...
...
Next Story

Kavya Anirudh Reception: కావ్య మారన్, అనిరుధ్ రిసెప్షన్-ఒకే ఫ్రేమ్‌లో సీఎం విజయ్, రజినీకాంత్, స్టాలిన్-సోషల్ మీడియా షేక్

Kavya Anirudh Reception: సన్ గ్రూప్ వారసురాలు కావ్య మారన్, రాక్‌స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ వెడ్డింగ్ రిసెప్షన్ ఈ రోజు గ్రాండ్ గా జరిగింది. ఈ సందర్భంగా సీఎం విజయ్, రజినీకాంత్, కళానిధి మారన్, ఎంకే స్టాలిన్ ఒకే దగ్గర ఉన్న ఫొటో నెట్టింట సంచలనం సృష్టిస్తోంది.

Published on: Nov 21, 2026, 21:42:31 IST
Advertisement

Kavya Anirudh Reception: దక్షిణాది సినీ, రాజకీయ, వ్యాపార వర్గాల్లో ఎంతో ఆసక్తిని రేకెత్తించిన కావ్య మారన్, అనిరుధ్ రవిచందర్ వెడ్డింగ్ రిసెప్షన్ ఇవాళ (నవంబర్ 21) గ్రాండ్ గా జరిగింది. ప్రముఖ వ్యాపారవేత్త కళానిధి మారన్ కుమార్తె కావ్య మారన్, సెన్సేషనల్ సంగీత దర్శకుడు అనిరుధ్ ఒక్కటైన శుభసందర్భంగా ఏర్పాటు చేసిన ఈ వేడుక అతిరథ మహారథుల సమక్షంలో అట్టహాసంగా సాగింది.

రెండు రాష్ట్రాల సీఎంలు

కావ్య మారన్, అనిరుధ్ రిసెప్షన్-ఒకే ఫ్రేమ్‌లో సీఎం విజయ్, రజినీకాంత్, స్టాలిన్-సోషల్ మీడియా షేక్
కావ్య మారన్, అనిరుధ్ రిసెప్షన్-ఒకే ఫ్రేమ్‌లో సీఎం విజయ్, రజినీకాంత్, స్టాలిన్-సోషల్ మీడియా షేక్

కావ్య మారన్, అనిరుధ్ రవిచందర్ రిసెప్షన్ వేడుకకు రాజకీయ రంగం నుంచి అగ్ర నేతలు హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తమిళనాడు సీఎం విజయ్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ స్వయంగా విచ్చేసి కావ్య మారన్, అనిరుధ్ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు రాజకీయ వర్గాల్లో ఈ నేతల హాజరు హాట్ టాపిక్‌గా మారింది.

స్టార్ల సందడి

మరోవైపు సినీ పరిశ్రమ నుంచి అగ్ర తారల రాకతో రిసెప్షన్ ప్రాంగణం తారాలోకాన్ని తలపించింది. సూపర్ స్టార్ రజినీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్, రాఘవ లారెన్స్‌తో పాటు పలువురు స్టార్ హీరోలు ఈ వేడుకలో సందడి చేశారు. అలాగే క్రీడా రంగం నుంచి క్రికెటర్ భువనేశ్వర్ తదితరులు హాజరై కొత్త జంటకు ఆశీస్సులు అందించారు.

షేక్ చేస్తున్న ఆ ఒక్క ఫొటో!

కావ్య మారన్, అనిరుధ్ రవిచందర్ గ్రాండ్ రిసెప్షన్‌లో ఎందరో ప్రముఖులు పాల్గొన్నప్పటికీ, ఒకే ఒక్క ఫొటో మాత్రం ఇప్పుడు ఇంటర్నెట్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది. సీఎం విజయ్, సూపర్ స్టార్ రజినీకాంత్, కళానిధి మారన్, ఎంకే స్టాలిన్ నలుగురూ ఒకే దగ్గర నిలబడి ఉన్న ఫొటో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

ఐపీఎల్ మ్యాచ్‌ల ద్వారా సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు యజమానిగా దేశవ్యాప్తంగా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న కావ్య మారన్, తన సంగీతంతో పాన్ ఇండియా స్థాయిలో ఉర్రూతలూగిస్తున్న అనిరుధ్ రవిచందర్ జోడీపై అభిమానుల్లో మొదటి నుంచీ ప్రత్యేక క్రేజ్ ఉంది.

ప్రస్తుతం కావ్య మారన్, అనిరుధ్ వెడ్డింగ్ రిసెప్షన్ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. సినీ, రాజకీయ, క్రీడా రంగాల ప్రముఖులంతా ఒక్కచోట చేరిన ఈ గ్రాండ్ ఈవెంట్ ఈ ఏడాది అత్యంత చర్చనీయాంశమైన సెలబ్రిటీ వేడుకల్లో ఒకటిగా నిలిచిపోయింది.

 

ABOUT THE AUTHOR

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks