...
...
Next Story

Karthika Deepam 2 Today episode: కార్తీక దీపం 2.. పీఏ అంటే ప్రేమించిన అమ్మాయి- జ్యో కౌంటర్- చంపేస్తానని మాలిని వార్నింగ్

Karthika Deepam 2 Today episode: కార్తీక దీపం 2 సీరియల్ టుడే అక్టోబర్ 6 ఎపిసోడ్ లో మాలినికి జ్యోత్స్న దిమ్మతిరిగే కౌంటర్లు ఇస్తుంది. సూరజ్ పీఏ అంటే.. సూరజ్ ప్రేమించిన అమ్మాయి అని జ్యో కొత్త అర్థం చెప్తుంది. మరోవైపు జ్యోత్స్నను చంపేస్తానని కార్తీక్, దీపకు మాలిని వార్నింగ్ ఇస్తుంది.

Published on: Oct 6, 2026, 06:51:10 IST
Advertisement

Karthika Deepam 2 Today episode: కార్తీక దీపం 2 సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. తాత దక్షిణామూర్తిని అడ్డుపెట్టుకొని సూరజ్ పీఏ పోస్టును జ్యోత్స్న పట్టేస్తుంది. మాలిని ఆ విషయాన్ని సహించలేకపోతుంది. జ్యోత్స్న వెళ్లి మాలినికి స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తుంది.

కొడుకు దగ్గరా పీఏగా

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)

నాకు ఎక్కడా జాబ్ లేకుండా చేస్తానన్నావ్. ఇప్పుడు నీ కొడుకు దగ్గరే పీఏగా జాయిన్ అయ్యా. ఆఫీసులో అడుగుపెట్టనివ్వను అన్నావ్ కదా. ఇక ఆఫీస్ నిండా నా అడుగులే ఉంటాయి. నువ్వు జైల్లో పెట్టిన ఖైదీలా ఈ క్యాబిన్ లోనే ఉండిపోతావ్. నేను ఆఫీస్ మొత్తం గిరగిరా అంటూ తిరుగుతూనే ఉంటా. నీకు నచ్చినా నచ్చకపోయినా భరించాల్సిందేనని జ్యోత్స్న మాలినికి చెప్తుంది.

పీఏకు జ్యోత్స్న అర్థం

ఇది ఆఫ్టరాల్ పీఏ జాబ్. నువ్వు నా కొడుకు దగ్గర చేతులు కట్టుకొని ఉండాల్సిందేనని మాలిని కోపంతో అంటుంది. పీఏ అంటే ప్రేమించిన అమ్మాయి అత్త. సూరజ్ పీఏ అంటే సూరజ్ ప్రేమించిన అమ్మాయి. ఇది అసలైన అర్థం. ఇప్పుడు నీ కొడుకు పక్కనే నిలబడ్డా. నీ కొడుకు క్యాబిన్ లోకి నువ్వు వెళ్లాలన్నా నేను పర్మిషన్ ఇవ్వాలి. అసలు ఆఫీసులో నీ పోస్టు ఏంటీ? అని మాలినికి దిమ్మతిరిగే షాక్ ఇస్తుంది జ్యోత్స్న.

ఆట మొదలుపెడదామా?

నీకు ఏ పోస్ట్ లేదా? ఊరికే వచ్చి కూర్చుకుంటున్నావా? అని జ్యోత్స్న అనేసరికి మాలిని కోపంతో అరుస్తుంది. నువ్వు ఆరోగ్యంగా ఉండాలి అత్త. నేను ఏం చేస్తున్నానో నువ్వు చూడాలి కదా. కార్తీక్, దీప ఎందుకు వచ్చారో నీకు క్లారిటీ ఉండొచ్చు. కానీ నేను ఎందుకు వచ్చానో, ఏం చేస్తానో ఊహించలేవు అత్త అని జ్యోత్స్న స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తుంది. ఈ రోజు నుంచి నిన్ను వస్తువులా చూస్తా. వస్తువుతో ఆడుకున్నట్లే ఆడుకుంటా. ఆట మొదలుపెడదామా అని జ్యోత్స్న వెళ్లిపోతుంది.

ఇంట్లో చెప్పొద్దు

మాలిని అత్త చాలా తెలివైంది. తనకు అవసరం లేకపోతే ఎవరినీ రానివ్వదు. మిమ్మల్ని అడ్డుపెట్టుకొని ఏదో చేయబోతుంది. మీరు జాగ్రత్తగా ఉండాలి. నేనూ ఓ లక్ష్యంతో వచ్చా. మీరు మాలిని అత్త ద్వారా వచ్చారు. నేను దక్షిణామూర్తి తాతతో వచ్చా. మీరు నా విషయంలో పట్టించుకోవద్దని జ్యోత్స్న అంటుంది. ఏదో ప్రమాదం జరగబోతుంది జ్యోత్స్న. మాలిని వదలదని కార్తీక్ టెన్షన్ పడతాడు.

యుద్ధం ఒక్కటే. కానీ చేసే తీరు, ఎంచుకునే మార్గాలు వేరు. మనం వీళ్లతో ఆడుకుందాం. మీరు మొదలుపెట్టారు. నేనూ ఇప్పుడే స్టార్ట్ చేశా. మనం చేసేది చేసుకుంటూ పోదామని జ్యోత్స్న క్లారిటీగా చెప్తుంది.

మీ అమ్మకు భయం

ఆఫీసు లోపల జ్యోత్స్న దగ్గరకు వచ్చి సూరజ్ మాట్లాడతాడు. మా అమ్మ చెప్తేనే సంతకం చేశా. నిన్ను యాక్సెప్ట్ చేశాననుకోకు అని సూరజ్ అంటాడు. నువ్వు యాక్సెప్ట్ చేయడం ఎవరికి కావాలి? నేను కావాలనుకుంటే ఇప్పుడే జాబ్ వదిలేయగలను. కెఫేలో జాబ్ మీ వల్లే పోయింది. నువ్వు నా వెంట పడుతుంటే మీ అమ్మకు భయం పట్టుకుంది. మీ అమ్మకు నీ మీద అనుమానం మొదలైంది. నీకు, నాకు మధ్య దూరం పెంచాలని చూస్తుందని జ్యోత్స్న చెప్తుంది.

నేను మనసుతో ఆలోచించాను కాబట్టే మోసపోయా. బ్రెయిన్ తో ఆలోచిస్తే తెలివితేటల్లో నన్ను కొట్టేవారే లేరు. నువ్వు నా గురించి బాధపడుతున్నావా? అని సూరజ్ ను జ్యోత్స్న అడుగుతుంది. వెంటనే సైక్రియార్టిస్ట్ ను కలవమని జ్యోకు సూరజ్ కౌంటర్ ఇస్తాడు.

మీరే కారణం

జ్యోత్స్నను ఆఫీసుకు తీసుకురావడం ఎవరి ప్లాన్ అని కార్తీక్, దీపను మాలిని అడుగుతుంది. ఏం చేయబోతున్నారో చెప్పమంటుంది. నీ ఆఫీసులో నీ ముందే సూరజ్, జ్యోత్స్నకు పెళ్లి చేద్దామనుకుంటున్నామని దీప చెప్పడంతో మాలిని షాక్ అవుతుంది. జ్యోత్స్న ఆఫీసుకు రావడానికి కారణం మీ మామ, పీఏగా సంతకం పెట్టింది నీ కొడుకు. దాన్ని ఆమోదించింది నువ్వు. అన్ని మీరు చేసి మమ్మల్ని ఎందుకు అంటున్నారు. కెఫేలో జాబ్ తీయించారు కాబట్టే జ్యోత్స్న వచ్చిందని కార్తీక్ తెలివిగా మాట్లాడతాడు.

అత్తకు భయం పట్టుకుంది బావ. ఎక్కడ జ్యోత్స్న సూరజ్ ను మార్చి పెళ్లి చేసుకుంటాడోనని భయం పట్టుకుంది అని దీప చెప్తుంది. సూరజ్ మనసులో జ్యోత్స్న ఉంది. అది బయటకు వచ్చిన రోజునా ఎవరూ ఆపలేరని దీప అంటుంది.

మనిషి ఉండదు

అదే జరిగితే ఆ మనసు ఉండదు, మనిషి ఉండదు. సూరజ్ నాకు చెప్పకుండా ఏం చేయడు. నా కొడుకు జోలికి వస్తే ఎంత విధ్వంసం చేయగలను. నా కొడుకు జోలికి రావొద్దని జ్యోత్స్నకు చెప్పండని మాలిని వార్నింగ్ ఇస్తుంది. అంటే జ్యోత్స్న ప్రాణాలు తీసేందుకైనా వెనుకాడనని మాలిని ఇండైరెక్ట్ గా చెప్తుంది.

మరోవైపు శివ నారాయణ టిఫిన్ బండి దగ్గర బిజీగా ఉంటుంది. దాసుకు ఒంట్లో బాలేదని పారిజాతం వెళ్లిందని శివ నారాయణ చెప్తాడు. ఒకడివే ఎంత సేపు కష్టపడతావని కార్తీక్ అడుగుతాడు. కానీ సాయం పొందేందుకు శివ నారాయణ ఒప్పుకోడు. ఇక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks