Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. మాలిని ఇంటికి వెళ్లిన జ్యోత్స్న.. తనను కిడ్నాప్ చేసింది ఎవరో చెప్పేయాలా అని మాలినిని టెన్షన్ పెడుతుంది. సూరజ్ ను పదే పదే మాలిని కొడుకు అని మాట్లాడుతుంది.
నిన్ను ప్రేమించినా

వాడు నా కొడుకే. ఎప్పటికీ అలాగే ఉంటాడు. నిన్ను ప్రేమించినా అని మాలిని ఆగిపోతుంది. పూర్తి చేయత్తా అని జ్యోత్స్న అంటుంది. కొన్ని మాటలు ఎప్పటికీ పూర్తి కావు జ్యోత్స్న అని మాలిని చెప్తుంది. నువ్వేం భవిష్యవాణి చెప్పొద్దు అత్త. అనుకున్నది జరగొచ్చు. భయపడేది జరగొచ్చని జ్యోత్స్న కౌంటర్ ఇస్తుంది.
నిందలు మోస్తున్నామన్నా సూరజ్
జ్యోత్స్న అసలు నువ్వు ఇంట్లో చెప్పి వచ్చావా? నీ కారణంగా మేం నిందలు మోస్తున్నామని సూరజ్ గట్టిగా అడుగుతాడు. ఏ కారణంతో తనపై చేయి ఎత్తావో చెప్పమని జ్యోత్స్న పదే పదే అడుగుతుంది. ఇప్పుడు కాకపోతే నైట్ చెప్పు లేదా రేపు చెప్పు. ఎప్పుడు చెప్పాలనిపిస్తే అప్పుడే చెప్పు. సదా నీ కాల్ కోసం ఎదురు చూసే భవదీయురాలు జ్యోత్స్న అని చెప్పి జ్యో వెళ్లిపోతానంటుంది.
జ్యో అప్పగింతలు
అప్పుడే జ్యోత్స్నను దక్షిణామూర్తి ఆపుతాడు. ఒంటరిగా వెళ్లొద్దు. సూరజ్ ను దించి రమ్మని దక్షిణామూర్తి చెప్తాడు. ఒంటరిగా వచ్చింది తిరిగి వెళ్లలేదా అని మాలిని అంటుంది. దారిలో ఏమైనా అయితే ఆ నింద మనపైనే పడుతుందని సూరజ్ అంటాడు. కానీ అందుకు జ్యోత్స్న ఒప్పుకోదు. తనకెవరీ సాయం అవసరం లేదంటుంది. కానీ సూరజ్ మాత్రం అప్పగింతల కార్యక్రమం పూర్తి చేసి వస్తానంటాడు.
జ్యోత్స్న ఎక్కడ?
అంతా బాగానే ఉంది కానీ జ్యోత్స్న కనిపించని ఈ మూడు రోజులు ఎక్కడున్నట్లు? ఏదో ఒక రోజు తెలుస్తుంది కదా అప్పుడు తేల్చుకుంటానని దక్షిణామూర్తి అనగానే మాలిని ఫ్యూజులు ఔట్ అవుతాయి. జ్యోత్స్న కిడ్నాప్ సీక్రెట్ ను తెలుసుకోవాలని దక్షిణామూర్తి అనుకుంటాడు.
{{/usCountry}}అంతా బాగానే ఉంది కానీ జ్యోత్స్న కనిపించని ఈ మూడు రోజులు ఎక్కడున్నట్లు? ఏదో ఒక రోజు తెలుస్తుంది కదా అప్పుడు తేల్చుకుంటానని దక్షిణామూర్తి అనగానే మాలిని ఫ్యూజులు ఔట్ అవుతాయి. జ్యోత్స్న కిడ్నాప్ సీక్రెట్ ను తెలుసుకోవాలని దక్షిణామూర్తి అనుకుంటాడు.
{{/usCountry}}బయటకు వెళ్లాక సూరజ్ పంపిన వాయిస్ మెసేజ్ లను జ్యోత్స్న వినిపిస్తుంది. నా గురించి గట్టిగానే ఫీల్ అయ్యావ్. నీ మెసేజ్ లకు రిప్లే ఇవ్వకపోతే ఎందుకు కోపం వచ్చింది? అని జ్యోత్స్న అడుగుతుంది. నీకు వదిలేయడం అలవాటే కదా అని జ్యో తెలివిగా మాట్లాడుతుంది. ఇప్పుడు కూడా అదే పని చేస్తానని సూరజ్ చెప్తాడు.
సుమిత్ర టెన్షన్
ఇటు ఇంట్లో జ్యోత్స్న కోసం సుమిత్ర వెతుకుతుంది. జ్యో కనిపించకపోవడంతో మళ్లీ అందరూ టెన్షన్ పడతారు. నాకు ఒకరి మీద డౌట్ ఉందని సూరజ్ కు కార్తీక్ ఫోన్ చేస్తాడు. కాల్ లిఫ్ట్ చేసిన సూరజ్.. జ్యోత్స్న తన దగ్గరే ఉందని చెప్పడంతో అందరూ షాక్ అవుతారు. పంపించిన మీకు తెలీదా అని సూరజ్ అడుగుతాడు. మా బావకు ఏం తెలియదని జ్యోత్స్న చెప్తుంది.
దశరథ కొట్టిన విషయం
దీని బుర్ర సరిగ్గా పని చేస్తుందా లేదా? ఇంత జరిగిన తర్వాత మనకు చెప్పాలి కదా అని సుమిత్ర చిరాకు పడుతుంది. జ్యోత్స్న చెప్పదు అత్త. సూరజ్ దగ్గర పీఏగా చేరిన విషయం కూడా చెప్పలేదు. నన్ను చెప్పొద్దంది. కానీ మామయ్య నాకు అందుకు తగిన సత్కారమే చేశాడని దశరథ తనను కొట్టిన విషయాన్ని కార్తీక్ గుర్తు చేస్తాడు. ఇంత జరిగినా కూడా మాలిని ఇంటికి ఎందుకు వెళ్లిందో వచ్చిన తర్వాత నా కూతురితోనే మాట్లాడతానని సుమిత్ర కోప్పడుతుంది.
మార్చురీలో ఏడ్చావ్ కదా
కారులో సూరజ్ చేయిని జ్యోత్స్న పట్టుకుంటుంది. కానీ సూరజ్ విడిపించుకుంటాడు. నా మనసు నీతోనే ఉంది. నీ మనసు నీతో లేదురా. నేను నిన్ను ఎంత సిన్సియర్ గా ప్రేమించానో, నువ్వు అంతే సిన్సియర్ గా ప్రేమించావని జ్యోత్స్న అంటుంది. అది అబద్ధమని సూరజ్ అంటాడు. మార్చురీలో ఉన్న బాడీ నాదేనని నువ్వు ఏడ్చావా లేదా? ఆ శవం నాది కాదని తెలిశాకే కదా నువ్వు ఊపిరి పీల్చుకున్నావని జ్యోత్స్న చెప్తుంది.
జోకర్ లా కనిపిస్తున్నానా?
అంటే ఆ రోజు నేను చూసింది నిన్నేనా? నీకు జోకర్ లా కనిపిస్తున్నానా? నువ్వు కనిపించకపోవడం నాటకమన్నమాట. నీకు కొంచెమైనా బుద్ధి ఉందా? నువ్వు నా వెనుక తిరుగుతూ నా బాధ చూస్తావా? అని సూరజ్ వరుసగా ప్రశ్నలు అడుగుతాడు. నేను మార్చురీ దగ్గరకు రాలేదు, అక్కడ జరిగింది ఎవరో చెప్పారంటే ఏం చేస్తావని జ్యోత్స్న అంటుంది.
పూచీ నాది కాదు
కాంచన ఇంటికి వెళ్లిన తర్వాత ఇదిగో నీ కూతురు అని సుమిత్ర చేతిలో జ్యోత్స్న చేయి పెడతాడు సూరజ్. ఉదయం అప్పగిస్తే వదిలేశారు. అందుకే మళ్లీ అప్పగిస్తున్నా. జ్యో కనబడకపోతే మేమే ఏదో చేశామని మా ఇంటికి వస్తున్నారు. అత్త నీ కూతురు నా ఇంటికి వచ్చింది. ఎందుకు వచ్చిందో తెలియదు? ఈ సారి జ్యోత్స్న కనిపించకుండా పోతే పూచీ నాది కాదని సూరజ్ చెప్తాడు.
తోడు దొంగల్లా కార్తీక్, సూరజ్
జ్యోత్స్న నా దగ్గర పీఏగా పని చేయాల్సిన అవసరం లేదు. నా చుట్టూ తిరగాల్సిన పని లేదని సూరజ్ చెప్తాడు. ఆ దరిద్రుడు, అదే మీ తాత దక్షిణామూర్తి తన మనవరాలిని తన వైపు తిప్పుకోవడం కోసం జాబ్ ఇచ్చాడని శివ నారాయణ కౌంటర్ ఇస్తాడు. కార్తీక్, నువ్వు తోడు దొంగల్లా మారి నా కుటుంబాన్ని ముంచేశారు. ఇప్పుడు మనవళ్లుగా ఉండే అర్హత లేదని శివ నారాయణ అంటాడు.
అనాథ అని మా ఇంటికి ఎందుకు వచ్చావ్? నీతి, నిజాయితీ నీకు లేదని జ్యోత్స్న అరుస్తుంది. అందరూ సూరజ్ ను టార్గెట్ చేస్తూ మాటలంటారు. నీ కూతురిని నీ దగ్గరే పెట్టుకో అత్త. నీడ కూడా నా మీద పడటానికి వీల్లేదు. అయినా మీరు వదిలేస్తే నాకు సంబంధం లేదు. జరిగే పరిణామాలకు బాధ్యత నాది కాదు. గుడ్ బై అని చెప్పి సూరజ్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.