Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 ఈ రోజు ఎపిసోడ్ లో.. శత్రువులు, నమ్మినవాళ్లు, బంధువులు, సొంతవాళ్లు కలిసి ఈ శివ నారాయణను ఓడించారు. ఇంకా నన్ను నమ్ముకొని ఉన్న ఎంప్లాయిస్ కు ఏం సమాధానం చెప్పాలని శివ నారాయణ ఫీల్ అవుతాడు. కానీ ఎంప్లాయిస్ ఏమో శివ నారాయణ, దశరథపై ఫైర్ అవుతారు.
ఉద్యోగుల ఆవేశం

మీరు, దక్షిణామూర్తి వియ్యంకులని తెలిసింది. మీ షేర్స్ అన్నీ అమ్మేసి మమ్మల్ని రోడ్డున పడేస్తారా? మా అందరికీ రెండు నెలల జీతం ఇచ్చి పనిలో నుంచి తీసేశారు. మీరు మా బతుకులను అమ్ముకున్నారు. మీరు అమ్ముడుపోయారు అని గిరి అనే ఎంప్లాయ్ ఆవేశపడతాడు. అతణ్ని దశరథ కొట్టడంతో ఎంప్లాయిస్ అందరూ కలిసి దశరథ కాలర్ పట్టుకుంటారు. శివ నారాయణను నెట్టేస్తారు.
మాలిని కౌంటర్
పడిపోతున్న శివ నారాయణను మాలిని పట్టుకుంటుంది. నీలాంటి మంచోళ్లు బతకడం కష్టం. నీ పని అయిపోయింది బాబాయి. శత్రువుకు నిలబడేందుకు నీడ కూడా ఉండకూడదు అనేలా మన గెలుపు ఉండాలని మాలిని కౌంటర్లు వేస్తుంది. ఎంప్లాయిస్ కు సమాధానం చెప్పకుండా తండ్రిని తీసుకొని దశరథ వెళ్లిపోతాడు. ఇంటి దగ్గర మరో ట్విస్ట్ ఎదురు చూస్తుందని మాలిని అనుకుంటుంది.
సూరజ్ కు ప్రశ్నలు
మరోవైపు హాస్పిటల్లో సూరజ్ తో జ్యోత్స్న మాట్లాడుతుంది. దీప విషయం మా బావకు చెప్పేందుకు నీకు ముఖం చెల్లడం లేదు కదా అని జ్యో ప్రశ్నిస్తుంది. విషయం చేరడం ఇంపార్టెంట్, ఎవరు చెప్పారన్నది కాదని సూరజ్ చెప్తాడు. నా విషయంలోనూ ఇలాగే చేశావ్ కదా అని జ్యో తిరిగి అడుగుతుంది. యుద్ధం అంటేనే చంపుకోవడం అని సూరజ్ తెలివిగా మాట్లాడుతాడు.
దీప నా వదిన
పెళ్లి ఆగిపోయిన తర్వాత ఈ క్రెడిట్ మొత్తం కార్తీక్, దీపదే అని నిందలు వేసి వెళ్లిపోయావ్. మరి ఈ రోజు దీపను ఎందుకు కాపాడాలని చూస్తున్నావ్ అని జ్యోత్స్న అడుగుతుంది. దీప ఎప్పటికీ నా వదిననే అని సూరజ్ చెప్తాడు. నువ్వు అనుకున్నది సాధించడానికి వాళ్లను వాడుకున్నావ్. ఇప్పుడు దీపను హాస్పిటల్ కు తీసుకురావడం వెనుక ఏదో ప్లాన్ ఉందని అనుకుంటున్నానని జ్యో అనుమానపడుతుంది.
{{/usCountry}}పెళ్లి ఆగిపోయిన తర్వాత ఈ క్రెడిట్ మొత్తం కార్తీక్, దీపదే అని నిందలు వేసి వెళ్లిపోయావ్. మరి ఈ రోజు దీపను ఎందుకు కాపాడాలని చూస్తున్నావ్ అని జ్యోత్స్న అడుగుతుంది. దీప ఎప్పటికీ నా వదిననే అని సూరజ్ చెప్తాడు. నువ్వు అనుకున్నది సాధించడానికి వాళ్లను వాడుకున్నావ్. ఇప్పుడు దీపను హాస్పిటల్ కు తీసుకురావడం వెనుక ఏదో ప్లాన్ ఉందని అనుకుంటున్నానని జ్యో అనుమానపడుతుంది.
{{/usCountry}}నువ్వు నమ్మించి మోసం చేశావ్. అందుకే మా బావకు కాల్ చేయలేదు. నువ్వు చేసింది నీకు తప్పు అనిపించడం లేదా? అని జ్యోత్స్న వరుస ప్రశ్నలు వేస్తుంది. కార్తీక్ కు సమాచారం వెళ్లింది కాబట్టి నేను వెళ్లిపోతానని సూరజ్ అంటాడు. నువ్వు ఎప్పుడో వెళ్లిపోయావ్ సూరజ్ అని జ్యోత్స్న ఎమోషనల్ డైలాగ్ చెప్తుంది.
షాక్ ఇచ్చిన బ్యాంకు ఆఫీసర్లు
ఇటు శివ నారాయణ, దశరథ ఇంటికి వచ్చేసరికి లోన్ రికవరీ కోసం బ్యాంకు వాళ్లు రెడీగా ఉంటారు. మాలిని మేడం మా బ్యాంకులో రూ.20 కోట్ల లోన్ తీసుకున్నారు. అది కట్టకపోతే అడగాల్సింది మిమ్మల్నే కదా అని బ్యాంకు వాళ్లు చెప్పేసరికి అందరికీ దిమ్మతిరుగుతుంది. ఆ అప్పుకు, మాకు సంబంధం ఏంటీ? అని శివ నారాయణ అడుగుతాడు. దానికి ష్యూరిటీగా మీ ఫ్యామిలీ మొత్తం సంతకాలు పెట్టారని బ్యాంకు వాళ్లు చూపిస్తారు.
వరుసగా షాక్ లు
ఇదంతా మోసం అని శివ నారాయణ అరుస్తాడు. మాలిని అప్పు తీర్చడం లేదు. ష్యూరిటీ ఇచ్చిన మీరే అప్పు కట్టాలని బ్యాంకు వాళ్లు చెప్తారు. ఆ సూరజ్ ఈ సంతకాలు తీసుకున్నాడు. మనల్ని నిలువునా ముంచేశాడని పారిజాతం టెన్షన్ పడుతుంది. మాకు తెలిసి ఈ ఇల్లు తప్పా మిగతా మీ ప్రాపర్టీస్ వేరేవాళ్లు హ్యాండోవర్ చేసుకున్నారని బ్యాంకు మేనేజర్ చెప్పడంతో శివ నారాయణకు ఇంకో పెద్ద షాక్ తగులుతుంది.
రూ.20 కోట్లు కట్టకపోతే ఇంటిని జప్తు చేయాల్సి ఉంటుంది. డబ్బు కట్టకపోతే మీరు కట్టుబట్టలతో ఈ ఇల్లు వదిలి వెళ్లిపోవాలని బ్యాంకు వాళ్లు చెప్తారు.
కార్తీక్ బాధ
సీన్ హాస్పిటల్ కు మారుతుంది. కార్తీక్ కంగారుగా హాస్పిటల్ కు వస్తాడు. దీపకు ఆపరేషన్ జరుగుతుంది. కండీషన్ సీరియస్ గా ఉందని డాక్టర్ చెప్పాడు. దీప బతకకపోవచ్చు. దీప బతికినా కడుపులో బిడ్డ అని జ్యోత్స్న చెప్తుంటే కార్తీక్ కన్నీళ్లలో మునిగిపోతాడు. బావ ప్లీజ్ ధైర్యంగా ఉండమని జ్యోత్స్న చెప్తుంది. కానీ కార్తీక్ కంట్రోల్ చేసుకోలేకపోతాడు.
కట్టుబట్టలతో
మరోవైపు శివ నారాయణ ఇంట్లో నగలు, డబ్బు అన్నింటినీ బ్యాంకు వాళ్లు లెక్క కడతారు. ఇంట్లో ఉన్న వాళ్లందరి ఒంటిపై ఉన్న నగలు తీసి లెక్కకట్టినా సరిపోవడం లేదని బ్యాంకు వాళ్లు చెప్తారు. అందరినీ బయటకు వెళ్లమని, ఇల్లు లాక్ చేస్తామని బ్యాంకు ఆఫీసర్ చెప్తాడు. కట్టుబట్టులతో శివ నారాయణ, దశరథ, సుమిత్ర, పారిజాతం రోడ్డున పడతారు. ఇక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.