మనిషివేనా? ఇక్కడ ఓ సన్నాసి ఉన్నాడు. ఎంత చెప్పినా అర్థం కావడం లేదని చెప్పి కార్తీక్ కాల్ కట్ చేస్తాడు. హాస్పిటల్ లో అడ్మిట్ అయిన ఆ మనిషి ఎవరు? అని జ్యోత్స్న ఆలోచిస్తుంది.

శివ నారాయణ బ్లడ్ డొనేషన్

అదే హాస్పిటల్ లో శివ నారాయణ, శ్రీధర్ ను చూసి కార్తీక్, దీప షాక్ అవుతారు. మీరు ఎందుకు హాస్పిటల్ కు వచ్చారు? చేతికి ఆ రక్తం మరకలు ఏంటి? అని కార్తీక్ ను శివ నారాయణ అడుగుతాడు. అప్పుడే డాక్టర్ వచ్చి పేషెంట్ కు బ్లడ్ చాలా పోయింది, ప్రాణాలు కాపాడటం కష్టం. ఆర్జెంట్ గా ఏ పాజిటివ్ బ్లడ్ కావాలని కార్తీక్ తో చెప్తాడు. గుడి నుంచి వస్తుంటే ఓ వ్యక్తికి యాక్సిడెంట్ జరిగిందని తాతకు కార్తీక్ చెప్తాడు. వెంటనే తనది ఏ పాజిటివ్ అని, బ్లడ్ ఇస్తానని శివ నారాయణ అంటాడు.

మైండ్ బ్లాక్

ఓ సారి పేషెంట్ ను చూద్దామని శ్రీధర్ వెళ్తాడు. అక్కడ బెడ్ మీద దక్షిణామూర్తిని చూసి శ్రీధర్ మైండ్ బ్లాక్ అవుతుంది. యాక్సిడెంట్ జరిగింది దక్షిణామూర్తికా అనుకుంటూ కార్తీక్, దీప దగ్గరకు శ్రీధర్ వస్తాడు. తప్పు చేశావ్ రా, పేషెంట్ దక్షిణామూర్తి అని తాతకు తెలియదు. మీ తాత ద్వేషించే ఒకే ఒక్క వ్యక్తి దక్షిణామూర్తి. అలాంటి వ్యక్తికి బ్లడ్ ఇచ్చానని తెలిస్తే ఎలా ఉంటుందో ఆలోచించు. నిజం చెప్పేయ్ అని కార్తీక్ కు శ్రీధర్ చెప్తాడు.

అప్పటికే శివ నారాయణ బ్లడ్ డొనేట్ చేసేస్తాడు. ఆ పేషెంట్ ను ఓ సారి చూద్దామంటాడు. కరెక్ట్ గా లోపలికి వెళ్లే టైమ్ కు శివ నారాయణకు ఫోన్ కాల్ వస్తుంది. అర్జెంట్ పని అని శ్రీధర్ ను తీసుకొని శివ నారాయణ వెళ్లిపోతాడు. బాంబ్ పేలేదే, నిప్పు వత్తి దగ్గరకు వచ్చి ఆగిందని చెప్పి శ్రీధర్ కూడా వెళ్లిపోతాడు.

జ్యోకు ఛాన్స్

కాంచన దగ్గరకు పరుగెత్తుకుంటూ వచ్చిన శ్రీధర్ అర్జెంట్ గా తనను ఇంటికి వెళ్లమంటాడు. దక్షిణామూర్తికి యాక్సిడెంట్ అయితే కార్తీక్, దీప హాస్పిటల్లో జాయిన్ చేశారు. అదే టైమ్ లో మేం అక్కడికి వెళ్లాం. పేషెంట్ కు బ్లడ్ కావాలంటే మీ నాన్న డొనేట్ చేశాడని శ్రీధర్ చెప్తాడు. ఈ మాటలను పారిజాతంం, జ్యోత్స్న దొంగచాటుగా వింటారు. ఈ నిజం మామయ్యకు తెలిస్తే పెద్ద గొడవ జరుగుతుందని శ్రీధర్ చెప్తాడు. మంచి ఛాన్స్ దొరికిందని జ్యోత్స్న సంబరపడిపోతుంది.

తాతే రక్తం ఇచ్చాడని

మరోవైపు కార్తీక్ తో దక్షిణామూర్తి మాట్లాడతాడు. నీకు రక్తం ఇచ్చింది మా తాత శివ నారాయణ అని కార్తీక్ చెప్తాడు. నా చావు చూడాలనుకునే శివ నారాయణ నాకు ప్రాణం పోశాడా? అని దక్షిణామూర్తి ఫీల్ అవుతాడు. అదే విధి రాత. బ్లడ్ ఎక్కించకపోతే చచ్చిపోతావని డాక్టర్ చెప్పాడు. అదే టైమ్ లో ఈ హాస్పిటల్ కు మా తాత రావడం ఏంటీ? కర్మ సిద్ధాంతాన్ని ఎవరూ తప్పించలేరని కార్తీక్ అంటాడు.

తన వాళ్లను పిలవమని శివ నారాయణ ఇంటి అడ్రెస్ చెప్తాడు దక్షిణామూర్తి. ఆ ఇంట్లోనే నా కూతురు ఉంటుంది. వీలైతే దగ్గర ఉండి తీసుకురండి. మీరు వెళ్లండని కార్తీక్, దీపను పంపించేస్తాడు దక్షిణామూర్తి. ఇక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More