Karthika Deepam 2: బుల్లితెరపై ట్రెండ్ క్రియేట్ చేస్తున్న సీరియల్ ‘కార్తీక దీపం 2’. అప్పట్లో కార్తీక దీపం సీరియల్ టీవీ రికార్డులను బ్రేక్ చేసింది. ఇప్పుడు దానికి సీక్వెల్ గా వస్తున్న ‘కార్తీక దీపం 2’ కూడా అదరగొడుతోంది. ప్రస్తుతం టీవీలో మోస్ట్ ట్రెండింగ్ సీరియల్ గా కార్తీక దీపం 2 కొనసాగుతోంది. ఈ సీరియల్ లో వస్తున్న ట్విస్ట్ లు ఆడియన్స్ ను అలరిస్తున్నాయి.
సూరజ్ మిస్టరీ

కార్తీక దీపం 2 సీరియల్ లో ప్రస్తుతం కొత్త క్యారెక్టర్లు చూపిస్తున్న ఇంపాక్ట్ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా సూరజ్ క్యారెక్టర్ లో వేరియేషన్స్ అదిరిపోయేలా ఉన్నాయి. అసలు ఈ సూరజ్ ఎవరు అనే మిస్టరీని మేకర్స్ పక్కాగా కొనసాగించడంలో సక్సెస్ అవుతున్నారు. సూరజ్ క్యారెక్టర్ లోని షేడ్స్ తో సీరియల్ క్రేజ్ ఇంకా పెరుగుతోంది.
జ్యోత్స్న లవ్
కార్తీక దీపం 2 సీరియల్ విలన్ ఎవరంటే అందరూ జ్యోత్స్న అని చెప్తారు. బావ కార్తీక్ తనకు సొంతం కావాలని, దీపను నాశనం చేయాలని సైకో ప్లాన్ లతో జ్యోత్స్న విలనిజం చూపిస్తూ వస్తోంది. కానీ కొన్ని వారాలుగా జ్యోత్స్న విలనిజానికి బ్రేక్ పడింది. అందుకు ప్రధాన కారణం సూరజ్. బంగారం అంటూ జ్యోత్స్న వెనుకాల పడ్డ సూరజ్ ఆ లేడీ విలన్ ను లవ్ లో పడేసినట్లే కనిపిస్తున్నాడు.
రివర్స్ డ్రామా
అసలు సూరజ్ ఎంట్రీనే కార్తీక దీపం 2 సీరియల్ కు పెద్ద ప్లస్ గా మారింది. మంచోడిలా శివ నారాయణ అండ్ ఫ్యామిలీ ప్రేమను గెలుచుకున్నాడు సూరజ్. జ్యోత్స్నను పెళ్లి చేసుకుంటానని ఫస్ట్ నుంచి చెప్పుకొస్తున్నాడు. కానీ తీరా ఫ్యామిలీ అంతా కలిసి జ్యోత్స్నను పెళ్లి చేసుకోమంటే మాత్రం నో చెప్పి షాక్ ఇచ్చాడు. ఈ ట్విస్ట్ మామూలుగా లేదు. ఇక్కడే సూరజ్ రివర్స్ డ్రామా ఆడుతున్నాడని తెలుస్తోంది.
జ్యో కన్నీళ్లు
కార్తీక దీపం 2 సీరియల్ లో ఫస్ట్ నుంచి విలన్ జ్యోత్స్న ఎదుటివాళ్లను ఏడిపిస్తూ వచ్చింది. సొంత తండ్రి దాసు, పెంచిన తల్లిదండ్రులు దశరథ, సుమిత్రతో పాటు కార్తీక్, దీపను జ్యోత్స్న ఏడిపిస్తూ వచ్చింది. ముఖ్యంగా లండన్ లో చదువుకొని వచ్చిన బావను తన డ్రైవర్ ను చేసుకుంది. దీపను చంపాలని చూసింది. సుమిత్ర ప్రాణాలు పోవాలని కుట్ర పన్నింది.
{{/usCountry}}కార్తీక దీపం 2 సీరియల్ లో ఫస్ట్ నుంచి విలన్ జ్యోత్స్న ఎదుటివాళ్లను ఏడిపిస్తూ వచ్చింది. సొంత తండ్రి దాసు, పెంచిన తల్లిదండ్రులు దశరథ, సుమిత్రతో పాటు కార్తీక్, దీపను జ్యోత్స్న ఏడిపిస్తూ వచ్చింది. ముఖ్యంగా లండన్ లో చదువుకొని వచ్చిన బావను తన డ్రైవర్ ను చేసుకుంది. దీపను చంపాలని చూసింది. సుమిత్ర ప్రాణాలు పోవాలని కుట్ర పన్నింది.
{{/usCountry}}అలాంటి విలన్ జ్యోత్స్నలో ఇప్పుడు హఠాత్తుగా మార్పు వచ్చింది. అందరినీ ఏడిపించిన జ్యోత్స్న తాజాగా కన్నీళ్లు పెట్టుకోవడంతో సీరియల్ ఫాలోవర్లు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. ఈ సూరజ్ మాములోడు కాదు.. విలన్ జ్యోత్స్ననే లవ్ లో పడేశాడని మాట్లాడుకుంటున్నారు.
పెళ్లి జరుగుతుందా?
జ్యోత్స్న ఇగోపై సూరజ్ దెబ్బకొట్టాడు. ఇప్పటికీ జ్యోత్స్న మనసులో కార్తీక్ ఉన్నాడంటూ నిజాలను బాంబులా పేల్చాడు. ఇది జ్యోకు చావు దెబ్బలా తగిలింది. జ్యోత్స్నను పెళ్లి చేసుకుంటావా అని శివ నారాయణ అండ్ ఫ్యామిలీ అడిగితే సూరజ్ రిజెక్ట్ చేయడం సంచలనంగా మారింది. ఈ అవమానం, బాధ, ప్రేమ తట్టుకోలేక జ్యో ఏడ్చేసింది. మరి జ్యోత్స్న తన పట్టువీడి సూరజ్ ను పెళ్లి చేసుకుంటుందా? లేదా తనలోని పాత విలన్ ను బయటకు తీస్తుందా? అన్నది చూడాలి.