Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. క్యాటరింగ్ ఆర్డర్ ఇద్దామని వచ్చిన ఓ రాజకీయ నాయకుడు మాలినిని దారుణంగా అవమానిస్తాడు. ఓ అనాథకు మనవరాలిని ఇచ్చి పెళ్లి చేసిన శివ నారాయణది ఎంత గొప్ప మనసు అని మాలిని ముందే తెగ పొగిడేస్తాడు.
మొగుడు మంచోడిలా

శివ నారాయణ కాలి గోటికి కూడా ఎవరూ సరిపోరు. సింగపూర్ నుంచి నిన్ననే వచ్చా. ఈ ఫంక్షన్ తర్వాత మీ ఇంటికి వస్తానని కార్తీక్ తో ఆ వ్యక్తి చెప్తాడు. ఇక నీ మొగుడు మంచోడిలాగే ఉన్నాడని సూరజ్ గురించి జ్యోత్స్నతో అంటాడు. శివ నారాయణ సెలక్షన్ ఇలాగే ఉంటుందని చెప్పి వెళ్లిపోతాడు.
కార్తీక్ ఎందుకు అడగలేదు?
ఏరా కార్తీక్ అతనికి నిజం ఎందుకు చెప్పలేదని మాలిని అడుగుతుంది. నిజం చెప్పాల్సి వస్తే మొదటి నుంచి చెప్పాలి. అప్పుడు పరువు కూడా పోతుందని కార్తీక్ కౌంటర్ వేస్తాడు. ఈ ఆర్డర్ ను పర్సనల్ గా తీసుకొని డెలివరీ చేయాలని దీపకు కార్తీక్ చెప్తాడు. ఎందుకు నిజం చెప్పలేదని నీ కొడుకును ఎందుకు అడగలేదత్తా. మా ఇద్దరినీ భార్యాభర్తలని అంటున్నా నీ కొడుకు సైలెంట్ గా ఉన్నాడంటే నువ్వు ఆలోచించాల్సిందేనని మాలినితో జ్యోత్స్న అంటుంది.
మాలిని కుట్ర
ఇక మేనేజర్ తో ఆర్డర్ గురించి మాలిని మాట్లాడుతుంది. ప్లేటుకు రూ.300 మిగులుతాయని మాలినితో మేనేజర్ చెప్తాడు. ప్లేటుకు రూ.750 మిగలాలని మాలిని చెప్తుంది. కార్తీక్, దీపకు చెడ్డ పేరు వస్తుందని మేనేజర్ అంటాడు. నాకు కావాల్సింది అదే. లాస్ట్ మినిట్ వరకూ నాసిరకం మెటీరియల్ వాడామని ఎవరికీ తెలియకూడదని మాలిని మరో కుట్రకు తెరతీస్తుంది.
ట్యూషన్ మాస్టారుగా దశరథ
{{/usCountry}}ఇక మేనేజర్ తో ఆర్డర్ గురించి మాలిని మాట్లాడుతుంది. ప్లేటుకు రూ.300 మిగులుతాయని మాలినితో మేనేజర్ చెప్తాడు. ప్లేటుకు రూ.750 మిగలాలని మాలిని చెప్తుంది. కార్తీక్, దీపకు చెడ్డ పేరు వస్తుందని మేనేజర్ అంటాడు. నాకు కావాల్సింది అదే. లాస్ట్ మినిట్ వరకూ నాసిరకం మెటీరియల్ వాడామని ఎవరికీ తెలియకూడదని మాలిని మరో కుట్రకు తెరతీస్తుంది.
ట్యూషన్ మాస్టారుగా దశరథ
{{/usCountry}}ఇటు సుమిత్ర వంటలను ఆ ఇంటి ఓనర్ పార్వతి తెగ పొగిడేస్తుంది. ఆ సమయంలోనే పిల్లలకు ట్యూషన్ చెప్తానంటూ అదే ఇంటికి దశరథ వస్తాడు. సుమిత్ర వంటలను టేస్ట్ చేసిన పార్వతి ఫ్రెండ్ రూ.1000 ఎక్కువ ఇస్తానని తన ఇంటికి రమ్మంటుంది. లేకపోతే తన ఇంట్లోనూ వంట చేయమంటుంది. కానీ సుమిత్ర కుదరదని చెప్తుంది. నాకున్న టైమ్ లో ఈ ఒక్క ఇంట్లోనే పని చేయగలనని సుమిత్ర అంటుంది. రూ.10 వేలు ఇస్తానని చెప్పినా సుమిత్ర నో చెప్తుంది.
ఇక దశరథకు ట్యూషన్ చెప్పినందుకు రూ.10 వేలు ఇస్తానని ఆ ఇంటి ఓనర్ చెప్తాడు. అప్పుడే బయటకు వెళ్తున్న దశరథను చూసి ఆయనేనా అని సుమిత్ర డౌట్ పడుతుంది. కానీ ఆయన ఇక్కడికి ఎందుకు వస్తారని అనుకుంటుంది.
భార్యాభర్తలం కాదని
మరోవైపు భార్యాభర్తలని ఆ పొలిటీషియన్ అన్న మాటలను సూరజ్ గుర్తు చేసుకుంటాడు. అప్పుడే వచ్చిన జ్యోత్స్నను మనం భార్యాభర్తలం కాదని ఎందుకు ఆ వ్యక్తికి చెప్పలేదని అడుగుతాడు. నువ్వెందుకు అడగలేదు? నోట్లో బెల్లం ముక్క పెట్టుకున్నావా? మీరు పర్సనల్ మ్యాటర్స్ మాట్లాడుతున్నారని జ్యోత్స్న అంటుంది.
తాత స్టోరీ రైటర్
స్టోరీ మీకు నచ్చినట్లు రాసుకుంటారు. మీ తాత స్టోరీ రైటర్. మీ బావ ఏమో స్క్రీన్ ప్లే రైటర్. నువ్వేమో డైలాగ్ రైటర్ అని సూరజ్ అంటాడు. నువ్వు ఆర్టిస్టువా? అని జ్యోత్స్న కౌంటర్ వేస్తుంది. ఆయన మాట్లాడుతుంటే మీరు ఎంజాయ్ చేశారని సూరజ్ అంటాడు. ఎవరు ఎంజాయ్ చేసింది? ఆయన మాట్లాడుతుంటే నా ఆగిపోయిన పెళ్లి గుర్తుకు వచ్చింది. నువ్వు విసిరేసింది తాళినే కాదు నా నమ్మకాన్ని కూడా. గాయాలు మోస్తూ బతకడానికి ధైర్యం ఉండాలి. నాకు ఆ ధైర్యం ఉందని జ్యోత్స్న ఫీల్ అవుతుంది.
జ్యోను పట్టుకున్న సూరజ్
మన పెళ్లి అనేది తెల్లవారగానే కరిగిపోయే కల లాంటిది. దాని గురించి మాట్లాడొద్దు. మాట్లాడితే నాకూ నా గాయాలు గుర్తుకువస్తాయి. నా మనసును లాక్ చేసుకున్నానని సూరజ్ అంటాడు. నీ మనసు నీ దగ్గర లేదు. నా మనసు నా దగ్గర లేదు. మన పెళ్లి ఆగిపోయిన విషయాన్ని ఎందుకు చెప్పలేదని జ్యోత్స్న ప్రశ్నిస్తుంది. అతను మళ్లీ వస్తే చెప్తానని సూరజ్ అంటాడు. నువ్వు చెప్పలేవని జ్యో అంటుంది. ఎందుకు చెప్పలేనని జ్యో పైపైకి వెళ్తాడు సూరజ్. పడిపోతున్న జ్యోను పట్టుకుంటాడు.
మన ఇద్దరి మధ్య గీత ఉంది. నేను ఛైర్మన్ ని, నువ్వు పీఏవి. మనం ఆఫీసులో ఉన్నామనే విషయం గుర్తుపెట్టుకుంటే మంచిది జ్యోత్స్న అని సూరజ్ గట్టిగానే చెప్తాడు. కానీ నేను నన్ను వదిలేసుకుంది నీ దగ్గరే. నేను డిస్టర్బ్ అయ్యా. నాకు రెస్ట్ కావాలి. మీ పర్మిషన్ తీసుకొని ఇంటికి వెళ్తున్నానని జ్యోత్స్న వెళ్లిపోతుంది.
దీప సైన్
ఇటు మెటీరియల్ కోసం సైన్ చేయమని దీపకు వంశీ ఫైల్ ఇస్తాడు. మెటీరియల్ కొనడానికి తాను వెళ్తానంటాడు. సూరజ్ ఛైర్మన్ అయిన తర్వాత వచ్చిన ఆర్డర్ ఇది. ఎవరికీ చెడ్డ పేరు రావొద్దని చెప్పి దీప సైన్ చేస్తుంది.
పారు రీ ఎంట్రీ
రోడ్డు మీద నడుచుకుంటూ పారిజాతం రీ ఎంట్రీ ఇస్తుంది. దాసుకు ఆరోగ్యం బాగోలేదన్న వంకతో వెళ్లాను కానీ వాడు కూడా తరిమేశాడు. ఓ పని చేద్దామని రోడ్డు మీద వస్తున్న కారు కింద కావాలనే పారిజాతం పడుతుంది. ఇంటి ఖర్చుల కోసం రూ.లక్ష ఇప్పించమని డ్రామా ఆడుతుంది. ఆ కారులో ఎవరున్నారో చూసి పారు షాక్ అవుతుంది.
మరోవైపు ఇడ్లీ బండి దగ్గర గిన్నెలన్నీ కడుగుతానని దీప అంటుంది. అయితే రోజూ కడగమని శివ నారాయణ పంచ్ వేస్తాడు. అందుకు సరేనని దీప గిన్నెలు కడుగుతుంది. అప్పుడే వచ్చిన జ్యోత్స్న ఆ గిన్నెలను కడుగుతానని అంటుంది. ఇక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.