Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 ఈ రోజు ఎపిసోడ్ లో.. సూరజ్, జ్యోత్స్న ఒకటి కావొద్దనే ఉద్దేశంతో మాలిని కొత్త కుట్రకు తెరతీస్తుంది. జ్యోత్స్న ప్రేమ నిజం కాదు నాన్న. అది ప్రేమను అమ్మేసుకుంది. డబ్బు కోసమే నీ కొడుకును ప్రేమించా. రూ.2 కోట్లు ఇస్తే వదిలేస్తానని జ్యోత్స్న చెప్పిందని సూరజ్ తో మాలిని లేనిపోని మాటలు చెప్తుంది.
జ్యోత్స్నకు రూ.2 కోట్లు

మాలిని మాటలను సూరజ్ నమ్మడు. అబద్ధమని కొట్టిపడేస్తాడు. కానీ మాలిని ఏమో డబ్బు కూడా ఇచ్చానని చెప్తుంది. జ్యోత్స్న అకౌంట్లో వేయమని రూ.2 కోట్లు ఇచ్చానని మాలిని అంటుంది. లేదమ్మా ఎక్కడో తప్పు జరిగింది. ఇది నిజం కాదు. జ్యోత్స్న పేరు చెప్పి నిన్నెవరో మోసం చేశారని సూరజ్ అంటాడు. మోసపోయింది నువ్వే. డబ్బు కోసం జ్యోత్స్న వాళ్ల నానమ్మ పారిజాతమే వచ్చిందని మాలిని చెప్పేసరికి సూరజ్ షాక్ అవుతాడు.
వీడియోతో కుట్ర
పారిజాతాన్ని జ్యోత్స్న పంపించింది. వాళ్ల ఇంట్లో సంబంధాలు చూస్తున్నారంటా. అవకాశాన్ని వాడుకోవాలని రూ.2 కోట్లు అడిగింది. అబద్ధపు ప్రేమకు నా కొడుకు బలైపోవొద్దని డబ్బు ఇచ్చా. సాక్ష్యం లేకుండా నువ్వు ఏది నమ్మవు. అందుకే నీకు వీడియో పంపించానని మాలిని అంటుంది. ఆ వీడియోలో జ్యోత్స్న డబ్బు కోసమే పంపించినట్లు పారిజాతం మాట్లాడుతుంది.
వీడియో చూసి సూరజ్ మైండ్ బ్లాక్ అవుతుంది. ఈవిడ అబద్ధం చెప్తుందేమో అమ్మ అని సూరజ్ అంటాడు. జ్యోత్స్న అకౌంట్ చూడు. అందులో రూ.2 కోట్లు డిపాజిట్ అయిందంటే నేను చెప్పేది నమ్మాలని మాలిని కన్నింగ్ గా మాట్లాడుతుంది. వెళ్లి జ్యోత్స్ననే అడగమంటుంది.
మెసేజ్ చూసి సూరజ్ షాక్
జ్యోత్స్న హ్యాపీగా ఆఫీస్ కు వస్తుంది. సూరజ్ ముగింపుతోనే నా ముందుకు వస్తాడని జ్యో అనుకుంటుంది. అప్పుడే సూరజ్ ను ఢీ కొడుతుంది. మాట్లాడదామని జ్యోత్స్నను సూరజ్ పక్కకు తీసుకెళ్తాడు. జ్యోత్స్న ఫోన్లో బ్యాంకులో రూ.2 కోట్లు డిపాజిట్ అయినట్లు మెసేజ్ చూసి సూరజ్ షాక్ అవుతాడు. దీంతో మాలిని మాటలను సూరజ్ నమ్మి జ్యోత్స్నను నానామాటలు అంటాడు.
రూ.2 కోట్లకు అమ్ముకున్నావ్
{{/usCountry}}జ్యోత్స్న హ్యాపీగా ఆఫీస్ కు వస్తుంది. సూరజ్ ముగింపుతోనే నా ముందుకు వస్తాడని జ్యో అనుకుంటుంది. అప్పుడే సూరజ్ ను ఢీ కొడుతుంది. మాట్లాడదామని జ్యోత్స్నను సూరజ్ పక్కకు తీసుకెళ్తాడు. జ్యోత్స్న ఫోన్లో బ్యాంకులో రూ.2 కోట్లు డిపాజిట్ అయినట్లు మెసేజ్ చూసి సూరజ్ షాక్ అవుతాడు. దీంతో మాలిని మాటలను సూరజ్ నమ్మి జ్యోత్స్నను నానామాటలు అంటాడు.
రూ.2 కోట్లకు అమ్ముకున్నావ్
{{/usCountry}}నీ ప్రేమను రూ.2 కోట్లకు అమ్ముకుంటున్నావంటే నీ మనసుకు, బజారు వస్తువుకు తేడా ఏంటీ? అని సూరజ్ అంటాడు. నా మనసును బజారు వస్తువుతో పోల్చావంటే నీకు మర్యాద దక్కదు జాగ్రత్త అని జ్యోత్స్న వార్నింగ్ ఇస్తుంది. నీ అకౌంట్లో రూ.2 కోట్లు క్రెడిట్ అయ్యాయని సూరజ్ మెసేజ్ చూపిస్తే ఈ సారి జ్యోత్స్న షాక్ అవుతుంది. ఆ డబ్బు మా అమ్మ పంపించిందని సూరజ్ చెప్తాడు.
మీ నానమ్మ పారిజాతాన్ని రాయబారానికి పంపించావని పారు మాట్లాడిన వీడియోను సూరజ్ చూపిస్తాడు. నేను పంపించలేను. అసలు దీని గురించి నాకేం తెలియదని జ్యోత్స్న అంటుంది. కానీ సూరజ్ నమ్మడు. ఇదంతా రాంగ్ అని ప్రూవ్ చేస్తే? నా మీద నింద పడింది. ఇవేమీ నాకు తెలియదు సూరజ్ అని జ్యోత్స్న అంటున్నా సూరజ్ వినడు.
సూరజ్ గుడ్ బై
డబ్బులు ఎందుకు పంపించిందో మీ అమ్మనే అడుగుతానని జ్యోత్స్న అంటుంది. కానీ సూరజ్ మాత్రం జ్యోత్స్నతో ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతూనే ఉంటాడు. అన్నింటికీ నీ దగ్గరే ఒక రేటు ఉంటుంది కదా అని సూరజ్ అనగానే జ్యోత్స్న కోపంతో ఊగిపోతుంది. నువ్వు నన్ను మర్చిపోవడానికి ఎన్ని కోట్లు కావాలి? మంచి ముగింపు ఇచ్చావ్ జ్యోత్స్న. నీకు ఎంత కావాలో చెప్పు. గుడ్ బై అని సూరజ్ వెళ్లిపోతాడు. ఇదంతా దూరం నుంచి మాలిని చూసి నవ్వుకుంటుంది. కార్తీక్, దీప కూడా చూస్తారు. జ్యోత్స్న ఏమో కన్నీళ్లు పెట్టుకుంటుంది.
సుమిత్రపై దొంగతనం నింద
మరోవైపు సుమిత్ర పని చేసే ఇంటి ఓనర్ పార్వతి తన చెవి దుద్దులను సుమిత్ర తీసిందని నింద వేస్తుంది. అప్పుడే దశరథ వస్తే ఈ వంట మనిషి దొంగతనం చేసిందని ఓనర్ ఫ్రెండ్ చెప్తుంది. తాను చేయలేదని చెప్తుంది కదా అని దశరథ అంటే.. మరి మీరు చేశారా అని అడుగుతారు. తాను ఏ తప్పు చేయలేదని సుమిత్ర ఏడుస్తున్నా కూడా పార్వతి వినదు.
సారీ చెప్పిన ఓనర్
పోలీసులను పిలిచేలోపు చెవి దుద్దులు ఇచ్చి వెళ్లిపో అని పార్వతి అంటుంది. డబ్బు ఇవ్వకపోయినా సరే కానీ దొంగతనం చేశానంటే ఒప్పుకోను. అవి దొరికేవరకూ ఎక్కడికి వెళ్లను అని సుమిత్ర అంటుంది. అప్పుడే ఆ చెవి దుద్దులు నీవేనా అమ్మా అని పార్వతి కూతురు వస్తుంది. డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర పెట్టి మీరే మర్చిపోయారని సుమిత్ర గట్టిగా మాట్లాడుతుంది.
ఇక నేను మీ ఇంట్లో వంట మనిషిగా పని చేయలేను. ఈ రోజు పాపకు దొరికితే ఇచ్చింది. రేపు పోతే నేనే తీశానంటారని సుమిత్ర అంటుంది. కానీ పార్వతి సారీ చెప్పి రిక్వెస్ట్ చేసేసరికి సుమిత్ర ఉండిపోతుంది.
మాలిని హత్య చేసింది
మరోవైపు మాలిని అత్త ఆడుతున్న డ్రామా ఇదంతా అని కార్తీక్, దీపకు జ్యోత్స్న చెప్తుంది. సూరజ్ పెళ్లి గురించి మాట్లాడేందుకు రెడీ అయ్యాడు. పారు నాతో మాట్లాడిందని జరిగింది జ్యోత్స్న చెప్తుంది. సూరజ్ మనసులో మాలిని విషం నింపి పంపించిందని దీప అంటుంది. తన కొడుకు చేత జ్యోత్స్న ఎక్కడ తాళి కట్టించుకుంటుందోనని మాలిని ఇలా చేసింది. ఇది హత్య. జ్యోత్స్న వ్యక్తిత్వాన్ని మాలిని చంపేసిందని కార్తీక్ సీరియస్ అవుతాడు.
పారుతోనే నిజం
మాలిని పిన్ని వ్యక్తిత్వాన్ని సూరజ్ ముందు చంపేయాలి. ముళ్లును ముళ్లుతోనే తీయాలి. ఆ మాలిని పిన్నిని చావుదెబ్బ కొట్టాలి. పారుతోనే నిజం చెప్పించాలి. పారును తీసుకొని మాలిని పిన్ని ఇంటికి వెళ్దాం. మాలిని ఎలాంటిదో సూరజ్ కు తెలియాల్సిన టైమ్ వచ్చిందని కార్తీక్ చెప్పడంతో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.