...
...
Next Story

Malayalam OTT: ఇవాళ రెండు ఓటీటీల్లోకి వచ్చేసిన సునీల్ మలయాళం యాక్షన్ థ్రిల్లర్.. ఏనుగు దంతాల రవాణా.. ఎందుకు చూడాలంటే?

Malayalam OTT: థియేటర్లలో రచ్చ చేసిన మలయాళ రా అండ్ రస్టిక్ యాక్షన్ థ్రిల్లర్ 'కాట్టాలన్' ఓటీటీలోకి వచ్చేసింది. 'మార్కో' అండ్ 'మైఖేల్' సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా తెరకెక్కిన ఈ చిత్రం ఒకేసారి రెండు ఓటీటీల్లో అడుగుపెట్టింది. సునీల్ కీ రోల్ ప్లే చేసిన ఈ థ్రిల్లర్ ను ఎందుకు చూడాలో తెలుసుకోండి.

Published on: Aug 13, 2026, 06:16:19 IST
Advertisement

Malayalam OTT: మే 28న థియేటర్లలో విడుదలై వైలెన్స్ , రా యాక్షన్ సీక్వెన్సులతో ఆకట్టుకున్న మలయాళ చిత్రం ‘కాట్టాలన్’ (Kattalan) ఓటీటీలోకి వచ్చేసింది. థియేట్రికల్ రన్ పూర్తిచేసుకున్న రెండున్నర నెలల తర్వాత ఈ సినిమా ఓటీటీ డిజిటల్ వేదికపైకి అడుగుపెట్టింది.

కాట్టాలన్ ఓటీటీ

ఇవాళ రెండు ఓటీటీల్లోకి వచ్చేసిన సునీల్ మలయాళం యాక్షన్ థ్రిల్లర్.. ఏనుగు దంతాల రవాణా.. ఎందుకు చూడాలంటే?
ఇవాళ రెండు ఓటీటీల్లోకి వచ్చేసిన సునీల్ మలయాళం యాక్షన్ థ్రిల్లర్.. ఏనుగు దంతాల రవాణా.. ఎందుకు చూడాలంటే?

మలయాళ యాక్షన్ థ్రిల్లర్ ‘కాట్టాలన్’ ఎట్టకేలకు ఓటీటీలో అడుగుపెట్టింది. ఇవాళ (ఆగస్టు 13) నుంచి భారతదేశంలో మనోరమా మ్యాక్స్ (ManoramaMax), ఓవర్సీస్ ప్రేక్షకుల కోసం సింప్లీ సౌత్ (Simply South) వేదికగా ప్రసారమవుతోంది. ఈ సినిమాలో తెలుగు కమెడియన్ సునీల్ ఓ కీ రోల్ ప్లే చేశాడు.

అదే ప్లస్

కాట్టాలన్ సినిమాకి ఉన్న అతిపెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే.. ఇది 2019లో వచ్చిన 'మైఖేల్', 2024లో సంచలన విజయం సాధించిన 'మార్కో' (Marco) చిత్రాల సినిమాటిక్ యూనివర్స్ లో భాగం. ఈ యాక్షన్ ప్రపంచంలోకి 'కాట్టాలన్' కథ సరికొత్త పాత్రలను, విలక్షణమైన గ్యాంగ్‌స్టర్ షేడ్స్‌ను పరిచయం చేస్తుంది.

ఏనుగుల వేట

కేరళ - తమిళనాడు అటవీ సరిహద్దుల్లోని 'ఆనకుల్లి' అనే మారుమూల గ్రామం నేపధ్యంలో ఈ కథ సాగుతుంది. ఆ గ్రామస్థులు అడవి ఏనుగుల దాడితో నిత్యం భయంతో బతుకుతుంటారు. ఆ సమయంలో 'మారి' అనే ప్రమాదకరమైన వేటగాడు వచ్చి ఏనుగుల భయం నుంచి ఊరిని కాపాడి అందరి నమ్మకాన్ని గెలుచుకుంటాడు.

రెండు దశాబ్దాల పాటు సాగిన మారి ఆధిపత్యానికి పోటీగా ఎడ్డీ అనే మరో క్రిమినల్ బాస్ రంగంలోకి దిగుతాడు. వారి మధ్య గ్యాంగ్ వార్ మొదలవుతుంది. ఈ క్రమంలో తన నెట్‌వర్క్‌ను మరింత బలోపేతం చేయడానికి జార్జ్ డి పీటర్ పంపిన అత్యంత భయంకరమైన ఫైటర్ ఆంటోనీ అలియాస్ 'కాట్టాలన్' (ఆంటోనీ వర్గీస్) ను మారి తన గ్యాంగ్‌లోకి తీసుకుంటాడు.

హీరో తిరుగుబాటు

మారి నమ్మకాన్ని గెలుచుకుని గ్యాంగ్‌లో కీలక వ్యక్తిగా మారిన ఆంటోనీ.. ఆ తర్వాత మారి చేస్తున్న అక్రమాలు, అమాయక గ్రామస్థులపై జరుగుతున్న హింస చూసి చలించిపోతాడు. ఆ సామ్రాజ్యాన్ని లోపలి నుంచే నాశనం చేయడానికి ఆంటోనీ ఎలాంటి తిరుగుబాటు చేశాడనేదే మిగతా కథ. ముగింపులో వచ్చే 'మైఖేల్ సినిమాటిక్ యూనివర్స్' లింక్ యాక్షన్ ప్రేమికులను విశేషంగా అలరిస్తుంది.

ఎందుకు చూడాలంటే?

పాల్ జార్జ్ దర్శకత్వం వహించిన కాట్టాలన్ చిత్రానికి జోబీ వర్గీస్, జెరో జాకబ్, ఉన్ని ఆర్. రసదయా స్క్రీన్‌ప్లే అందించారు. 'పెపే'గా గుర్తింపు పొందిన ఆంటోనీ వర్గీస్ (Antony Varghese) తన మార్కు వైలెంట్ యాక్షన్‌తో చెలరేగిపోగా, కీలక పాత్రలో టాలీవుడ్ సీనియర్ నటుడు సునీల్ (Sunil), జగదీష్, దుషారా విజయన్, కబీర్ దుహాన్ సింగ్, పార్థ్ తివారీ తమ నటనతో మెప్పించారు. స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ క్యామియోతో మెరిశాడు.

'కేజీఎఫ్', 'సలార్' సినిమాలతో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న రవి బస్రూర్ (Ravi Basrur) ఈ చిత్రానికి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సంగీతం అందించడం సినిమాకి అతిపెద్ద అసెట్‌గా నిలిచింది. రేనాదివ్ సినిమాటోగ్రఫీ అటవీ నేపధ్యాన్ని, యాక్షన్ ఘట్టాలను ఎంతో రిచ్‌గా చూపించింది.

రస్టిక్ యాక్షన్, స్మగ్లింగ్ బ్యాక్‌డ్రాప్, సినిమాటిక్ యూనివర్స్ ఎలిమెంట్స్ కోరుకునే తెలుగు అండ్ సౌత్ ఓటీటీ వీక్షకులకు 'కాట్టాలన్' మనోరమా మ్యాక్స్‌లో ఈ వారం ఒక పర్ఫెక్ట్ మాస్ అండ్ యాక్షన్ వాచ్!

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks