...
...
Next Story

Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2-జ్యోత్స్నకు యాక్సిడెంట్, స్పాట్ డెడ్? చీరను చూసి భయంతో వణికిపోయిన సూరజ్

Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ టుడే అక్టోబర్ 15 ఎపిసోడ్ ఉత్కంఠగా సాగుతుంది. మాలినిని అరెస్టు చేయడానికి వచ్చిన పోలీసులను సూరజ్ లాజిక్ తో కొడతాడు. దక్షిణామూర్తి వెళ్లి కాంచన ఇంటి ముందు కూర్చుంటాడు. యాక్సిడెంట్ లో అమ్మాయి స్పాట్ డెడ్ అని సూరజ్ కు ఎస్ఐ కాల్ చేస్తాడు.

Published on: Oct 15, 2026, 06:54:31 IST
Advertisement

Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. జ్యోత్స్నను కిడ్నాప్ చేశారని మాలినిపై సుమిత్ర కేసు పెట్టడంతో పోలీసులు వస్తారు. అందుకు సాక్ష్యం ఏమైనా ఉందా అని పోలీసులను సూరజ్ అడుగుతాడు. జ్యోత్స్న కనిపించకుండా పోవడానికి కారణం మా శివ నారాయణ తాత అని సూరజ్ ట్విస్ట్ ఇస్తాడు.

సూరజ్ లాజిక్

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)

శివ నారాయణను అరెస్టు చేయండి. నోటి మాట చెప్తే సరిపోదు. సాక్ష్యం కావాలి. జ్యోత్స్న మా అన్నయ్య కార్తీక్ కు కాల్ చేసిందని అందరికీ తెలుసు. దాన్ని బట్టి జ్యోత్స్నను ఎవరు దాచిపెట్టారో అర్థమవుతుందని సూరజ్ లాజిక్ మాట్లాడతాడు. జ్యోత్స్న గురించి నీకు తెలియదని నేనేలా నమ్మలాని సూరజ్ ను పోలీస్ అడుగుతాడు.

మాలినికి షాక్

లాస్ట్ 2 డేస్ నుంచి తన నంబర్ కు కాల్ చేస్తూనే ఉన్నా. వాయిస్ మెసేజ్ కూడా పెట్టా. దేనికీ రిప్లే లేదు. తన గురించి నాకు తెలిసి ఉంటే ఎందుకు కాల్ చేస్తానని సూరజ్ అనడంతో మాలిని ఫ్యూజులు ఔట్ అవుతాయి. నువ్వు జ్యోత్స్నకు కాల్ చేశావా? అని సూరజ్ ను మాలిని అడుగుతుంది. అవునమ్మా చేశా. టిఫిన్ బండి దగ్గరకు కూడా జ్యోత్స్న కనపడుతుందేమోనని వచ్చానని చెప్పి తల్లికి సూరజ్ మరో షాక్ ఇస్తాడు.

పోలీసులపై కేసు పెడతా

నువ్వు జ్యోత్స్న గురించి ఎందుకు వెతికావని సూరజ్ ను పోలీస్ అడుగుతాడు. పీఏగా జాబ్ మానేయమని చెప్పడానికి అని సూరజ్ చెప్తాడు. వీళ్లు ఇలాగే చెప్తారు ముందు అరెస్టు చేయండని సుమిత్ర చెప్తుంది. ఎలా అరెస్టు చేస్తారత్తా. సాక్ష్యం లేదు. అనుమానంతో పెట్టే కేసులు చెల్లవు. మీకు పోలీసులు తెలిస్తే, మాకు లాయర్లు తెలుసు. ఏ సాక్ష్యం లేకుండా మా అమ్మను అరెస్టు చేశారని పోలీసులపై కేసు పెడతానని సూరజ్ చెప్తాడు.

రాత్రి ఇంటికి వచ్చిన సూరజ్ ను జ్యోత్స్న కనిపించిందా అని దక్షిణామూర్తి అడుగుతాడు. కనిపించలేదని సూరజ్ చెప్తాడు. నింద పోగొట్టుకోవడానికి వెళ్దాం పదా అని సూరజ్ ను తీసుకొని దక్షిణామూర్తి బయటకు వెళ్తాడు. మరోవైపు తన కూతురిని కాపాడమని కార్తీక్ ను రిక్వెస్ట్ చేస్తూ సుమిత్ర ఏడుస్తుంది. అప్పుడే సూరజ్, దక్షిణామూర్తి కాంచన ఇంటికి వెళ్తారు.

జ్యోత్స్నను శివ నారాయణే దాచాడు

తన తండ్రి దక్షిణామూర్తిని బయటే ఆగమని సుమిత్ర అరుస్తుంది. ఇంటి గుమ్మం ముందే కూర్చుంటానని దక్షిణామూర్తి కూర్చుంటాడు. కొడుకును పోగొట్టుకున్నా. కూతురిని దూరం చేసుకున్నా. మనవరాలిని కోల్పోయా. జ్యోత్స్న వచ్చేంతవరకూ నేను, నా మనవడు ఇక్కడే ఉంటాం. జ్యోత్స్న వచ్చి తను కనిపించకుండా పోవడానికి కారణం దక్షిణామూర్తి తాత కాదని చెప్పాలి. జ్యోత్స్న మీ తాత దగ్గరే ఉంది కార్తీక్ అని దక్షిణామూర్తి చెప్తాడు.

సుమిత్ర వేడుకోలు

రేయ్ దక్షిణామూర్తి అబద్ధాలు ఆపరా అని శివ నారాయణ ఫైర్ అవుతాడు. అప్పుడే సూరజ్, కార్తీక్ మాటలు అనుకుంటారు. నీకు జ్యోత్స్న గురించి తెలిస్తే చెప్పు సూరజ్ ప్లీజ్ అని దీప రిక్వెస్ట్ చేస్తుంది. నేను కూడా జ్యో కోసం వెతికాను. నన్ను నమ్మండని సూరజ్ అంటాడు. నిన్ను ఒక్కసారి నమ్మినందుకే మోసపోయాం. నా ఒక్కగానొక్క కూతురిని వదిలేయండి. మీ ఆఫీసులో జాబ్ మానేయమంటా అని సుమిత్ర చేతులు జోడించి వేడుకుంటుంది.

జ్యోత్స్న స్పాట్ డెడ్?

తన కూతురిని వదిలేయడంటూ దక్షిణామూర్తి కాళ్లపై సుమిత్ర పడుతుంది. ఇందుకేనా మీరు వచ్చింది. నేను ఏదీ మర్చిపోనని సూరజ్ కు కార్తీక్ వార్నింగ్ ఇస్తాడు. జ్యోత్స్న గురించి తెలుసుకున్నాకే ఇక్కడి నుంచి వెళ్దామని సూరజ్ కు దక్షిణామూర్తి చెప్తాడు. అప్పుడే సూరజ్ కు ఎస్ఐ కాల్ చేస్తాడు. ఓ యాక్సిడెంట్ అయిందని చెప్తాడు. మీరు వెతుకున్న అమ్మాయి ఆమెనే అనుకుంటా. స్పాట్ డెడ్ అని ఎస్ఐ చెప్పడంతో సూరజ్ కూలబడిపోతాడు.

సూరజ్ మీకు కనబడడు

ఏం జరిగిందో చెప్పమని కార్తీక్ అడుగుతాడు. జ్యోత్స్న చచ్చిపోయిందన్నా నన్ను వెళ్లనివ్వరా? అని సూరజ్ అరుస్తాడు. మీ అమ్మ జ్యోత్స్నను చంపేసిందా అని సూరజ్ కాలర్ ను కార్తీక్ పట్టుకుంటాడు. యాక్సిడెంట్ జరిగిందని, అమ్మాయిని ఐడెంటిఫై చేయడానికి ఎస్ఐ రమ్మన్నాడని సూరజ్ చెప్తాడు. జ్యోత్స్న చనిపోతే ఈ సూరజ్ మీకు కనబడడు అని సూరజ్ వెళ్లిపోతాడు.

కనిపించిన జ్యోత్స్న

మార్చురీకి వెళ్లిన సూరజ్ వణుకుతున్న చేతులతో ఆ డెడ్ బాడీని చూస్తాడు. చీరను చూసి భయపడిపోతాడు. కానీ ఆ డెడ్ బాడీ జ్యోత్స్నది కాకపోవడంతో చెమటలు తుడుచుకుంటూ బయటకు వచ్చేస్తాడు. దీన్ని బట్టి జ్యోత్స్నపై సూరజ్ కు ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుంది. అక్కడే బయట సూరజ్ కు జ్యోత్స్న కనిపిస్తుంది. ఇక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks