Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. సూరజ్ పీఏ పోస్టు కోసం జ్యోత్స్నకు తాత దక్షిణామూర్తి సపోర్ట్ గా నిలుస్తాడు. కేఫ్ లో జ్యోత్స్న జాబ్ ఎందుకు తీయించావని దక్షిణామూర్తి అడగడంతో మాలిని షాక్ అవుతుంది.
దక్షిణామూర్తి ట్విస్ట్

జ్యోత్స్న కేఫ్ లో పని చేయడం తనకు ఇష్టం లేదని మాలిని మాట మారుస్తుంది. అది నువ్వు చేసిన మంచి పనే. దానికి నిన్ను మెచ్చుకుంటా. మరి పీఏ పోస్టుకు ఎందుకు రిజెక్ట్ చేశారని దక్షిణామూర్తి అడుగుతాడు. నాకు అంతా తెలుసు. జ్యోత్స్న నన్ను కలిసిందని దక్షిణామూర్తి ట్విస్ట్ ఇస్తాడు. మాలిని వల్ల తన జాబ్ పోయిన విషయం, పీఏగా రిజెక్ట్ అయిన విషయం జ్యోత్స్న చెప్పిన విషయాన్ని దక్షిణామూర్తి చెప్తాడు.
మాలిని కవరింగ్
నేను రిజెక్ట్ చేయడానికి కారణం శివ నారాయణ. పీఏగా పెట్టుకొంటే వచ్చి గొడవ చేస్తాడని ఏదో కవర్ చేసేందుకు మాలిని ట్రై చేస్తుంది. వస్తే రాని, జ్యోత్స్న నాకు కూడా మనవరాలే. జ్యోత్స్నను సూరజ్ పెళ్లి చేసుకుంటే నా కూతురిని ఇంటికి తెచ్చుకోవచ్చని అనుకున్నా. కానీ నీ కొడుకు మనసు మార్చుకొని ఇది జరగకుండా చేశాడని దక్షిణామూర్తి అంటాడు.
దక్షిణామూర్తి ఆర్డర్
నా మనవరాలు నా దగ్గరే పని చేస్తే నాకు బాధేంటీ? జ్యోత్స్న ఇక్కడే ఉంటే మనల్ని బాగా అర్థం చేసుకుంటుంది. అదే జరిగితే మనం గెలిచినట్లే. నేను చెప్పింది చేయ్. నాకు మనవడు ఏంతో మనవరాలూ అంతే. అది అడిగితే పీఏ పోస్టే కాదు ఏ పోస్ట్ అయినా ఇస్తా. వెళ్లి నీ కొడుకును సంతకం పెట్టమను అని చెప్పి దక్షిణామూర్తి వెళ్లిపోతాడు. దీంతో కోపంతో మాలిని రగిలిపోతుంది.
జ్యోత్స్న కౌంటర్
బయట ఏమో మా తాత నీకు సపోర్ట్ చేయడం ఏంటీ అని జ్యోత్స్నను సూరజ్ అడుగుతాడు. అది మీ తాతనే అడగమని జ్యోత్స్న చెప్తుంది. నువ్వు నన్ను రిజెక్ట్ చేశావ్. అదే మాట మీద ఉండు అని జ్యో అంటుంది. తన చుట్టూ తిరగొద్దని సూరజ్ అంటాడు. నేను నీ చుట్టూ తిరగడం లేదు. నువ్వు చెప్పింది వినేందుకు నేను నీ పెళ్లాన్ని కాదు, నువ్వు నా మొగుడివి కాదు అని జ్యోత్స్న కౌంటర్లు వేస్తుంది.
{{/usCountry}}బయట ఏమో మా తాత నీకు సపోర్ట్ చేయడం ఏంటీ అని జ్యోత్స్నను సూరజ్ అడుగుతాడు. అది మీ తాతనే అడగమని జ్యోత్స్న చెప్తుంది. నువ్వు నన్ను రిజెక్ట్ చేశావ్. అదే మాట మీద ఉండు అని జ్యో అంటుంది. తన చుట్టూ తిరగొద్దని సూరజ్ అంటాడు. నేను నీ చుట్టూ తిరగడం లేదు. నువ్వు చెప్పింది వినేందుకు నేను నీ పెళ్లాన్ని కాదు, నువ్వు నా మొగుడివి కాదు అని జ్యోత్స్న కౌంటర్లు వేస్తుంది.
{{/usCountry}}బండరాయి లాంటి సూరజ్ మనసు గురించి జ్యోత్స్న చెప్తుంది. రూపం పోస్తే రాయి శిల్పంగా మారుతుందని సూరజ్ చెప్తాడు. మా అమ్మ, మా తాత వచ్చేలోపు వెళ్లిపో. లేదంటే నువ్వు మరోసారి తలదించుకోవడానికి సిద్ధపడాల్సిందేనని సూరజ్ అంటాడు.
మనమే గెలుస్తాం దీప
మరోవైపు కార్తీక్, దీప మాట్లాడుకుంటారు. జ్యోత్స్న ఆఫీస్ కు రావడానికి కారణం నువ్వు, నేనే అని అత్త అనుకుంటుంది. అందుకే తాతను మార్చామని అనుకుంటుంది. జ్యోత్స్న ఇక్కడ పీఏగా చేరితే శివ నారాయణ తాత తట్టుకుంటాడా అని కార్తీక్ ను దీప అడుగుతుంది. జ్యోత్స్నకు ఓ లక్ష్యం ఉన్నట్లు ఉంది. ఈ మాలిని పిన్ని అది జరగనిస్తుందా అని కార్తీక్ అంటాడు.
మనం గెలవడానికి టైమ్ పడుతుంది దీప, కానీ మనమే గెలుస్తాం. మన బలం మన కుటుంబం. మన విలువ మన నిజాయతీ. ఈ రెండూ మనతో ఉంటే చాలు. ఇది జ్యోత్స్న పోరాటం. తనేదో చేయాలనుకుంది. ఇలాంటప్పుడు మనలాంటివాళ్లం ఏం జరుగుతుందో చూడాలని దీపను తీసుకొని కార్తీక్ లోపలికి వస్తాడు.
సూరజ్ మాటతో
ఆఫీస్ స్టాఫ్ అందరినీ దక్షిణామూర్తి పిలిపిస్తాడు. జ్యోత్స్న నా మనవరాలు. నా కూతురు కూతురు. ఈ రోజు నుంచి మన ఛైర్మన్ సూరజ్ కు పర్సనల్ అసిస్టెంట్ గా ఉంటుందని దక్షిణామూర్తి అనౌన్స్ చేస్తాడు. కానీ అది జరగాలంటే జ్యోత్స్నను సూరజ్ యాక్సెప్ట్ చేయాలి. మేనేజర్ దీనిపై మీ ఛైర్మన్ సంతకం చేయించు అని దక్షిణామూర్తి అడుగుతాడు.
మేనేజర్ అడగ్గానే మా తాత మాటే నా మాట అని సూరజ్ అనడంతో మాలిని ఫ్యూజులు ఔట్ అవుతాయి. పెద్దవాళ్లు అన్నీ ఆలోచించే నిర్ణయం తీసుకుంటారని సూరజ్ అంటాడు. జ్యోత్స్నను పీఏగా అపాయింట్ చేస్తూ లెటర్ పై సూరజ్ సంతకం పెట్టబోతాడు. తల్లి మాలిని గిఫ్ట్ గా ఇచ్చిన పెన్ తో సూరజ్ సైన్ చేయబోతాడు.
దిమ్మతిరిగే షాక్
సంతకం పెట్టే ముందు నేనొక విషయం చెప్పాలి. నేనేందుకు ఈ జాబ్ రిజెక్ట్ చేయకూడదని జ్యోత్స్న దిమ్మతిరిగే షాక్ ఇస్తుంది. ఇప్పుడు మా బావ, సూరజ్, దీప, మాలిని అత్త అందరూ మీ రెకమండేషన్ కారణంగానే ఈ జాబ్ వచ్చిందని అనుకుంటారు తాత. పీఏ పోస్టు ఇవ్వమని నేను అడిగానా తాత అని జ్యోత్స్న అంటుంది.
జాబ్ లో నుంచి తీసేస్తే
నీకు అర్హత ఉంది కాబట్టే ఇస్తున్నానని దక్షిణామూర్తి చెప్తాడు. కానీ నువ్వు వెళ్లిపోయిన తర్వాత జాబ్ లో నుంచి తీసేస్తే, సూటిపోటీ మాటలతో కించపరిస్తే అప్పుడు బాధతో వెళ్లిపోవడం కంటే ఇప్పుడు వెళ్లిపోవడమే మంచిది కదా అని జ్యో అంటుంది. జ్యోత్స్న నా మనిషి. ఏ నిర్ణయం తీసుకున్నా నాకు చెప్పాలి. తనను అవమానిస్తే నన్ను అవమానించినట్లేనని దక్షిణామూర్తి చెప్తాడు. సూరజ్ సంతకం పెట్టిన లెటర్ ను జ్యోకు దక్షిణామూర్తి ఇస్తాడు.
ఇది రామబాణం. దీనికి తిరుగులేదని చెప్పి దక్షిణామూర్తి వెళ్లిపోతాడు. ఇలా మాలినిని జ్యోత్స్న లాక్ చేస్తుంది. మరోవైపు జ్యోత్స్న అందరినీ సమస్యల్లో పడేసిందని దీపతో కార్తీక్ అంటాడు.
రగిలిపోతున్న మాలిని
మాలిని లోపలికి వెళ్లి రగిలిపోతుంది. ఇన్నేళ్లలో నా మాట తొలిసారి ఓడిపోయిందని అనుకుంటుంది. అప్పుడే జ్యోత్స్న లోపలికి వస్తుంది. నాకు కంగ్రాచ్యులేషన్స్ చెప్పవా? ఆ రోజు రోడ్డు మీద ఏమన్నావ్? ఇప్పుడు నీ ఆఫీసులోనే నీ కొడుకు దగ్గర పీఏగా జాయిన్ అయ్యా. ఇక మీదట ఈ ఆఫీస్ నిండా నా అడుగులే ఉంటాయని జ్యోత్స్న కౌంటర్ ఇస్తుంది. ఇక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.