Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2.. కళ్లు తెరవగానే జ్యోత్స్ననే కావాలన్న సూరజ్- మాలినికి దిమ్మతిరిగే షాక్!

Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ టుడే నవంబర్ 25 ఎపిసోడ్ లో జ్యోత్స్న, కార్తీక్, దీప కలిసి సూరజ్ ను చంపాలనుకున్నారని మాలిని నిందలు వేస్తుంది. కళ్లు తెరిచిన సూరజ్ ఫస్ట్ జ్యోత్స్ననే చూడాలనుకోవడంతో మాలిని షాక్ అవుతుంది. శివ నారాయణ ఫ్యామిలీకి అసలు నిజం తెలుస్తుంది.

Published on: Nov 25, 2026, 06:56:44 IST
As Prefered on
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. సూరజ్ కు బుల్లెట్ తగలడానికి కారణం జ్యోత్స్ననే అని మాలిని కొత్త నాటకం స్టార్ట్ చేస్తుంది. నేను ఊర్లో లేని టైమ్ లో నా కొడుక్కి ఫోన్ చేసి మాట్లాడటానికి రప్పించింది. అక్కడే వాడిని చంపేయడానికి ఈ ముగ్గురు ప్లాన్ చేశారని మాలిని నిందలు వేస్తుంది.

కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఎపిసోడ్ (jiohotstar)
కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఎపిసోడ్ (jiohotstar)

దీప సీరియస్

కథ నీకు నచ్చినట్లుగా రాసుకోకు అత్త. వెనుక తెలీదు, ముందు తెలీదు కానీ మాట్లాడుతున్నావని మాలినిపై దీప సీరియస్ అవుతుంది. జ్యోత్స్నను ఎవరో షూట్ చేయాలని చూస్తే సూరజ్ కాపాడాడు. బుల్లెట్ వాడికి తగిలింది. షూట్ చేసిన వాడు పారిపోయాడు. సూరజ్ ను జ్యోత్స్న హాస్పిటల్ కు తీసుకొచ్చిందని కార్తీక్ చెప్తాడు.

మాలిని డ్రామా

కానీ మాలిని మాత్రం డ్రామా కంటిన్యూ చేస్తుంది. చూశారా మామయ్య మీ మనవరాలు నా మనవడిని చంపాలనుకుంది. ఇది ఫోన్ చేయకపోయుంటే నా కొడుకు బయటకు వచ్చేవాడు కాదు, బుల్లెట్ తగిలేది కాదని మాలిని మొసలి కన్నీరు కారుస్తుంది. మా మీద ఎందుకు పగ పట్టావని జ్యోత్స్నను మాలిని అడుగుతుంది.

కార్తీక్ ఆవేశం

ఇప్పుడు వచ్చి పెడబొబ్బలు పెట్టడం కాదు. రాత్రి వచ్చి ఉంటే బాధ, భయం తెలిసేవి. రక్తం మడుగులో ఉన్న సూరజ్ ను జ్యోత్స్నే హాస్పిటల్ కు తీసుకొచ్చింది. అరగంటలో ఆపరేషన్ చేయకపోతే మనిషి బతకడం కష్టమన్నారు. బ్లడ్ కావాలన్నారు. ఫోన్ల మీద ఫోన్లు చేశాం. ఆ తర్వాత వచ్చిన డోనర్ రూ.25 లక్షలు డిమాండ్ చేశాడు. అప్పుడు మా బీపీ చెక్ చేసి ఉంటే మిషన్లు పగిలిపోయేవని కార్తీక్ ఆవేశంగా చెప్తాడు.

జ్యోత్స్న ప్రేమ

నువ్వంటే కన్నదానివి కాబట్టి కొడుకు కోసం ఏడవడంలో అర్థముంది. కానీ జ్యోత్స్నకు ఏం సంబంధం? రాత్రి నుంచి ఏడుస్తూనే ఉంది. నీ కొడుక్కి జ్యోత్స్నకు ఏ బంధం లేకపోవచ్చు. కానీ నీ కంటే ఎక్కువగా సూరజ్ ను జ్యోత్స్న ప్రేమిస్తుందని కార్తీక్ చెప్తాడు. నా కొడుక్కి జ్యోత్స్న ప్రేమ అక్కర్లేదు. ముందుకు మీరు వెళ్లిపోండని మాలిని అరుస్తుంది. సూరజ్ కళ్లు తెరిచేంత వరకూ ఎక్కడికి వెళ్లనని జ్యోత్స్న చెప్తుంది.

నా కొడుక్కి బుల్లెట్ తగిలింది నీ వల్లేనని జ్యోత్స్నను మాలిని అంటూనే ఉంటుంది. జ్యోత్స్నను తీసుకొని కార్తీక్, దీప అక్కడి నుంచి వెళ్లిపోతారు.

జ్యోత్స్నను చంపాలనుకున్నారు

ఇటు కాంచన ఇంట్లో అందరూ కంగారు పడుతుంటాడు. జ్యోత్స్న చేతికి ఉన్న సూరజ్ రక్తపు మరకలు చూసి దశరథ కోప్పడతాడు. జ్యోత్స్నకు అన్యాయం చేశాడు కాబట్టి సూరజ్ పాపం పండిందని మాట్లాతారు. జ్యోత్స్నను చంపడానికి వచ్చారు. సూరజ్ అడ్డుపడితే బుల్లెట్ తగిలింది. సూరజ్ అడ్డుపడకపోతే ఆ బుల్లెట్ జ్యోత్స్నకు తగిలేదని కార్తీక్ అసలు విషయం చెప్తాడు.

సూరజ్ చావుబతుకుల్లో ఉన్నాడు. 12 గంటలు గడిస్తేనే కానీ ఏం చెప్పలేమన్నారు. అక్కడ సూరజ్ కళ్లు తెరిస్తేనే కానీ జ్యోత్స్న మామూలు మనిషి కాదని కార్తీక్ చెప్తాడు. తన మనవరాలిని కాపాడిన సూరజ్ ను చూడటానికి వెళ్దామని శివ నారాయణ అంటాడు.

కళ్లు తెరిచిన సూరజ్

ఇక హాస్పిటల్ బయట బాడీగార్డు విజయ్ పై మాలిని ఫైర్ అవుతుంది. ఏం జరిగిందో నాకు అర్థమైంది. నా కొడుకు కళ్లు తెరకపోతే నిన్ను ఇక్కడే చంపేస్తా. షూట్ చేసినవాణ్ని వెతికి మరీ చంపేస్తానని మాలిని వార్నింగ్ ఇవ్వడంతో విజయ్ వణికిపోతాడు. హాస్పిటల్ లోపల సూరజ్ కళ్లు తెరుస్తాడు. వెంటనే మాలిని, దశరథ లోపలికి వెళ్తారు.

జ్యోత్స్నను అడిగిన సూరజ్

జ్యోత్స్న కాల్ చేస్తే నాకు చెప్పాలి కదా. ఎందుకు వెళ్లావని మాలిని అడుగుతుంది. కానీ సూరజ్ మాత్రం జ్యోత్స్న రాలేదా అని అడుగుతాడు. తనకేం కాలేదు కదా. ఒకసారి జ్యోత్స్నను రమ్మనమ్మా అని సూరజ్ అడుగుతాడు. డాక్టర్ కూడా అదే విషయం చెప్తాడు. జ్యోత్స్న మీద సూరజ్ ప్రేమ చూసి మాలిని మైండ్ బ్లాక్ అవుతుంది.

మాలిని రచ్చ

అప్పుడే జ్యోత్స్న సహా అందరూ వస్తారు. వాడు కళ్లు తెరవగానే మొదట నీ గురించే అడిగాడని జ్యోత్స్నతో దక్షిణామూర్తి అంటాడు. మీరందరూ రావాల్సిన అవసరం లేదని శివ నారాయణ ఫ్యామిలీని చూసి మాలిని కోపంగా అంటుంది. నా మనవరాలిని కాపాడి గాయపడిన సూరజ్ ను చూద్దామని వచ్చామని శివ నారాయణ చెప్తాడు. సూరజ్ త్వరగా కోలుకోవాలని దేవుడిని కోరుకుంటాడు.

జ్యోత్స్నను చూసి సూరజ్ రిలీఫ్ గా ఫీల్ అవుతాడు. బాగానే ఉన్నానని చెప్తాడు. బయటకు వెళ్లాక మాలిని మళ్లీ రచ్చ చేస్తుంది. నా కొడుకు ఈ పరిస్థితిలో ఉండటానికి కారణమే మీ మనవరాలు. జ్యోత్స్న రమ్మంటేనే వాడు బయటకు వచ్చాడని మాలిని అంటుంది. మీ పెంపకం ఏంటో నాకు అర్థం కావడం లేదని సుమిత్రతో మాట్లాడుతుంది మాలిని.

లెక్క తేలాలని

నీ కొడుకు ఎందుకు వచ్చాడో అడుగు అని సుమిత్ర రివర్స్ లో కౌంటర్ వేస్తుంది. సూరజ్ ను చూశాం కదా ఇక వెళ్లిపోదామని కార్తీక్ అంటాడు. జ్యోత్స్న డబ్బు ఇచ్చిందంటా కదా. ఆ లెక్క తేలాలని మాలిని ఆపుతుంది. నువ్వు రూ.2 కోట్లు ఇచ్చావ్ కదా. ఆ డబ్బులో నుంచే సూరజ్ కోసం ఖర్చు పెట్టాం. ఈ విషయం మా తాతకు తెలియదని మాలినికి కార్తీక్ చెప్తాడు.

జ్యోత్స్న కాపాడిన ప్రాణం

నువ్వు జ్యోత్స్న క్యారెక్టర్ ను బ్యాడ్ చేయడానికి ఇచ్చిన డబ్బు నీ కొడుకును కాపాడేందుకు ఉపయోగపడింది. జ్యోత్స్నపై సూరజ్ కు ఉన్న ప్రేమ నీకు అర్థమై ఉండాలే. లేదంటే కళ్లు తెరవగానే కన్నతల్లిని ముందు పెట్టుకొని జ్యోత్స్నను అడగడం ఏంటీ అని మాలినితో కార్తీక్ అంటాడు.

ఆ డబ్బు నా దగ్గరే ఉంటుంది అత్త. ప్రతి రూపాయికి లెక్క రాస్తా. నువ్వే నా అకౌంట్లో వేయించావ్. ఏం చేస్తావో చేసుకో. నేను సూరజ్ ను చూడటానికి వెళ్తున్నా. అది నేను కాపాడిన ప్రాణం కాబట్టే నాకే సొంతం అని మాలినికి దిమ్మతిరిగే షాకిస్తుంది జ్యోత్స్న. ఇక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

ABOUT THE AUTHOR

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.