...
...
Next Story

Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2.. ఏం ప్లాన్ వేశావ్ మాలిని? సూరజ్, జ్యో పెళ్లి జరగకుండా పారిజాతంతో కుట్ర!

Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ టుడే నవంబర్ 16 ఎపిసోడ్ లో జ్యోను పెళ్లి చేసుకుంటానని సూరజ్ ఇండైరెక్ట్ గా చెప్తాడు. సూరజ్, జ్యో పెళ్లి జరగకుండా పారిజాతంతో మాలిని కన్నింగ్ ప్లాన్ వేస్తుంది. తన కొడుకు దగ్గరకు వెళ్లి కొత్త నాటకం స్టార్ట్ చేస్తుంది.

Published on: Nov 16, 2026, 07:02:22 IST
Advertisement

Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. సూరజ్ కార్లో జ్యోత్స్న వెళ్లడాన్ని పారిజాతం చూస్తుంది. వెంటనే ఈ విషయాన్ని మా మూసలోడితో చెప్పాల్సిందేనని పారు అనుకుంటుంది. కానీ పారును ఎవరో కిడ్నాప్ చేస్తారు.

అమ్మను ఒప్పిస్తా

కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఎపిసోడ్ (jiohotstar)
కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఎపిసోడ్ (jiohotstar)

మన ఇద్దరి జీవితాలకు సంబంధించిన ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవడానికే రమ్మన్నా. అమ్మతో చెప్పి ఓ వింతైన విషయం చేద్దాం. మా అమ్మకు కేవలం ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తా. అమ్మను ఒప్పిస్తా. నా కోసం బతుకుతున్న ఒకే ఒక్క మనిషి మా అమ్మ అని జ్యోత్స్నతో సూరజ్ అంటాడు. ఇంకెవరూ లేరా? లేదా తమరు గుర్తించడం లేదా అని జ్యోత్స్న అడుగుతుంది.

కథకు ముగింపు

ఈ ప్రశ్నకు సమాధానమే నేను మన కథకు ఇవ్వానుకుంటున్న ముగింపు. నాకే కొత్తగా ఉంది. కానీ ఇప్పుడు చెప్పలేను. తీరా చెప్పిన తర్వాత నువ్వు సిద్ధంగా లేను అంటే ఎలా అని ఇప్పుడే మాట్లాడుతున్నానని ఇండైరెక్ట్ గా జ్యోత్స్నతో పెళ్లి గురించి సూరజ్ మాట్లాడినట్లు కనిపిస్తుంది. ఈ కథకు ముగింపు వెతకడమంటే ఆకాశానికి ముగింపు వెతికినట్లేనని జ్యోత్స్న అంటుంది.

నా దగ్గర తాళి

మన దగ్గర దాచుకున్న అందమైన వస్తువులే కథకు ముగింపునిస్తాయని సూరజ్ అంటాడు. ఆ వస్తువు ఏంటో అని జ్యో అడుగుతుంది. అప్పుడు తాళిని సూరజ్ గుర్తు చేసుకుంటాడు. ఒకప్పుడు నీ దగ్గర ఉంది, ఇప్పుడు లేనిది. అది నీకు సొంతం కావాల్సిందేనని సూరజ్ అంటాడు. మనం యుద్ధాన్ని కోరుకుంటే ఇది కొనసాగించాలి. కానీ శాంతిని కోరుకుంటే ముగించాలి. ఇది ముగించాల్సిందేనని సూరజ్ క్లారిటీగా చెప్తాడు.

పారిజాతాన్ని మాలిని ఇంటికి తీసుకెళ్తారు. నువ్వా నన్ను ఎత్తుకొచ్చిందని మాలినితో మాట్లాడుతూ పారు షాక్ అవుతుంది. మాట్లాడదామంటే రావు కాదా, అందుకే ఎత్తుకొచ్చా. జ్యోత్స్న ఎవరు? అని మాలిని అడుగుతుంది. శివ నారాయణ మనవరాలు అని పారు చెప్తుంది. జ్యోత్స్నపై ప్రేమ ఉంటే అలా వదిలేసేదానివే కాదని మాలిని అంటుంది.

జ్యోత్స్న మనసులో సూరజ్

పెళ్లి చేసుకోమంటే చేసుకోవడం లేదు. ఎందుకో నీ కొడుకునే అడుగు. ఇప్పుడు జ్యోత్స్న నీ కొడుకు దగ్గరే ఉంది. టిఫిన్ బండి దగ్గరకు వచ్చి జ్యోత్స్నను తీసుకెళ్లాడని పారిజాతం చెప్పడంతో మాలిని షాక్ అవుతుంది. పారును మాయ చేసి మాలిని అన్ని విషయాలు రాబడుతుంది. జ్యోత్స్న మనసులో సూరజ్ ఉన్నాడు. సూరజ్ మనసులో జ్యోత్స్న ఉంది. ఏదో ఒక రోజు వాళ్లు పెళ్లి చేసుకొని వస్తారని పారు అంటుంది.

పారుకు డబ్బు ఆఫర్

ఇది జరగదు. నేను గీసిన గీత నా కొడుకు దాటడు. వేరే అమ్మాయి మెడలో తాళి కట్టమంటే కడతాడు. మరి జ్యోత్స్న పరిస్థితి ఏంటీ? ఓ సమాధానం లేని ప్రశ్నగా జ్యోత్స్న జీవితం మిగిలిపోతుంది. సూరజ్ ను జ్యోత్స్న మర్చిపోతే జ్యోత్స్న జీవితం బాగుపడుతుంది. జ్యోత్స్న వినే దారి ఉంది. నీ లైఫ్ లో చూడనంత డబ్బు ఇందులో ఉందని మాలిని సూట్ కేస్ తెప్పిస్తుంది.

సూరజ్ ను మర్చిపో జ్యోత్స్న

అయితే తాను చెప్పినట్లుగా చేస్తేనే ఈ డబ్బు ఇస్తానని పారిజాతంతో మాలిని కన్నింగ్ ప్లాన్ వేస్తుంది. వెంటనే పారు వెళ్లి జ్యోత్స్నతో మాట్లాడుతుంది. సూరజ్ ను మర్చిపో. అన్ని బంధాలను, ఎమోషన్స్ ను వదిలేయ్. నీ కోసమే బతుకు. నీ మనసులో సూరజ్ లేడని చెప్పు అని పారు అడుగుతుంది. నా మనసులో సూరజ్ ఎప్పుడూ ఉంటాడని జ్యోత్స్న చెప్తుంది.

ప్రమాదంలో ఉన్నావ్

మనసులో నుంచి సూరజ్ ను తీసేయడం కష్టమని జ్యోత్స్న తెగేసి చెప్తుంది. కానీ పారిజాతం మాత్రం జ్యో మనసు మార్చేందుకు ప్రయత్నిస్తుంది. తన మాట వినమంటుంది. నేను బిడ్డలను మార్చినప్పుడు ముహూర్తం చూశా. కానీ నీ జీవితం ఇలా అయింది. నువ్వు నా మాట వింటే నీ భవిష్యత్ ను మార్చగలను. నువ్వు ప్రమాదంలో ఉన్నావ్. నీ వెనుక చాలా జరుగుతుందని పారు చెప్తుంది.

పారు మాటలను జ్యోత్స్న అసలు వినదు. పారు చేతిలో డబ్బు పెట్టి ఆటోలో వెళ్లమంటుంది. ఇక నేను చేతలతో చేయాల్సిందేనని పారు అంటుంది. దీంతో పారుతో మాలిని కొత్త కుట్రకు తెరతీసినట్లు అర్థమవుతుంది.

జ్యోత్స్నను ప్రేమిస్తున్నావా?

ఆఫీస్ కు వెళ్లి సూరజ్ ను మాలిని ప్రశ్నిస్తుంది. జ్యోత్స్నను ప్రేమిస్తున్నావా? జ్యోత్స్నతో కలిసి బతకాలనుకుంటున్నావా? నిన్ను చూస్తే ఇలా అడగాలనిపిస్తుంది. ఇదే నిజమైతే, నువ్వు మనస్ఫూర్తిగా జ్యోత్స్నను జీవితంలోకి ఆహ్వానించాలనుకుంటే నీ ప్రేమకు ఈ అమ్మ ఎప్పుడూ అడ్డు రాదు. జ్యోత్స్న మీ నాన్న చావుకు కారణమైన సుమిత్ర కూతురు అయినా సరే నేను ఆ విషయం మర్చిపోతానని మాలిని ఎమోషనల్ డ్రామా స్టార్ట్ చేస్తుంది.

నాకు నీ సంతోషం కంటే ఏది విలువైంది కాదు. నీ కోసం మీ అమ్మ ఏదైనా చేస్తుంది. కానీ జ్యోత్స్న ఎందుకు ఇలా చేసింది? నాకు చెప్పడానికి ఇబ్బందిగా ఉంది. కానీ ఆ నిజం నీకు తెలియాలి కదా అని మాలిని మంట పెడుతుంది. ఇక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks