...
...
Next Story

Karthika Deepam 2 Today Episode:కార్తీక దీపం 2-జ్యోత్స్న ఎక్కడా-కార్తీక్ ఉగ్రరూపం-అమ్మను ఒట్టు వేయమన్న సూరజ్-మాలిని షాక్

Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ టుడే అక్టోబర్ 13 ఎపిసోడ్ లో స్టోరీ సస్పెన్స్ తో సాగుతుంది. జ్యోత్స్న కనిపించకపోవడంతో సూరజ్ కాలర్ పట్టుకొని కార్తీక్ ఆవేశంతో ఊగిపోతాడు. జ్యోత్స్న గురించి ఒట్టు వేయమని సూరజ్ అడిగితే మాలిని వేయదు. శివ నారాయణ పట్టరాని కోపంతో ఊగిపోతాడు.

Published on: Oct 13, 2026, 07:15:05 IST
Advertisement

Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. జ్యోత్స్నను ఆఫీసుకు రానివ్వనని సూరజ్ చెప్పాడు. ఎక్కడికి వెళ్లాడో, ఎవరిని కలిశాడో మాత్రం ఇంతవరకూ చెప్పలేదని మాలిని తనలో తాను అనుకుంటుంది. అప్పుడే వచ్చిన దక్షిణామూర్తి.. మాలినితో ఆఫీసుకు వస్తానంటాడు.

ఆఫీసుకు దక్షిణామూర్తి

కార్తీక దీపం 2 టుడే  ఎపిసోడ్ (jiohotstar)
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)

నా మనవరాలు జ్యోత్స్న ఫస్ట్ డే ఆఫీసుకు రాబోతుంది. తనను విష్ చేస్తా. స్వీట్స్ కూడా పంచుతానని దక్షిణామూర్తి చెప్తాడు. సూరజ్ తాతయ్య చెప్పింది విన్నావా? అని మాలిని వెటకారంగా అంటుంది. తనకు తలనొప్పిగా ఉంది, ఆఫీసుకు రానని చెప్పి మాలిని ఇంట్లోనే ఉండిపోతుంది. సూరజ్ వెళ్తూ వెళ్తూ మాలినిని అనుమానంగా చూస్తాడు.

ధైర్యం చెప్పిన కార్తీక్

మరోవైపు కార్తీక్, దీప ఆఫీసుకు రెడీ అవుతారు. జ్యోత్స్న కోసం అమ్మ ఏడుస్తుందని దీప చెప్తుంది. మనకు సూరజ్, మాలిని మీద అనుమానం ఉంది. ఈ రోజు క్లారిటీ వస్తుంది. జ్యోత్స్న ఎక్కడికి వెళ్లిందో తెలుస్తుందని దీపకు కార్తీక్ చెప్తాడు. ఒంటరిగా ప్రపంచాన్ని చుట్టిరాగల ధైర్యవంతురాలు జ్యోత్స్న. తన గురించి భయపడాల్సిన అవసరం లేదని సుమిత్రకు కార్తీక్ ధైర్యం చెప్తాడు.

ఈ రోజు జ్యోత్స్న కచ్చితంగా వస్తుంది. తను డ్యూటీలో జాయిన్ కావాలి కదా అని దీప మళ్లీ నోరు జారుతుంది. కార్తీక్ ఏదో చెప్పి కవర్ చేస్తాడు. జ్యోత్స్న నిజంగానే వస్తుంది మామయ్య అని కార్తీక్ చెప్తాడు. జ్యోత్స్న జాబ్ చేసే దగ్గరకు వెళ్లి తీసుకొస్తామని దీపను స్కూటీపై ఎక్కించుకొని కార్తీక్ వెళ్లిపోతాడు.

జ్యోత్స్న వచ్చిందా?

సూరజ్ దగ్గరకు వెళ్లి కాలర్ పట్టుకొని జ్యోత్స్నను ఏం చేశారో చెప్పరా అని కార్తీక్ కోప్పడతాడు. అప్పుడే వచ్చిన దక్షిణామూర్తి కాలర్ విడిపిస్తాడు. జ్యోత్స్న ఇంటికి రాలేదు. ఆ మనిషిని చూసి మూడు రోజులు అవుతుందని కార్తీక్ చెప్పగానే సూరజ్, దక్షిణామూర్తి షాక్ అవుతారు. ఆఫీసుకైనా వస్తుందని ఆశపడ్డాం. కానీ ఇక్కడికి కూడా రాలేదు. మాలిని పిన్ని మాకు వార్నింగ్ ఇచ్చిందని కార్తీక్ అంటాడు.

జ్యోత్స్నకు ఏమైందో తెలియకపోతే వెళ్లి మీ అమ్మను అడుగు. జ్యోత్స్న కోసం మా అత్త ఏడుస్తుంది. ఆమెకు నేను ఏం సమాధానం చెప్పాలిరా. నేను ఇంటికి వెళ్తున్నా. జ్యోత్స్న ఇంటికి రావాలి. లేదంటే నేను చేసే విధ్వంసాన్ని ఊహించలేవు. ఒకవేళ నువ్వే మీ అమ్మ మాట విని జ్యోత్స్నను దాచి ఉంటే వదిలేయ్. నీ మంచికోరి చెప్తున్నానని కార్తీక్ సీరియస్ వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతాడు.

దిగులుతో సుమిత్ర

మరోవైపు టిఫిన్ బండి దగ్గర సుమిత్ర దిగులుతో ఉంటుంది. జ్యోత్స్న కనిపించకుండా పోయి ఇది మూడో రోజు. ఇంకా రాకపోవడంతో ధైర్యంగా ఉండలేకపోతున్న మామయ్య అని సుమిత్ర ఫీల్ అవుతుంది. టిఫిన్లు అయిపోయాయి కదా అని అందరూ ఇంటికి వెళ్లి జ్యోత్స్న కోసం వెయిట్ చేస్తుంటారు. అప్పుడే కార్తీక్, దీప వస్తారు.

మాలిని మీదే అనుమానం

కార్తీక్ ను జ్యోత్స్న ఎక్కడ అని సుమిత్ర అడుగుతుంది. అమ్మా జ్యోత్స్న లోపలికి రా సుమిత్ర పిలుస్తుంది. జ్యోత్స్న రాలేదు అత్త అని కార్తీక్ చెప్పగానే సుమిత్ర గుండె ముక్కలవుతుంది. సూరజ్ గురించి అడిగితే తెలీదన్నాడు. మాలిని పిన్ని మీదే కాస్త అనుమానంగా ఉందని కార్తీక్ అంటాడు. జ్యోత్స్న జాబ్ చేస్తుంది వేరే చోట కదా అని శివ నారాయణ అడుగుతాడు.

జ్యోత్స్న జాబ్ చేస్తుంది మాలిని ఆఫీసులోనే. సూరజ్ కు పీఏగా జ్యోత్స్న చేరిందని కార్తీక్ చెప్పగానే అందరికీ మైండ్ బ్లాక్ అవుతుంది. ఈ మాట ముందే ఎందుకు చెప్పలేదని కార్తీక్ ను దశరథ చెంపపై కొడతాడు.

ఒట్టు వేయమ్మా

మరోవైపు కోపంతో ఊగిపోతూ సూరజ్ ఇంటికి వెళ్తాడు. జ్యోత్స్న ఎక్కడుంది, ఏం చేశావని అడుగుతాడు. మన ఆఫీసులో జ్యోత్స్న పీఏగా జాయిన్ అయిన రోజు నుంచే కనిపించడం లేదు. నేను జ్యోత్స్నను లవ్ చేస్తానేమోననే అనుమానం నీకు ఉంది. అందుకే జాబ్ తీయించేశావని సూరజ్ అంటాడు. జ్యోత్స్న కనిపించకుండా పోయి మూడు రోజులు అవుతుందంటా, తెలిస్తే చెప్పమ్మా అని దక్షిణామూర్తి కూడా అడుగుతాడు. సూరజ్ తన మీద ఒట్టు వేసి మాలినిని చెప్పమంటాడు.

శివ నారాయణ ఆగ్రహం

ఇటు దశరథ కోపం కట్టలు తెంచుకుంటుంది. కార్తీక్, దీపపై మండిపడతాడు. జ్యోత్స్న కావాలనే ఇంటర్వ్యూకు వచ్చింది. దక్షిణామూర్తి రికమండేషన్ తో ఆఫీసులో అడుగుపెట్టింది. ఈ విషయం మీకు చెప్పొద్దని జ్యోత్స్న మాకు చెప్పింది. కానీ జ్యోత్స్న రాకపోవడంతో మాకు భయం వేసింది. అప్పుడు చెప్తే మీరు ఇంకా భయపడతారని చెప్పలేదు. జ్యోత్స్నను మాలిని పిన్నే ఏమో చేసిందని కార్తీక్ కంగారుగా చెప్తాడు.

ఈ రోజు ఆ దక్షిణామూర్తి, ఈ శివ నారాయణలలో ఒక్కరే ఉండాలని ఊగిపోతూ శివ నారాయణ మాలిని ఇంటికి బయల్దేరతాడు. భర్త చావుకు ప్రతీకారంగా జ్యోత్స్నను మాలిని చంపలేదు కదా అని కాంచనతో శ్రీధర్ అంటాడు.

తెలియదన్న మాలిని

ఇటు సూరజ్ మీద ఒట్టు వేయను అని మాలిని అంటుంది. మా అనుమానం నిజమేనా? జ్యోత్స్న కనిపించకుండా పోవడానికి కారణం నువ్వేనా? అని దక్షిణామూర్తి అడుగుతాడు. అప్పుడే వచ్చిన శివ నారాయణ గట్టిగా అరుస్తాడు. నా కూతురు ఎక్కడుందని మాలినిని సుమిత్ర, దశరథ అడుగుతారు.

మీ కూతురు ఏమైందో తనకు తెలియదని మాలిని చెప్తుంది. ఇక్కడితో కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks