Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఎపిసోడ్ లో.. రూ.2 కోట్లకు జ్యోత్స్న ప్రేమ అమ్ముకుందని సూరజ్ మనసులో మాలిని విషం నాటుతుంది. దీంతో జ్యోకు సూరజ్ గుడ్ బై చెప్తాడు. ఈ విషయాన్ని మాలిని ఇంట్లోనే తేల్చుకుందామని కార్తీక్, దీప, జ్యోత్స్న అనుకుంటారు.
సూరజ్ బాధ

మరోవైపు తల్లి మాటలను గుడ్డిగా నమ్మిన సూరజ్ ఇంట్లో కూర్చుని బాధపడుతుంటాడు. సూరజ్ ను ఏమైందని దక్షిణామూర్తి అడుగుతాడు. కానీ సూరజ్ ను మాట్లాడనివ్వకుండా మాలిని అడ్డుకుంటుంది. వాడు నిజాలు తెలుసుకున్నాడు. కాసేపు ఒంటరిగా వదిలేయండి మామయ్య అని మాలిని అంటుంది. ఏంటా నిజాలు అని దక్షిణామూర్తి అడుగుతాడు.
జ్యోత్స్నపై మచ్చ
అది నేను చెప్తాను తాత అని కార్తీక్ ఎంట్రీ ఇస్తాడు. వెనుకాలే దీప, జ్యోత్స్నతో పాటు పారిజాతం కూడా వస్తారు. ఒక అబద్ధాన్ని అందమైన నిజంలా మార్చగలా పిన్ని వల్ల మేం రావాల్సి వచ్చిందని కార్తీక్ అంటాడు. ఏదైనా ఉంటే ఆఫీస్ లో మాట్లాడుకుందామని సూరజ్ చెప్తాడు. మేం వచ్చింది ఆఫీస్ సమస్య గురించి కాదు. నా చిన్న మరదలు జ్యోత్స్నపై మచ్చ పడింది. అది చెప్పేందుకే వచ్చానని కార్తీక్ అంటాడు.
రూ.2 కోట్ల సెటిల్మెంట్
అది మచ్చ కాదు నిజమే కదా. జ్యోత్స్న అకౌంట్లోకి డబ్బులు ఎందుకు వచ్చాయని సూరజ్ అడుగుతాడు. మీ అమ్మ పారుతో వేయిస్తే వచ్చాయి. ఈ పాయింట్ గట్టిగా నోట్ చేయండని కార్తీక్ చెప్తాడు. జ్యోత్స్న నన్ను రూ.2 కోట్లు అడిగిందని మాలిని మళ్లీ అబద్ధం చెప్తుంది. ఈ రూ.2 కోట్లకు నష్టపరిహారమా, లంచమా లేదా సెటిల్మెంటా ఏమని పేరు పెట్టాలి? అని కార్తీక్ అడుగుతాడు. సెటిల్మెంట్ అనుకో అని మాలిని అంటుంది.
కొడుకు మనసులో జ్యోత్స్న
జ్యోత్స్న నిన్ను మర్చిపోయేందుకు మీ అమ్మ రూ.2 కోట్ల సెటిల్మెంట్ చేసింది సూరజ్. నువ్వు జ్యోత్స్నను చాలా గాఢంగా ప్రేమిస్తున్నావ్. అదే విషయం మీ అమ్మ చెప్పిందని కార్తీక్ అంటాడు. నా కొడుకును మర్చిపో అని నువ్వు జ్యోత్స్నకు రూ.2 కోట్లు ఇచ్చావంటే నీ కొడుకు జ్యోత్స్నను ప్రేమిస్తున్నాడని నమ్ముతున్నట్లే కదా అని మాలినిని లాజిక్ తో కార్తీక్ దెబ్బకొడతాడు. నీ కొడుకు మనసులో జ్యోత్స్న ఉందనేది పచ్చి నిజమని కార్తీక్ గట్టిగా చెప్తాడు.
ప్రేమకు ఖరీదు కట్టావ్
{{/usCountry}}జ్యోత్స్న నిన్ను మర్చిపోయేందుకు మీ అమ్మ రూ.2 కోట్ల సెటిల్మెంట్ చేసింది సూరజ్. నువ్వు జ్యోత్స్నను చాలా గాఢంగా ప్రేమిస్తున్నావ్. అదే విషయం మీ అమ్మ చెప్పిందని కార్తీక్ అంటాడు. నా కొడుకును మర్చిపో అని నువ్వు జ్యోత్స్నకు రూ.2 కోట్లు ఇచ్చావంటే నీ కొడుకు జ్యోత్స్నను ప్రేమిస్తున్నాడని నమ్ముతున్నట్లే కదా అని మాలినిని లాజిక్ తో కార్తీక్ దెబ్బకొడతాడు. నీ కొడుకు మనసులో జ్యోత్స్న ఉందనేది పచ్చి నిజమని కార్తీక్ గట్టిగా చెప్తాడు.
ప్రేమకు ఖరీదు కట్టావ్
{{/usCountry}}ఎవరో దారిన పోయేవాళ్లు వచ్చి నీ కొడుకు వెంట పడను రూ.4 కోట్లు ఇవ్వమంటే ఇస్తావా? నీ కొడుకు ఎవరిని ప్రేమిస్తున్నాడన్నదే కదా పాయింట్. నీ కొడుకు మనసులో జ్యోత్స్న ఉందని నమ్ముతున్నావ్ కాబట్టి నీ కొడుకు ప్రేమకు ఖరీదు కట్టావ్. మోసంతో ప్రేమను చంపేయాలనుకున్నావ్. అందుకు పారును వాడుకున్నావ్. డబ్బు వేయించావ్. నీ కొడుకును నమ్మించాలని చూశావ్. నీ కొడుక్కి నీ మాటలే వేదాలు. అందుకే నమ్మేశాడని అసలు విషయం కార్తీక్ బయటపెడతాడు.
ప్లేటు తిప్పేసిన పారు
నీ కొడుకు మనసులోని ప్రేమను కేవలం రూ.2 కోట్లకే అమ్మేశావ్ ఏంటీ పిన్ని? అని కార్తీక్ లాయర్ లా తెలివిగా మాట్లాడతాడు. మాలిని మాటకు ఆధారాలు కూడా ఉంటాయి. చెప్పేవాళ్లతోనే చెప్పిస్తానని పారును చెప్పమంటుంది మాలిని. పారిజాతం బిల్డప్ గా సోఫాలో కూర్చుని అన్ని నిజాలే చెప్తానంటుంది. మాలినిని తానే కలిశానని పారు ప్లేటు తిప్పేస్తుంది.
ఆస్తి కోసమే ప్రేమ
జ్యోత్స్ననే డబ్బు కోసం తనను పంపించిందని మాలిని కుట్ర ప్రకారం పారిజాతం అబద్ధాలు చెప్తూనే ఉంటుంది. అసలు జ్యోత్స్న నీతో పెళ్లికి ఒప్పుకుందే డబ్బు కోసం. నీతో పెళ్లి ప్రపోజల్ పెట్టినప్పుడు జ్యోత్స్న నిన్ను చేసుకోను అన్నది. కానీ సూరజ్ ను జ్యోత్స్న పెళ్లి చేసుకుంటేనే ఆస్తి మొత్తం దక్కుతుందని వాళ్ల నాన్న వీలునామా రాయించాడు. పెళ్లి చేసుకోకపోతే ఆస్తి పోతుందని ఒప్పుకొంది. నేనే జ్యోను ఒప్పించానని పారిజాతం జరిగిన విషయాన్ని మాలినికి ఫేవర్ గా మార్చి చెప్తుంది.
పారు అబద్ధాలు
సూరజ్ తో జ్యోత్స్న ప్రేమ నాటకం ఆడింది. ఆస్తి కోసమే పెళ్లి చేసుకుంటానంది. ఆ మాట అబద్ధం కాదని దీపపై ఒట్టు వేసి చెప్పమను అని జ్యోను పారు దెబ్బకొడుతుంది. ఇది నిజమేనని జ్యో తల ఊపుతుంది. కానీ ఆ తర్వాత జరిగినవన్నీ ఆస్తి కోసమే చేసిందని పారు పచ్చి అబద్ధాలు చెప్తుంది. నీ చేత తాళి కట్టించుకుంటాననే నమ్మకం జ్యోకు పోయింది. పైగా ఇంట్లో తనకు సంబంధాలు చూస్తున్నారు. అందుకే బేరానికి నన్ను పంపిందని పారు చెప్తుంది.
ఇవన్నే నిజాలే
ఒక మనిషి జీవితానికి సరిపడా పాపాలన్నీ ఒకే సారి చేస్తున్నావ్ పారు అని కార్తీక్ సీరియస్ అవుతాడు. మీ సొంత మనిషి చెప్పింది కాబట్టి ఇవన్నీ నిజాలే. ఈ జ్యోత్స్న ఆస్తి కోసం, డబ్బు కోసం అమ్ముడుపోయే మనిషి అని సూరజ్ బ్రైన్ ను మాలిని ఇంకా వాష్ చేస్తుంది. ఇంట్లో చూసిన సంబంధాన్ని చేసుకొని రూ.2 కోట్లతో జ్యోత్స్న హాయిగా ఉంటుందని మాలిని చెప్తుంది.
ప్రేమకు సమాధి
నీ తెలివితేటలకు చప్పట్లు కొట్టాలని ఉంది పిన్ని. పువ్వులు నీ పాదాల మీద చల్లేవాడిని. మనుషులను ఇలా కూడా చంపొచ్చా? అని కార్తీక్ అడుగుతాడు. మీ అమ్మ లాంటి అమ్మ ఉండటం నీ పూర్త జన్మ సుకృతం సూరజ్ అని కార్తీక్ చెప్తాడు. పారును కార్తీక్ బయటకు లాక్కెళ్తాడు. నీ ప్రేమకు ఎలా సమాధి కట్టానో చూశావా జ్యోత్స్న అని మాలిని అనుకుంటుంది. ఇక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.