Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2.. జైలుకు వెళ్లాల్సిందే- ఆస్తి ఇచ్చేయ్- మాలినికి షాకిచ్చిన తండ్రీకూతురు!

Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ టుడే అక్టోబర్ 26 ఎపిసోడ్ రసవత్తరంగా సాగుతుంది. కేసు విషయం మాట్లాడేందుకు మాలిని, దక్షిణామూర్తి కలిసి కాంచన ఇంటికి వస్తారు. కేసు వాపసు తీసుకునే ప్రసక్తే లేదని సుమిత్ర చెప్తుంది. ఆస్తి మొత్తాన్ని తిరిగి ఇచ్చేయమని మాలినికి మామ షాకిస్తాడు.

Published on: Oct 26, 2026, 06:56:23 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. శౌర్యకు దశరథ హోం వర్క్ చేయిస్తాడు. నేను నీ దగ్గరే పెరిగి ఉంటే చిన్నప్పుడు ఇలాగే చదువు చెప్పేవాడివి కదా నాన్న. నాకు దక్కనిది నా కూతురికి దక్కిందని దీప మనసులో అనుకుంటుంది.

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)

దశరథ ట్యూషన్

తాత చాలా బాగా చెప్తున్నాడు నాన్న. నాకు ఈజీగా అర్థమవుతుందని కార్తీక్ తో శౌర్య అంటుంది. తాత నువ్వు చాలా బాగా చెప్తున్నావ్. మా స్కూల్లో టీచర్ గా జాయిన్ అయిపో అని దశరథను శౌర్య అడుగుతుంది. నా పని నాకుంది. నిన్ను కలెక్టర్ చేయాలన్నది మీ అమ్మ కల. మా ఆర్థిక పరిస్థితులు బాగోలేక నీకు సాయం చేయలేకపోతున్నామని శౌర్యతో చెప్తూ దశరథ ఫీల్ అవుతాడు.

దీప బాధ

శౌర్య అడగడంతో రోజు ట్యూషన్ చెప్తానని దశరథ అంటాడు. ఇక్కడ ఉండటానికే ఇబ్బందిగా ఉంది. అంతేకానీ పాఠాలు చెప్పడానికి కాదని దశరథ చెప్తాడు. ఆ మాటలు విని దీప బాధపడుతుంది. నాన్న ఎలా మాట్లాడుతున్నారో చూశావా బావ అని కార్తీక్ ను అడుగుతుంది. ఆత్మాభిమానం ఉన్న మనుషులు ఒకరి దగ్గర ఉండటానికి ఇష్టపడరు అని కార్తీక్ చెప్తాడు.

రేయ్ శివ నారాయణ

భోజనాల దగ్గర జ్యోత్స్న హడావుడి చేస్తుంది. కానీ శివ నారాయణ మాత్రం సైలెంట్ గా ఉంటాడు. తన మాట వినకుండా ఆఫీసుకు వెళ్లినందుకు జ్యోత్స్నపై శివ నారాయణ కోపంతో ఉంటాడు. జ్యోత్స్న ఇష్టంతో గోంగూర పచ్చడి చేసిందని తెలిసి, ఆ పచ్చడి కూడా వేసుకోడు. శివ నారాయణ ముద్ద నోట్లో పెట్టుకోబోతుండగా రేయ్ శివ నారాయణ అంటూ దక్షిణామూర్తి వస్తాడు.

సుమిత్ర కౌంటర్

రేయ్ భోజనం కూడా చేయనివ్వవా? ఏం మనుషుల్రా మీరు ఎందుకు వస్తారో తెలియదు. నేను భోజనం చేస్తున్నా. బయట ఉండు. తిన్నాక మాట్లాడతానని శివ నారాయణ అంటాడు. జరిగింది తెలియనట్లు భలే మాట్లాడుతున్నావ్ శివ నారాయణ. ముందు నేను నా మనవరాలితో మాట్లాడతానని దక్షిణామూర్తి అంటాడు. నీ మనవరాలా? అలాంటి వాళ్లు ఇక్కడ ఎవరు లేరు నాన్న అని సుమిత్ర కౌంటర్ ఇస్తుంది.

షాకిచ్చిన జ్యోత్స్న

కానీ జ్యోత్స్న వెళ్లి దక్షిణామూర్తి పక్కన నిలబడి చెప్పు తాత అని అంటుంది. దీంతో అందరూ షాక్ అవుతారు. మనం నమ్మినవాళ్లే మన పరువు తీయడం అలవాటే కదా సుమిత్ర అని శివ నారాయణ చెప్తాడు. పోలీసు కేసు గురించి దక్షిణామూర్తి టాపిక్ తీయగానే శివ నారాయణ షాక్ అవుతాడు. ఆ విషయం నేను చెప్తానని మాలిని ఎంట్రీ ఇస్తుంది.

కేసు నా మీదే

ఈ రోజు ఆఫీసుకు పోలీసులు వచ్చారు. సుమిత్ర నాపై పెట్టిన కేసు విత్ డ్రా చేసుకోలేదు కాబట్టి ఇంకా ఎంక్వైరీ జరుగుతోంది. నాపై అనుమానం ఉందని జ్యోత్స్న చెప్పింది. కేసు పూర్తిగా నాపైనే ఉంది. నేను తప్పు చేయకపోయినా తప్పు చేశానని ఎందుకు చెప్పాలి? ఎవరు జ్యోత్స్నను అలా చెప్పమన్నారో తెలుసుకోవడానికే వచ్చానని మాలిని అంటుంది. మధ్యలో దక్షిణామూర్తి మాట్లాడితే.. గాడిదలా ఎందుకు అరుస్తున్నావని శివ నారాయణ ఫైర్ అవుతాడు.

జ్యోత్స్న ఏమైందమ్మా నీకు? మాలినిపై అనుమానం ఉందని చెప్పడం తప్పు కదా. అనుమానం ఒక్కరి మీదే ఉందని చెప్తే ఎలా? ముగ్గురి మీద ఉందని చెప్పాలి కదా. మాలిని, సూరజ్, దక్షిణామూర్తి అనుమానితులే కదా అని దిమ్మతిరిగేలా శివ నారాయణ కౌంటర్ ఇస్తాడు. జ్యోత్స్నకే కాదు మాకూ అనుమానం ఉందని కార్తీక్ అంటాడు.

కేసు వెనక్కి తీసుకోను

కేసు వెనక్కి తీసుకొమ్మని మాలిని అడుగుతుంది. తప్పు చేసింది కదా దొరికిపోయిందనే బాధ అని దీప సెటైర్ వేస్తుంది. నేను తప్పు చేయడం నువ్వు చూశావా అని మాలిని అడుగుతుంది. తప్పు చేయనప్పుడు ఎందుకు భయం? ఎందుకు వణికిపోవడం? అని దీప మళ్లీ కౌంటర్ వేస్తుంది. మాలినిపై పెట్టిన కేసు వెనక్కి తీసుకోనని సుమిత్ర తేల్చి చెప్తుంది.

సుమిత్ర తీర్పు

జ్యోత్స్న కూడా తన మాట వెనక్కి తీసుకోదు. తప్పు చేసిన వాళ్లు జైలుకు వెళ్తారు. తప్పు చేయలేదంటే ఇంట్లోనే ఉంటుంది. ఇదే నా తీర్పు. ఇక బయల్దేరు అని సుమిత్ర గట్టిగా చెప్తుంది. అప్పుడే చిరిగి ఉన్న సుమిత్ర చీరను చూసి దక్షిణామూర్తి ఫీల్ అవుతాడు. ఏమైందని దశరథ అడుగుతాడు. నలిగిన బట్టలనే కట్టుకోని నా కూతురిని చిరిగిన బట్టలు కట్టుకునే స్థాయికి తీసుకొచ్చావని దశరథను అంటాడు దక్షిణామూర్తి.

దక్షిణామూర్తి కన్నీళ్లు

సుమిత్ర పరిస్థితి చూసి దక్షిణామూర్తి ఏడుస్తాడు. నువ్వు, జ్యోత్స్న నాతో వచ్చేయండని దక్షిణామూర్తి అడుగుతాడు. కానీ రామని చెప్తారు. వీళ్ల దగ్గర తీసుకున్న ఆస్తి మొత్తం వీళ్లకు ఇచ్చేద్దాం మాలిని అని దక్షిణామూర్తి షాక్ ఇస్తాడు. కావాలంటే కేసు నాపై పెట్టమ్మా. నీ కోసం జైలుకు వెళ్తానని దక్షిణామూర్తి ఎమోషనల్ అవుతాడు.

బేరం కుదరదు నాన్న

బేరం కుదిరేటట్లు లేదు నాన్న. తప్పు చేసిన నీ కోడలు ఎక్కడ జైలుకు వెళ్తుందేమోనని కేసు వెనక్కి తీసుకోమని అడిగేందుకు వచ్చావ్. ఆ బేరం కుదరకపోవడంతో కూతురిని ఇంటికి రమ్మంటున్నావ్. అందుకు ఆస్తిని ఎరగా పెట్టావ్. కోడలిని కాపాడుకోవడానికి కూతురిని కొనాలనుకుంటున్నావ్ నాన్న అని సుమిత్ర మాట్లాడుతుంది.

నువ్వు తప్పు చేయకపోతే ఎందుకు భయమని మాలినితో సుమిత్ర, దీప అంటారు. కేసు అలాగే ఉంటుంది, ఇక బయల్దేరమని శివ నారాయణ చెప్తాడు. మాలిని, దక్షిణామూర్తి వెళ్లిపోతారు. శివ నారాయణ ఫ్యామిలీ కలిసి భోజనం చేస్తారు. అప్పుడు జ్యోత్స్నకు సూరజ్ కాల్ చేస్తాడు. ఫోన్ తీసుకొని జ్యోత్స్న గదిలోకి వెళ్తుంది.

ఎందుకురా మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వరు అని సూరజ్ తో జ్యోత్స్న మాట్లాడుతుంది. ఇక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More