Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. ఎక్కడ తన పేరు బయటపడుతుందోనని వణికిపోయిన మాలిని తన మేనేజర్ వంశీని కొట్టి బయటకు నెట్టేయిస్తుంది. బయట మేనేజర్ తో కార్తీక్ మాట్లాడతాడు. తానేం తప్పు చేయలేదని కార్తీక్ కాళ్లపై వంశీ పడతాడు.
ఎవరు చేశారో తెలుసు

నాకు అంతా తెలుసు. కానీ పాములు పట్టేవాడు పాము కాటుకే బలైనట్లు మోసం చేసినోడు మోసం చేతిలోనే బలైపోతాడు. ఎవరు చేశారో, ఎందుకు చేశారో తెలుసు. అందుకే నిజాయితీగా బతకాలి. చివరకు మంచే గెలుస్తుంది. మీరందరూ కలిసి దేవుడి లాంటి మా తాతను మోసం చేశారు. అందరికీ ఇలాంటి గతే పడుతుందని వంశీని కార్తీక్ గెంటేస్తాడు.
తోడేలు మాలిని
లోపలికి వెళ్లి మాలినికి కార్తీక్ సెటైర్లు వేస్తాడు. నేచర్ లో ఎప్పుడూ అమాయక జంతువులే బలి అయిపోతాయి. ఓ తోడేలు ఒకరిపై నింద వేయాలనుకుంది. కానీ లాస్ట్ మినిట్ లో తోడేలును నమ్ముకున్న కుందేలు బలైపోయిందని మాలిని చేసిన తప్పును కార్తీక్ ఇండైరెక్ట్ గా చెప్తాడు. దీప కూడా ఇదే మాట అంటుంది. ఇది చేతికి మట్టి అట్టించుకోకుండా తప్పించుకున్న పెద్ద మనిషి కథ అని కార్తీక్ అంటాడు.
డైనోసర్ వేట
నాకో బ్యాడ్ హ్యాబిట్ ఉంది. నేను చేసే తప్పులకు నేను బాధ్యురాలిగా ఉండను. ఆధారాలు కూడా ఉండవు. మీరందరూ పిల్లలు. నా మంచితనమే అవతలివాళ్లకు శ్రీరామ రక్ష. నాకు సహనం నశిస్తే డైనోసర్ వేటకు దిగినట్లే ఉంటుంది. మీరు పక్కకు వెళ్లి ఆడుకోండి. లేదంటే నాతో చేతులు కలపండని కార్తీక్, దీపకు మాలిని ఆఫర్ ఇస్తుంది.
అంతం కాలం చేతిలోనే
నువ్వు వేటాడుకుంటూ వెళ్లిపో పిన్ని. కానీ దాని అంతం కాలం చేతిలోనే ఉంటుందని గుర్తు పెట్టుకో. నువ్వు చేసే తప్పులకు మేనేజర్ లాంటి వాళ్లు బలైపోతున్నారు. నువ్వే తప్పు చేశావని చెప్పే అవకాశం నువ్వు రానివ్వవు కూడా. కానీ ప్రతిసారి ఇలా జరగదు పిన్ని అని కార్తీక్ గట్టిగానే చెప్తాడు. ఆల్ ది బెస్ట్ అని చెప్పి మాలిని వెళ్లిపోతుంది.
దీపను బ్లేమ్ చేశారు
{{/usCountry}}నువ్వు వేటాడుకుంటూ వెళ్లిపో పిన్ని. కానీ దాని అంతం కాలం చేతిలోనే ఉంటుందని గుర్తు పెట్టుకో. నువ్వు చేసే తప్పులకు మేనేజర్ లాంటి వాళ్లు బలైపోతున్నారు. నువ్వే తప్పు చేశావని చెప్పే అవకాశం నువ్వు రానివ్వవు కూడా. కానీ ప్రతిసారి ఇలా జరగదు పిన్ని అని కార్తీక్ గట్టిగానే చెప్తాడు. ఆల్ ది బెస్ట్ అని చెప్పి మాలిని వెళ్లిపోతుంది.
దీపను బ్లేమ్ చేశారు
{{/usCountry}}లోపల సూరజ్ తో జ్యోత్స్న మాట్లాడుతుంది. తప్పు చేసింది మేనేజర్ అని తేలింది. కానీ నువ్వు, మీ అమ్మ దీపను బ్లేమ్ చేశారు. మేనేజర్ తో ఎవరో తప్పు చేయించి ఉండొచ్చు కదా అని జ్యోత్స్న అడుగుతుంది. ఆ అవసరం దీప, కార్తీక్ కు మాత్రమే ఉంటుంది. మేనేజర్ తప్పు చేయకుండా చూసుకోవాల్సింది వాళ్లేనని సూరజ్ అర్థం లేకుండా మాట్లాడతాడు.
తప్పు నా భార్యదే
అప్పుడే లోపలికి వచ్చిన మాలిని సూరజ్ ను మెచ్చుకుంటూ మాట్లాడుతుంది. ఏ తప్పు చేయని దీపను తప్పు పట్టకండని జ్యోత్స్న అంటుంది. కానీ దీపదే తప్పని సూరజ్ గట్టిగా చెప్తాడు. అవును, తప్పు నా భార్యదే. అయినా నమ్మి మోసపోవడం కొత్తేమీ కాదు. గతంలోనూ ఇలా జరిగాయని సూరజ్ చేసిన మోసాన్నికార్తీక్ ఇండైరెక్ట్ గా ప్రస్తావిస్తాడు.
మరోసారి మరో తప్పు జరుగుతుంది. అప్పుడూ ఇలాగే ఉంటారు. ఇది కూడా మీకు కొత్తేం కాదని మాలిని అంటుంది. మరోసారి మా వల్ల తప్పు జరిగితే సమర్థించుకోమని కార్తీక్ కౌంటర్ ఇస్తాడు.
సుమిత్ర ఎమోషనల్
ఇటు దశరథ, సుమిత్ర మాట్లాడుకుంటారు. వంట మనిషిగా చేయడం అవసరమా? అని దశరథ, ట్యూషన్ మాస్టారుగా చెప్పడం అవసరమా? అని ఒకరినొకరు ప్రశ్నించుకుంటారు. మనం మంచి జీవితం చూశాం. ఇప్పుడు కష్టపడటంలో తప్పు లేదు. మొదటి రాత్రి గదిలో పాలు చెరి సగం తాగమని ఎందుకు చెప్తారో తెలుసా.. అన్నీ చెరి సగం చేసుకోమ్మని. మీరు, నేను ఒకటేనండి అని సుమిత్ర ఎమోషనల్ అవుతుంది. ఈ విషయాలు మామయ్యకు చెప్పొద్దని సుమిత్ర అడిగితే.. దశరథ సరేనంటాడు.
జ్యోత్స్న భోజనం
ఆఫీసులో దీప, కార్తీక్ లంచ్ చేస్తుంటారు. జ్యోత్స్న ఓపెన్ చేసిన క్యారేజీ తనది అనుకుని సూరజ్ వచ్చి తింటాడు. జ్యోత్స్న భోజనం తింటున్నాడని కార్తీక్ తో దీప చెప్తుంది. చేతులు కడుక్కొని వచ్చిన జ్యోత్స్న తన క్యారేజీ సూరజ్ తినడం చూసి షాక్ అవుతుంది. సూరజ్ పక్కన కూర్చుని జ్యోత్స్న భోజనం వడ్డించుకుంటుంది. తన క్యారేజీ తింటుందని సూరజ్, తన భోజనం వడ్డించుకుంటున్నాడని జ్యోత్స్న అనుకొని మాట్లాడుకుంటారు.
జ్యోత్స్నతో కలిసి నువ్వేందుకు తినాలని సూరజ్ ను మాలిని అడుగుతుంది. జ్యోత్స్న తెచ్చిన క్యారేజీ తింటున్నానని తెలిసి సూరజ్ కంగుతింటాడు. నువ్వు ఎప్పుడైనా వంట చేస్తే సూరజ్ కు అమ్మ చేతి రుచి తెలిసేదత్తా అని మాలినికి దీప కౌంటర్ వేస్తుంది.
జ్యో సెటైర్
జ్యోత్స్న తెచ్చిన క్యారేజీని తినడం తనకు నచ్చలేదని సూరజ్ అంటాడు. అయితే రేపు మీ క్యారేజీ తింటానని జ్యోత్స్న సోల్యూషన్ చెప్తుంది. ఇదో సోల్యూషనా అని సూరజ్ మండిపడతాడు. ఇద్దరు మళ్లీ మాటలతోనే పోట్లాడుకుంటారు. ఒకరి విషయంలో ఒకరు రెస్సాన్సిబిలిటీ తీసుకోద్దని అనుకుంటారు. కర్రీ ఎలా ఉంది సార్ అని సెటైర్ వేసి మరీ జ్యోత్స్న వెళ్లిపోతుంది. ఇక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.