Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. ఇన్ని రోజులు ఏమైపోయావ్ జ్యోత్స్న? బయట పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసా? ఎక్కడికి వెళ్లావ్? ఎందుకు వెళ్లావ్? అని జ్యోను అందరూ అడుగుతారు. అసలు ఆఫీస్ కు డైరెక్ట్ గా ఎందుకు వెళ్లావని ప్రశ్నిస్తారు.
చచ్చిపోయానని అనుకున్నారా?

నేను తిరిగొచ్చినందుకు మీకు ఆనందంగా లేదా? అని జ్యోత్స్న తిరిగి ప్రశ్నిస్తుంది. నీకు సంబంధించినంత వరకూ మేమెప్పుడూ ఇంతలా భయపడలేదు. ఎవరో యాక్సిడెంట్లో చనిపోయారని, అది నువ్వే అనుకొని కార్తీక్, దీప మాట్లాడుకుంటుంటే విన్నా. ఆ తర్వాత నా పరిస్థితి ఎలా ఉందో తెలుసా అని సుమిత్ర ఏడ్చేస్తుంది. నేను చచ్చిపోయానని అనుకున్నావా? అని జ్యోత్స్న అంటుంది.
దీప ఉంది కదా మమ్మీ
అదే జరిగితే నేను బతుకుతానా? నా కన్నకూతురు లేదని తెలిస్తే బతుకుతానా? అని సుమిత్ర ఎమోషనల్ అవుతుంది. దీప ఉంది కదా మమ్మీ. అంటే మా ఇద్దరినీ బిడ్డల్లాగే చూసుకుంటున్నావని జ్యోత్స్న షాక్ ఇస్తుంది. నేను ప్రాణం పోసింది నీకే. నీకు ఏమైనా అయితే నేను బతకలేనని సుమిత్ర కన్నీళ్లు పెట్టుకుంటుంది.
మీరు ఎవరిని నిందించినా పర్వాలేదు. కానీ బావను, దీపను మాత్రం ఏం అనకండి. తలనొప్పిగా ఉంది పడుకుంటానని జ్యోత్స్న లోపలికి వెళ్లిపోతుంది. సూరజ్ దగ్గర పీఏగా ఎందుకు చేరావని అడుగుదామని అనుకున్నానని దశరథ చెప్తాడు. ఇక జ్యోత్స్నను మాలిని ఆఫీస్ కు పంపించనని సుమిత్ర చెప్తుంది.
మాలిని కిడ్నాప్ ప్లాన్
మరోవైపు చివరి నిమిషంలో ఎందుకు జ్యోత్స్నను వదిలేయమన్నారు మేడం అని మాలినిని బాడీగార్డు విజయ్ అడుగుతాడు. అంటే జ్యోత్స్నను కిడ్నాప్ చేయించింది మాలిని అని తెలిసింది. కొన్ని సార్లు మనం చేసే పని వల్ల ఫలితం అనుకూలంగా వస్తుందనుకుంటే మనం నష్టపోయినా పర్వాలేదు. కానీ అలా జరగకపోతే ఆలోచన సరైందని కాదని అనుకోవాలి. జ్యోత్స్న కళ్ల ముందు లేకుంటే సూరజ్ మారిపోతాడనుకున్నానని మాలిని అంటుంది.
మనసును చంపాలి
{{/usCountry}}మరోవైపు చివరి నిమిషంలో ఎందుకు జ్యోత్స్నను వదిలేయమన్నారు మేడం అని మాలినిని బాడీగార్డు విజయ్ అడుగుతాడు. అంటే జ్యోత్స్నను కిడ్నాప్ చేయించింది మాలిని అని తెలిసింది. కొన్ని సార్లు మనం చేసే పని వల్ల ఫలితం అనుకూలంగా వస్తుందనుకుంటే మనం నష్టపోయినా పర్వాలేదు. కానీ అలా జరగకపోతే ఆలోచన సరైందని కాదని అనుకోవాలి. జ్యోత్స్న కళ్ల ముందు లేకుంటే సూరజ్ మారిపోతాడనుకున్నానని మాలిని అంటుంది.
మనసును చంపాలి
{{/usCountry}}కానీ జ్యోత్స్న కనిపించని దగ్గరి నుంచి సూరజ్ లో చూసిన మార్పునకు భయం వేసింది. ఒకవేళ జ్యోత్స్న రాకపోతే నా కొడుకు పూర్తిగా జ్యోత్స్న ప్రేమికుడిగా మారిపోతాడేమోనని అనుకున్నా. అందుకే వదిలేశా. జ్యోత్స్న తెలివైంది. ఇదంతా నేనే చేశానని గెస్ చేసింది. కానీ అది సూరజ్ కు చెప్పదు. నా కొడుకును నాకు దూరం చేయాలనుకుంటుంది. ఇప్పుడు నేను చేయాల్సింది మనిషిని చంపడం కాదు. మనసును చంపడమని మాలిని చెప్తుంది.
జ్యోత్స్నకు సూరజ్ పై ఉన్న ప్రేమను చంపాలి. అందుకు నా దగ్గర ప్లాన్ ఉంది. శత్రువు కూతురు కూడా శత్రువే. పగ రక్తాన్ని కళ్లచూడాలనుకుంటుంది కానీ రక్తాన్ని కలుపుకోవాలనుకోదు. జ్యోత్స్న నా శత్రువు కూతూరు. ఎప్పటికీ నా మేనకోడలు కాలేదు. కోడలూ కాదని మాలిని సైకోలా చెప్తుంది.
మామూలు ప్రేమ కాదు
ఇటు కార్తీక్, దీపతో జ్యోత్స్న మాట్లాడుతుంది. నీది మామూలు ప్రేమ కాదు. పిల్లి ఎలుక, పాము ముంగిస లాంటి విరుద్ధ భావాలు కలిగిన ప్రేమ మీది. తన తల్లి కోసం సూరజ్ నిన్ను వదిలేశాడు. నువ్వు సూరజ్ ప్రేమ కోసం కొట్లాడుతావ్. సూరజ్ కూడా అంతే. ఇద్దరి మనసులో ప్రేమ ఉందని జ్యోత్స్నతో కార్తీక్ అంటాడు.
మాలిని అత్త గెలిచింది
నన్ను జాబ్ కు వెళ్లకుండా ఆపాలని మనవాళ్లు అనుకుంటున్నారు. వాళ్లు ఏం మాట్లాడతారో చూద్దాం. కానీ మాలిని అత్త గెలిచింది. నేను సూరజ్ పీఏగా చేరానని మనవాళ్లకు తెలిసింది. మీరు చెప్పేలా మాలిని చేసిందని జ్యోత్స్న అంటుంది. నువ్వు కనిపించకుండా పోవడానికి కారణం మాలినా అని కార్తీక్, దీప అడుగుతారు. మాలిని అత్త చేసే తప్పులకు సూరజ్ ఎప్పుడూ ఓ షాడో మాత్రమే బావ. మాలిని గురించి నిజం తెలిసిన రోజున సూరజ్ మారతాడని జ్యోత్స్నచెప్తుంది.
మాలిని అత్త మాయలో ఉన్నంతకాలం సూరజ్ కు ఏం తెలియదని దీప అంటుంది. మాలిని మాయలో నుంచి సూరజ్ బయటపడితే నువ్వు కోరుకున్న మనిషిగా మారతాడు. కానీ ఇదంతా ఎవరు చేస్తారని కార్తీక్ చెప్తాడు. నేను చేస్తా బావ అని జ్యోత్స్న అనుకుంటుంది. దీంతో మాలిని వర్సెస్ జ్యోత్స్న గేమ్ స్టార్ట్ అయిందని చెప్పొచ్చు.
సూరజ్ క్షమాపణ
నన్ను క్షమించమ్మా అని మాలిని కాళ్ల మీద పడతాడు సూరజ్. నేను తల్లిని అనుమానించానని సూరజ్ అంటాడు. నువ్వు నా కొడుకువి. బిడ్డ నుంచి తల్లి కోరుకునేది క్షమాపణ కాదు నమ్మకం. ఇప్పటివరకూ నేను చేసిందంతా నీ మంచికేనని మాలిని అంటుంది. జ్యోత్స్న విషయంలో నా మాటలతో నిన్ను చాలా ఇబ్బంది పెట్టానని సూరజ్ ఫీల్ అవుతాడు. సూరజ్ ను హగ్ చేసుకొని మాలిని ఎమోషనల్ డ్రామా ఆడుతుంది.
షాకిచ్చిన జ్యోత్స్న
అప్పుడే జ్యోత్స్న లోపలికి రావడం చూసి మాలిని షాక్ అవుతుంది. ఎందుకు వచ్చావని మాలిని అడుగుతుంది. జరిగింది చెప్పడానికి, ఏమత్తా చెప్పమంటావా? అని జ్యోత్స్న అనగానే మాలిని ఫ్యూజులు ఔట్ అవుతాయి. అత్తకు అన్నీ తెలుసు. కానీ తెలియనట్లే ఉంటుంది. కానీ నేను అలా ఉండలేను. నేను ఏదైనా వెంటనే తెలుసుకుంటానని జ్యోత్స్న ట్విస్ట్ ఇస్తుంది.
నా మీద చేయి ఎందుకు ఎత్తావని సూరజ్ ను జ్యోత్స్న అడుగుతుంది. నా మీద నీకు ఏ అధికారం ఉందని చేయి ఎత్తావని జ్యో సూటిగా ప్రశ్నిస్తుంది. నువ్వు సమాధానం చెప్పకపోతే కోపం వచ్చిందని సూరజ్ అంటాడు. నీపై నేను నిందలు వేశానా? నాకు సమాధానం కావాలి. అలాగే మీ కుటుంబానికి సారీ చెప్తున్నానని జ్యోత్స్న అంటుంది. ఇక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.