Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. ఓ రెస్టారెంట్లో జాబ్ కోసం జ్యోత్స్న వెళ్తుంది. అక్కడ వెయిటర్ పోస్టు మాత్రమే ఖాళీగా ఉందని ఓనర్ చెప్తాడు. అయినా సరే చేస్తానని జ్యోత్స్న అంటుంది. నాకు ఎలా చేయాలో తెలియదు కానీ, ఏం చేయాలో తెలుసు సార్ అని జ్యో రిక్వెస్ట్ చేస్తుంది.
వెయిటర్ పోస్టు కోసం జ్యోత్స్న

కస్టమర్ చిరాకుతో ఉన్నా వెయిటర్ మాత్రం నవ్వుతూ ఉండాలి. తిట్టినా కూడా భరించాలని రెస్టారెంట్ ఓనర్ చెప్తాడు. నా కుటుంబాన్ని పోషించుకోవడం కోసం నాకు ఈ జాబ్ అవసరమని జ్యోత్స్న మళ్లీ రిక్వెట్ చేస్తుంది. దీంతో రేపు మార్నింగ్ వచ్చి జాయిన్ అవమని ఓనర్ చెప్పడంతో జ్యో హ్యాపీగా ఫీల్ అవుతుంది.
దీపే సీఈఓగా
మరోవైపు జ్యోత్న్స రెస్టారెంట్స్ ఆఫీస్ కు వెళ్లిన కార్తీక్, దీప అగ్రిమెంట్ తో సూరజ్, మాలినికి షాక్ ఇస్తారు. ఈ అగ్రిమెంట్ ప్రకారం జ్యోత్స్న రెస్టారెంట్స్ ఉన్నంతకాలం దీపే సీఈఓగా ఉండాలి. ఇది ఛైర్మన్ తీర్మాణం. దాన్ని బోర్డు మెంబర్స్ ఆమోదిస్తూ సంతకం పెట్టారు. అది వ్యాలిడ్ కాదని మీ లీగల్ అడ్వైజర్ ను చెప్పమను పిన్ని అని కార్తీక్ దిమ్మతిరిగే షాకిస్తాడు.
రూ.10 కోట్లు కట్టాలంటూ
అంత గుడ్డిగా ఎలా సంతకాలు పెట్టారని మాలిని ఫైర్ అవుతుంది. సూరజ్ ను నమ్మి శివ నారాయణ ఎలా పెట్టారో అలాగే పెట్టారని దీప కౌంటర్ ఇస్తుంది. దీప సీఈఓగా వద్దు అనుకుంటే దీపకు రూ.10 కోట్లు కట్టాలని లీగల్ అడ్వైజర్ చెప్పడంతో మాలినికి మైండ్ బ్లాక్ అవుతుంది. కోర్టుకు వెళ్తానని మాలిని అంటుంది. కోర్టుకు వెళ్లినా వాళ్లే గెలుస్తారు మేడం అని లీగల్ అడ్వైజర్ చెప్తాడు.
షాకిచ్చిన కార్తీక్
వెంటనే ఆ అగ్రిమెంట్ తీసుకొని మాలిని చించేస్తుంది. ఇప్పుడేం చేస్తావ్ అని కార్తీక్ ను మాలిని ప్రశ్నిస్తుంది. నువ్వు చింపింది ఒరిజినల్ కాదు పిన్ని, కలర్ జిరాక్స్. అసలైన డాక్యుమెంట్ వేరే దగ్గర ఉంది. నా దగ్గర సాఫ్ట్ కాపీ కూడా ఉంది. సూరజ్, లీగల్ అడ్వైజర్ కు కూడా షేర్ చేశా. బాగా ఆలోచించుకొని సాయంత్రం వరకూ నిర్ణయం చెప్పమని కార్తీక్ అదిరిపోయే షాక్ ఇస్తాడు.
{{/usCountry}}వెంటనే ఆ అగ్రిమెంట్ తీసుకొని మాలిని చించేస్తుంది. ఇప్పుడేం చేస్తావ్ అని కార్తీక్ ను మాలిని ప్రశ్నిస్తుంది. నువ్వు చింపింది ఒరిజినల్ కాదు పిన్ని, కలర్ జిరాక్స్. అసలైన డాక్యుమెంట్ వేరే దగ్గర ఉంది. నా దగ్గర సాఫ్ట్ కాపీ కూడా ఉంది. సూరజ్, లీగల్ అడ్వైజర్ కు కూడా షేర్ చేశా. బాగా ఆలోచించుకొని సాయంత్రం వరకూ నిర్ణయం చెప్పమని కార్తీక్ అదిరిపోయే షాక్ ఇస్తాడు.
{{/usCountry}}అయితే సీఈఓ పోస్టు లేదా రూ.10 కోట్లు అని బయట దీపతో కార్తీక్ చెప్తాడు. రూ.10 కోట్లు ఇస్తే ఎలా అని దీప అడుగుతుంది. మరీ మంచింది. ఆ డబ్బుతో కొత్త రెస్టారెంట్ ఓపెన్ చేయొచ్చు. కానీ అంత తెలివితక్కువ పని పిన్ని చేయకపోవచ్చు. అయినా ఈ రెండు చేయడం తప్పా పిన్నికి వేరే దారి లేదు. ఎక్కువగా ఆలోచించొద్దు దీప అని కార్తీక్ చెప్తాడు.
కాంచన ఇంటికి మాలిని
దీప, కార్తీక్ ఇంటికి వెళ్తారు. ఇప్పటివరకూ ఎక్కడికి వెళ్లారని శౌర్య అడుగుతుంది. అలా అడగొద్దని దీప గట్టిగా చెప్తుంది. కూతురిని అలా భయపడతావేంటీ దీప అని మాలిని షాకింగ్ ఎంట్రీ ఇస్తుంది. ఎంత కష్టం వచ్చింది సుమిత్ర. మిమ్మల్ని ఇలా చూస్తుంటే బాధగా ఉందని కపట ప్రేమ చూపిస్తుంది మాలిని.
మాలిని గేమ్
కూతురిని అనాథను చేశావ్. ఇప్పుడు అదే కూతురి ఇంటికి వచ్చావ్ బాబాయి. సిగ్గు లేదా అని మాలిని అవమానిస్తుంది. మీ బతుక్కి, ఈ ఇంటికి సరిగ్గా సరిపోయిందని మాలిని అంటుంది. ఇది నా ఇల్లు, వాళ్లు నా వాళ్లు. ముందు బయటకు వెళ్లమని కాంచన సీరియస్ అవుతుంది. నేను వచ్చింది మీ కోడలు కోసమని మాలిని గేమ్ స్టార్ట్ చేస్తుంది.
జ్యోత్స్నకు కోపం
దీప, కార్తీక్ నాకో బ్రహ్మాండమైన ఆఫర్ ఇచ్చారు. ఒక రకంగా చెప్పాలంటే వాళ్లే నన్ను ఆహ్వానించారని మాలిని దీప, కార్తీక్ ను ఇరికించాలని చూస్తుంది. బయట కారు దగ్గర వెయిట్ చేస్తున్న సూరజ్ ను చూసి జ్యోత్స్నకు కోపం వస్తుంది. మళ్లీ ఎందుకు వచ్చావ్? మమ్మల్ని ఈ ఇంట్లో కూడా ఉండనివ్వరా? ఈ ఇల్లు కూడా కొనేశారా? మమ్మల్ని, మాకు ఆశ్రయం ఇచ్చినందుకు మా బావ ఫ్యామిలీని గెంటేయండని జ్యో ఫైర్ అవుతుంది.
నేను మా అమ్మకు తోడుగా వచ్చానని సూరజ్ చెప్తాడు. నీ సాయం లేకుండా మీ అమ్మ ఏం చేయదు. మీరు ఎందుకు వచ్చారు? మీ అమ్మ చేసిన ప్రతి అరాచకం నీ వల్లే జరిగింది. నువ్వు దొంగతనంగా సంతకాలు చేయించకుంటే మీ అమ్మ ఆఫీసులోకి వచ్చేదా? దక్షిణామూర్తి ప్లాన్ లు వేస్తాడు. నువ్వు అమలు చేస్తావు. వాటితో మీ అమ్మ ఆడుకుంటుందని జ్యోత్స్న మాట్లాడుతూనే ఉంటుంది.
మీకు ఇల్లు లేదు కదా
ఇటు లోపల ఏమో మాలిని వెటకారంగా మాట్లాడుతుంది. ఈ మనిషిని చూస్తే కంపరంగా ఉంది. ఆవిడను పొమ్మంటావా? మమ్మల్ని వెళ్లిపొమ్మంటావా? కార్తీక్ అని శివ నారాయణ సీరియస్ అవుతాడు. నేనేమైనా మీ ఇంటికి వచ్చానా? ఓ సారీ, మీకు ఇల్లు లేదు కదా. నేను వచ్చింది నా ఆత్మీయులు, శ్రేయోభిలాషులు అయినా కార్తీక్, దీపల కోసం అని మాలిని అంటుంది.
అగ్రిమెంట్ గురించి మాలిని అందరికీ చెప్తుంది. ఇక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.