...
...
Next Story

Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2.. ఆట మొదలైందంటూ కార్తీక్ ఛాలెంజ్-మాలిని బ్లాక్ మెయిల్- జ్యో చుట్టూ సూరజ్

Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ టుడే సెప్టెంబర్ 22 ఎపిసోడ్ రసవత్తరంగా సాగుతుంది. మాలిని ఇంటికి వెళ్లిన కార్తీక్, దీప ఛాలెంజ్ చేస్తారు. చిటికెలు వేసి మరీ ఆట మొదలైందంటూ కార్తీక్ వార్నింగ్ ఇస్తాడు. దక్షిణామూర్తిని మాలిని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తుంది.

Published on: Sep 22, 2026, 06:49:08 IST
Advertisement

Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 ఈ రోజు ఎపిసోడ్ లో.. దక్షిణామూర్తికి ఎక్కడ నిజం తెలుస్తుందో అని మాలిని టెన్షన్ పడుతుంది. అందుకే విషయం డైవర్ట్ చేసేలా కార్తీక్, దీపతో మాట్లాడుతుంది. మాకు అవమానం జరిగితే మీకు పట్టదు. మా ప్రాణాలు పోతే మీకేం కాదు. అదే మీకు కష్టం వస్తే అరుస్తారని మాలిని అంటుంది.

దీప వార్నింగ్

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)

ఇప్పుడు మీకున్న నొప్పే నా భర్త చనిపోయిన నాకు కలిగిందని మాలిని అంటుంది. మీరు కత్తులు పట్టుకొని తిరుగుతున్నారు. తండ్రి చనిపోవడం వేరు, తల్లి అవిటిది కావడం వేరు. నువ్వు విషం నాటావు అని మాలినిపై కార్తీక్ సీరియస్ అవుతాడు. మేం ఉండగా ఏదీ జరగదు అని దీప కూడా వార్నింగ్ ఇస్తుంది.

నమ్మకాలను పాతేశారంటూ

శివ నారాయణ యవదాస్తి మీద సూరజ్ పక్కనే నిలబడి శివ నారాయణతో సంతకాలు పెట్టించింది నేనే. వాళ్లు నన్ను నమ్మారు. నేను సూరజ్ ను నమ్మా. అందరి నమ్మకాలను పాతేశారు. మేం ఏ తప్పు చేయకపోయినా తల దించుకొని నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. దీనికి కారణం మీరు కాదా? ఈ రోజు రోడ్డున పడింది ఎవరు చెప్పు తాత? నీ కూతురు, మనవరాలు కాదా? అని దక్షిణామూర్తిని అడుగుతుంది దీప.

కార్తీక్ ఆట

మామయ్యకు తన తప్పు తెలిసేలా ఉందని మాలిని టెన్షన్ పడుతుంది. మేం ఎవరి జోలికి వెళ్లలేదు. ఇది మీ తాత తలరాత. అనుభవించి తీరాలని మాలిని అంటుంది. ఇక మీదట మరో కార్తీక్ ను చూస్తావ్. నా వాళ్లకు కష్టం కలిగిందంటే నేను రుద్రమూర్తిని. శివ నారాయణ నా తల్లికి తండ్రి. నా కుటుంబం కోసం ఏమైనా చేస్తా. అందుకే వాళ్లను నా ఇంట్లో పెట్టుకున్నానని కార్తీక్ షాక్ ఇస్తాడు.

బయట సూరజ్ కనిపిస్తాడు. దీప ఏమో మాట్లాడొద్దని అంటుంది. కానీ సూరజ్ వచ్చి మాట్లాడతాడు. మీ అమ్మ చేసిన యాక్సిడెంట్ కు నా కుటుంబం పరువు పోగొట్టుకొని రోడ్డు మీద పడిందని దీప అంటుంది. పది మందికి అన్నం పెట్టే కుటుంబం ఆకలితో గుడిలో పడుకుంది. కారణం నువ్వు. మరి ఇంతలా మోసం చేసేందుకు నీకు మనసు ఎలా వచ్చింది సూరజ్ అని కార్తీక్ ఆవేశపడతాడు.

నువ్వు చేసిన తప్పునకు మేం నిందలు మోస్తున్నాం. మనసులో ప్రేమ ఉన్నా అమ్మ కోసం సమాధి చేస్తావు. అమ్మ తప్పు చేస్తున్నా చెప్పవు. నీ వల్ల మేం, మా తాత కుటుంబం మోసపోయాం. కానీ నువ్వు నీ తల్లి దగ్గరే మోసపోతున్నావ్. ఆవిడ ఏం చెప్పినా నిజమని నమ్ముతున్నావ్. త్వరలోనే నీ కళ్లు తెరుచుకుంటాయని కార్తీక్ ఫైర్ అవుతాడు.

నువ్వు నా భార్యను, కడుపులో బిడ్డను కాపాడావు. అదే నీలోని మంచితనం. ఇక ఇప్పుడు నా ఆట మొదలైందని కార్తీక్ చిటికెలు వేసి మరీ సూరజ్ కు వార్నింగ్ ఇస్తాడు.

అసలు నువ్వు మనిషివేనా?

మరోవైపు నా కూతురిని రోడ్డు మీదకు తీసుకోస్తావా? అసలు నువ్వు మనిషివేనా? అని మాలినిని దక్షిణామూర్తి తిడతాడు. నా కూతురి దృష్టిలో నన్ను రాక్షసుడిని చేశావంటూ దక్షిణామూర్తి ఎమోషనల్ అవుతాడు. మీ కూతురికి మీపై ప్రేమ ఉందా? అలా అని ఎందుకు మోసం చేసుకుంటారు? అని మాలిని ప్రశ్నిస్తుంది. ఈ మాటలను బయట నుంచి వస్తున్న సూరజ్ వింటాడు.

మాలిని బ్లాక్ మెయిల్

మీ కన్నకూతురు ముందే మీ శత్రువు మీ షర్ట్ చింపాడు. అదే చేతులతో మీ కాళ్లు పట్టుకొనే రోజు తొందర్లోనే వస్తుంది. అప్పుడు మీ కూతురు, మనవరాలు మీతోనే ఉంటారు. నేను చేసింది తప్పని మీకు అనిపిస్తే మీ అబ్బాయి ఫొటో పక్కన నా ఫొటో ఉంటుందని మాలిని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తుంది. మీ కూతురు, మనవరాలు మీ దగ్గరకు వస్తారని మాలిని మొసలి కన్నీళ్లు కారుస్తుంది. ఈ మాటలతో నా కొడుకైనా, కోడలైనా నువ్వే అని దక్షిణామూర్తి కరిగిపోతాడు.

జ్యో చుట్టూ సూరజ్

రోడ్డు పక్కన చేయికి కట్టుతో ఉన్న శౌర్యను చూసి సూరజ్ కంగారు పడతాడు. అక్కడే జ్యోత్స్న ఉంటుంది. శౌర్య కోసం సూరజ్ ఐస్ క్రీమ్ కొనిస్తాడు. మళ్లీ సూరజ్, జ్యోత్స్న ఒకరినొకరు మాటలు అనుకుంటారు. కారు కొనే స్థాయి నుంచి ఐస్ క్రీమ్ కూడా కొనలేని స్థాయికి తీసుకొచ్చింది నువ్వేనని జ్యో అంటుంది. నా చుట్టూ ఎందుకు తిరుగుతున్నావని అడుగుతుంది.

మీ అమ్మ నీకు నా దగ్గర డ్యూటీ వేసింది. మా కష్టాలు మీ అమ్మకు అప్డేట్ ఇవ్వాలి. ఈ జ్యోత్స్నకు ఆత్మాభిమానం ఉంది. నువ్వు ఇచ్చిన రూ.100 అప్పుగానే తీసుకుంటానని జ్యోత్స్న చెప్తుంది. అమ్మానాన్న లాగే బాబాయి, నువ్వు ఒకటేనా అని జ్యోను శౌర్య అడగడంతో జ్యో ఫీల్ అవుతుంది.

ఇది నా కర్మ

ఇంటికి వెళ్లిన జ్యోత్స్న జరిగిన విషయాన్ని కార్తీక్, దీపకు చెప్పదు. జ్యోకు కొత్త బట్టలు ఇస్తారు. ఇల్లు, వాకిలి లేకుండా కట్టుబట్టులతో ఉన్నవాళ్లను శరణార్థులనే అంటారు. మేం శరణార్థులమే. ఇదంతా నా కర్మ. ఒకప్పుడు మీరు కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు. దానికి కారణం నేను. నేను చేసిందే ఇప్పుడు నాకు తిరిగొచ్చిందని జ్యో అనడంతో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks