Karthika Deepam Seetha: తెలుగు రాష్ట్రాల్లో ప్రసారమవుతున్న పాపులర్ సీరియల్స్ లో కార్తీక దీపం 2 ఒకటి. ఈ సీరియల్ రేటింగ్ లో టాప్ లో దూసుకెళ్తోంది. ఈ సీరియల్ లో సుమిత్ర క్యారెక్టర్ తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది సీత. అయితే ఆమె జీవితంలో సీరియల్ ను మించిన కష్టాలున్నాయి. మనసును మెలిపెట్టే ఆ బాధను ఆమె తాజాగా షేర్ చేసుకుంది.
ప్రేమ పెళ్లి

కార్తీక దీపం సీత ఇటీవల మతం మార్చుకుందనే వార్తలు హాట్ టాపిక్ గా మారాయి. ఈ నేపథ్యంలో తన గతం గురించి ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది. తన మాజీ భర్త పెట్టిన బాధలను చెప్పుకొచ్చింది. ‘‘నన్ను ప్రేమిస్తున్నానని చెప్పాడు. పెళ్లి చేసుకుందాం అన్నాడు. ఇల్లు ఈఎంఐ కడుతున్నా, రెండేళ్లు ఆగమని చెప్పా. కానీ ఇంట్లో వాళ్లు మనకు పెళ్లి చేయరని చెప్పేవాడు’’ అని సీత తెలిపింది.
తిరుపతిలో పెళ్లి
‘‘ఇంత పెరిగినా నాకు ఇంకా మెచ్యూరిటీ రాలేదు. ఎవరైనా ఏమన్నా అంటే ఏడ్చేస్తా. కాబట్టి అప్పుడు అతని గురించి చాలా మంది చెడుగా చెప్పినా నేను వినిపించుకోలేదు. అతణ్నే పెళ్లి చేసుకుంటానని ఫిక్స్ అయ్యా. తిరుపతిలో పెళ్లి. పెళ్లికి ముందు అపశకునాలు ఎదురయ్యాయి’’ అని సీత చెప్పుకొచ్చింది.
దేవుడి సంకేతాలు
‘‘పెళ్లి కోసం ఇంట్లో నుంచి వెళ్లేటప్పుడు పవర్ కట్ అయింది. వెళ్తుంటే కారు పంక్చర్ అయింది. పెళ్లి వద్దని దేవుడు సంకేతాలు ఇచ్చినట్లున్నాడు. కానీ నేను పట్టించుకోలేదు. మేం వెళ్లేసరికి లేట్ అయింది. రిజిస్ట్రార్ వెళ్లిపోయాడు. రూమ్ కు వెళ్లిన తర్వాత అమ్మకు ఫిట్స్ వచ్చాయి. కానీ అప్పుడు నేను ఆలోచించలేదు.
పెళ్లికి ముత్తయిదువులు వచ్చి ఆశీర్వదిస్తారు. కానీ నా పెళ్లికి మాత్రం మొగుడు చనిపోయిన వాళ్లు, భర్తను వదిలేసిన వాళ్లే వచ్చారు. నా రాత అంతే అనుకున్నా’’ అని సీత బాధతో తెలిపింది.
ఆస్తి కోసం
{{/usCountry}}పెళ్లికి ముత్తయిదువులు వచ్చి ఆశీర్వదిస్తారు. కానీ నా పెళ్లికి మాత్రం మొగుడు చనిపోయిన వాళ్లు, భర్తను వదిలేసిన వాళ్లే వచ్చారు. నా రాత అంతే అనుకున్నా’’ అని సీత బాధతో తెలిపింది.
ఆస్తి కోసం
{{/usCountry}}‘‘పెళ్లి అయిన రెండో రోజు నుంచే గొడవలు స్టార్ట్ అయ్యాయి. ఆస్తి కోసం చిత్రహింసలు చేశాడు. నేను కొన్న ఇల్లును మా అమ్మ పేరు మీద రాశా. ఆ విషయంలో నన్ను టార్చర్ పెట్టాడు. తాళి తెంపి కొట్టేవాడు. నన్ను బ్యాచిలర్ రూమ్ లో ఉంచాడు. రెండు సార్లు ప్రెగ్నెన్సీ వచ్చింది. కానీ టార్చర్ చేయడంతో కడుపు పోయింది. మా అమ్మ చనిపోయినప్పుడు ఆస్తి రాయించుకొని రమ్మన్నాడు. పెళ్లయిన ఏడేళ్లలో ఎప్పుడూ సంతోషంగా లేను. ఆ తర్వాత విడాకులు తీసుకున్నా’’ అని సీత చెప్పింది.
రెండో పెళ్లి
‘‘నేను రెండో పెళ్లి చేసుకున్నా. ప్రస్తుతం నా భర్త దగ్గర పెద్దగా ఆస్తులు లేవు. కానీ ప్రేమగా చూసుకుంటాడు. నాకు ఇక పిల్లలు కారు’’ అని ఏడుస్తూ సీత చెప్పింది. కార్తీక దీపం 2 సీరియల్ లో సుమిత్రగా అలరిస్తున్న సీత జీవితంలో ఇన్ని కష్టాలు ఉన్నాయా? అని అభిమానులు బాధ వ్యక్తం చేస్తున్నారు.