...
...
Next Story

Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2-సూరజ్ దగ్గరకే వెళ్తా-ఫ్యామిలీకి జ్యోత్స్న షాక్- కార్తీక్, దీపకు ఆఫర్!

Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ టుడే అక్టోబర్ 21 ఎపిసోడ్ లో జ్యోత్స్న ఆఫీసుకు రాదని తాతకు సూరజ్ చెప్తాడు. దక్షిణామూర్తి ఫీల్ అవుతాడు. మాలిని ఆనందపడుతుంది. మరోవైపు జ్యోత్స్నను జాబ్ చేయొద్దని అందరూ చెప్తారు. కానీ జ్యో వినదు. అప్పుడే కార్తీక్, దీపకు ఆఫర్ ఇస్తారు.

Published on: Oct 21, 2026, 07:15:41 IST
Advertisement

Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. జ్యోత్స్నను సుమిత్రకు అప్పగించి సూరజ్ ఇంటికి చేరుకుంటాడు. అప్పగింతలు తాత అందుకే లేట్ అయిందని సూరజ్ చెప్తాడు. తాత అని పిలిస్తే తాట తీస్తానని శివ నారాయణ అన్నాడు. మనమే మారాలి. ఇక జ్యోత్స్నను ఆఫీసుకు, ఇంటికి రావొద్దని అన్నానని సూరజ్ చెప్తాడు.

జ్యోత్స్న వస్తుంది

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)

నా కొడుకు దగ్గర తన మనవరాలిని పీఏగా పని చేయడానికి పంపిస్తారా? అలా అయితే పరువును మన కాళ్ల దగ్గర పెట్టినట్లే అని శివ నారాయణ ఫీల్ అవుతాడని మాలిని అంటుంది. వాడు ఏమైనా ఫీల్ కానీ నా కూతురు, మనవరాలు నా దగ్గరకు రావాలి. జ్యోత్స్న ఆఫీసుకు వస్తుంది. పీఏగా చేస్తుందని దక్షిణామూర్తి అంటాడు.

జ్యోత్స్న రాదు తాత అని సూరజ్ చెప్తాడు. జ్యోత్స్న పీఏగా ఆఫీసులో చేరిన సంగతి వాళ్లకు లేటుగా తెలిసింది. ఇప్పుడు బాబాయి తన మనవరాలిని రానిస్తాడా? సుమిత్ర రానిస్తుందా? దశరథ అన్నయ్య కూతురిని ఇంటి గడప కూడా దాటనివ్వడు. జ్యోత్స్న ఆఫీసుకు రాదు. రానివ్వనని మాలిని అంటుంది.

నీకు కావాల్సింది కూడా ఇదే

నీకు కావాల్సింది కూడా ఇదే కదమ్మా. ఇలా జరగడం నీకు ఇష్టమే కదా. శివ నారాయణకు తెలిసింది. ఇక మనవరాలిని పంపించడు. ఎప్పుడూ నువ్వనుకున్నదే జరుగుతుంది. ఒకసారి నేను అనుకుంది జరిగితే బాగుండని అన్నం తినకుండా మధ్యలోనే దక్షిణామూర్తి వెళ్లిపోతాడు. సమస్యలన్నీ జ్యోత్స్న వల్లే కదా. తాను ఆఫీసుకు రాదు, ఇంటికి రాదని సూరజ్ కూడా తినకుండా వెళ్లిపోతాడు.

జాబ్ కు వెళ్లొద్దు జ్యోత్స్న

నాకు కేవలం మాలిని, దక్షిణామూర్తి, సూరజ్ మాటలు మాత్రమే వినపడుతున్నాయి. నేను చేరిన జాబ్ ను మాలిని తీసేయించింది. వేరే జాబ్ రాకుండా చేస్తానంది. వాళ్లకు భయపడి వదిలేస్తే లూజర్ అవుతా. నేను ఫైటర్ ను. నన్ను ఛాలెంజ్ చేసినవాళ్లకు నేను ఛాలెంజ్ గా మారా. ఏ ఆఫీసు నుంచి మనల్ని గెంటేశారో అక్కడే జాబ్ చేస్తున్నానని జ్యోత్స్న చెప్తుంది.

ఎవరెంత చెప్పినా జ్యోత్స్న వినదు. సూరజ్ దగ్గరే పీఏగా చేస్తానని జ్యోత్స్న మొండిగా వాదిస్తుంది. మన అందరి జీవితాల్లో కష్టాలు వచ్చాయి. కానీ ఎవరూ ఆగిపోలేదని జ్యోత్స్న అందరి గురించి చెప్తుంది. నేను కుటుంబం కోసం నిలబడతానని జ్యోత్స్న అంటుంది. ఆఫీసుకు వెళ్లొద్దని సుమిత్ర, దీప కూడా చెప్తారు.

ఫ్యామిలీ గురించి

నేను అదే ఆఫీసులో సీఈఓగా చేస్తున్నా. కానీ వాళ్లు టార్గెట్ చేసింది నిన్ను అని జ్యోతో దీప అంటుంది. మనల్ని తరిమేస్తామంటే ఎందుకు తలవంచాలి? నువ్వు చెప్పు బావ నేను చేస్తుంది తప్పా? అని కార్తీక్ ను దీప అడుగుతుంది. మనకు మనం సమాధానం చెప్పుకోవాలి. నీకు సపోర్ట్ గానే ఉన్నాం. అందుకే నిందలు మోస్తున్నాం. కానీ నీ విషయంలో అమ్మానాన్న, తాత బాధపడుతుంటే నువ్వు ఆలోచించాల్సిన అవసరం ఉందని కార్తీక్ చెప్తాడు.

కార్తీక్, దీపకు ఆఫర్

మాలిని ఆఫీసులో అడుగుపెట్టడం గెలుపు కాదా? నేను మాలిని ఆఫీసులో సూరజ్ దగ్గర పీఏగా చేస్తానని చెప్పి జ్యోత్స్న లోపలికి వెళ్తుంది. నా కూతురు సూరజ్ దగ్గర పని చేయొద్దు. సూరజ్ విషయంలో మీది ఏ తప్పూ లేదని నేను నమ్ముతా. మీరు జ్యోత్స్నను ఉద్యోగానికి వెళ్లకుండా ఆపగలరా? అని కార్తీక్, దీపను సుమిత్ర అడుగుతుంది. జ్యోత్స్నను ఆపగలిగితే క్షమిస్తామని శివ నారాయణ, దశరథ కూడా కార్తీక్, దీపకు ఆఫర్ ఇస్తారు.

నా భర్త కాదు నేను కూడా నిన్ను నా కూతురే అనుకుంటా. నీ చెల్లెలు జీవితం కోసం కన్నతల్లి బాధపడుతుంటే నువ్వు ఏం చేయకుండా ఉంటావా? జ్యోత్స్న ఆగాలి. అది మీ వల్లే అవుతుందని దీపతో సుమిత్ర అంటుంది.

ఎవరి మాట వినదు

గదిలోకి వెళ్లిన తర్వాత కార్తీక్, దీప మాట్లాడుకుంటారు. జ్యోత్స్న ఉద్యోగానికి, మన నిజాయతీకి ముడిపెట్టారు. జ్యో మొండిది. ఎవరి మాటా వినదు. జ్యోత్స్నను మనం ఆపగలిగితే మన కుటుంబాలు కలుస్తాయి. అమ్మానాన్న నన్ను ప్రేమగా దగ్గరకు తీసుకుంటారని దీప అంటుంది. జ్యోత్స్న తన బాధ చెప్పుకోవడానికి ఎవరూ లేరని కార్తీక్ చెప్తాడు.

జ్యోత్స్న వెళ్లకపోతే తను అనుకున్నది జరగదు. మన అందరి లక్ష్యం మాలినికి బుద్ధి చెప్పడమే. ఈ సూరజ్, జ్యోత్స్న కథను ఇక్కడితో ఆపాలని కార్తీక్ అంటాడు. ఇది మనకు అగ్నిపరీక్ష బావ. ఏం జరుగుతుందో చూద్దాం? ముందు అయితే జ్యోత్స్నను ఆపాలి. నువ్వు చెప్తే వింటుంది బావ. నువ్వే ఆపగలవని దీప చెప్తుంది.

ఉదయం అందరూ హాల్లో ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడే జ్యోత్స్న రెడీ అయి ఆఫీసుకు వెళ్తానంటుంది. ఆటో ఛార్జ్ ల కోసం తాత జేబులో నుంచి రూ.100 తీసుకున్నానని జ్యో చెప్తుంది. ఆఫీసుకు వెళ్లబోతున్న జ్యోత్స్నను కార్తీక్ ఆపుతాడు. ఇక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks