సినిమాలో రొమాంటిక్ సీన్లు కామనే. హీరో హీరోయిన్లతో కెమెరా ముందు రొమాన్స్ చేయించి డైరెక్టర్ ఈ సీన్లు రాబడతాడు. కానీ జాతిరత్నాలు సినిమాతో పాపులర్ అయిన డైరెక్టర్ అనుదీప్ మాత్రం దీనికి పూర్తిగా రివర్స్. రొమాన్స్ అంటేనే అతను అన్ కంఫర్ట్ గా ఫీల్ అవుతాడంటా. ఈ విషయాన్ని ఫంకీ మూవీ హీరో విష్వక్ సేన్, హీరోయిన్ కాయదు లోహర్ చెప్పారు.
రొమాన్స్ అంటే

విష్వక్ సేన్, కాయదు లోహర్ జంటగా నటించిన మూవీ ‘ఫంకీ’. దీనికి అనుదీప్ డైరెక్టర్. వాలైంటైన్స్ డే సందర్బంగా ఈ చిత్రం ఫిబ్రవరి 13న రిలీజ్ కానుంది. రీసెంట్ గా మూవీ హీరోహీరోయిన్లు, డైరెక్టర్ తో సుమ ప్రమోషనల్ ఇంటర్వ్యూ నిర్వహించింది. ఇందులో రొమాన్స్ గురించి, అనుదీప్ గురించి కాయదు లోహర్ చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి.
అనుదీప్ అన్ కంఫర్ట్
ఫంకీ సినిమాలో రొమాంటిక్ సీన్ల గురించి సుమ ప్రశ్నించింది. దీనికి విష్వక్ సేన్ వెటకారంగా బదులిచ్చాడు. సినిమాలో రొమాన్స్ సీన్లు లేకపోవడంతో తన కెరీర్ లోనే పీక్స్ అంటూ జోక్ చేశాడు.
‘‘సినిమాలో రొమాన్స్ అయితే పీక్స్ ఉంటుంది. ఎక్స్ ట్రీమ్ అసలు. మా ఇద్దరి కెరీర్లో టాప్ మోస్ట్ రొమాంటిక్ సీన్లు ఉన్నాయి ఈ సినిమాలోనే. హీరో హీరోయిన్ కంటే ముందు ఆయన (అనుదీప్) మానిటర్ దగ్గర అన్ కంఫర్టబుల్ అయిపోతుంటాడు’’ అని విష్వక్ సేన్ నవ్వుతూ చెప్పాడు.
కట్ కట్
రొమాంటిక్ సీన్లు రాశాను కానీ హీరోయిన్ చేయనన్నదని అనుదీప్ సరదాగా చెప్పాడు. అప్పుడు కాయదు లోహర్.. ‘‘మేం రొమాంటిక్ సీన్ చేస్తుంటే చాలు వచ్చి కట్ కట్ చెప్తూనే ఉన్నాడు. కనీసం ఫినిష్ కూడా చేయనివ్వలేదు’’ అని వెల్లడించింది. మా కంటే ఆయనే ఎక్కువ ఇబ్బంది పడ్డాడని విష్వక్ సేన్ తెలిపాడు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ముఖ్యంగా అనుదీప్ రియాక్షన్స్ ఫన్నీగా ఉన్నాయి.
బాయ్స్‌తో ఫ్రెండ్‌షిప్
చిన్నప్పటి నుంచే బాయ్స్‌తో ఫ్రెండ్‌షిప్ వద్దని మమ్మీ చెప్పిందని, ఆ విషయాన్ని ఫాలో అవుతున్నానని ఈ ఇంటర్వ్యూలో కాయదు లోహర్ చెప్పింది. విష్వక్ సేన్, కాయదు లోహర్ జంటగా నటించిన ఫంకీ మూవీకి అనుదీప్ డైరెక్టర్. ఈ సినిమాను సితారా ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. అనుదీప్ స్టైల్లో ఫంకీ మూవీ మరోసారి థియేటర్లలో నవ్వులు పంచేందుకు ఫిబ్రవరి 13న రాబోతుంది. ఇప్పటికే వచ్చిన టీజర్ ఆకట్టుకుంది.
{{/usCountry}}చిన్నప్పటి నుంచే బాయ్స్‌తో ఫ్రెండ్‌షిప్ వద్దని మమ్మీ చెప్పిందని, ఆ విషయాన్ని ఫాలో అవుతున్నానని ఈ ఇంటర్వ్యూలో కాయదు లోహర్ చెప్పింది. విష్వక్ సేన్, కాయదు లోహర్ జంటగా నటించిన ఫంకీ మూవీకి అనుదీప్ డైరెక్టర్. ఈ సినిమాను సితారా ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. అనుదీప్ స్టైల్లో ఫంకీ మూవీ మరోసారి థియేటర్లలో నవ్వులు పంచేందుకు ఫిబ్రవరి 13న రాబోతుంది. ఇప్పటికే వచ్చిన టీజర్ ఆకట్టుకుంది.
{{/usCountry}}