ట్రైలర్ తోనే వివాదానికి ఆజ్యం పోసి, కోర్టు క్లియరెన్స్ తో థియేటర్లలోకి వచ్చిన కేరళ స్టోరీ 2 సినిమాకు షాకింగ్ ఓపెనింగ్ కలెక్షన్లు వచ్చాయి. ఫిబ్రవరి 27న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రాన్ని చూసేవాళ్లే కరవయ్యారు. మరోవైపు కేరళలో ఈ సినిమాను ప్రదర్శిస్తున్న థియేటర్ల ముందు ఆందోళనలు జరుగుతున్నాయి.
కేరళ స్టోరీ 2 మూవీ

కామఖ్య నారాయణ్ సింగ్ దర్శకత్వం వహించిన 'ది కేరళ స్టోరీ 2: గోస్ బియాండ్' మూవీ బాక్సాఫీస్ దగ్గర బొక్కబోర్లా పడింది. సుమారు రూ.30 కోట్ల బడ్జెట్‌తో రూపొందించిన ఈ చిత్రం ఫిబ్రవరి 27న విడుదలైంది. దీనికి విపుల్ అమృత్ లాల్ షా ప్రొడ్యూసర్. ఈ సినిమాకు ఫస్ట్ డే షాకింగ్ కలెక్షన్లు వచ్చాయి. ఈ మూవీని జనాలు పట్టించుకోవడం లేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
కేరళ స్టోరీ 2 కలెక్షన్లు
కేరళ స్టోరీ 2 సినిమాకు ఫస్ట్ డే కలెక్షన్లు దారుణంగా ఉన్నాయి. ట్రేడ్ అనలిస్ట్ వెబ్ సైట్ సక్నిల్క్ ప్రకారం ఈ మూవీ ఫస్ట్ డే రూ.3.5 కోట్ల కలెక్షన్లు మాత్రమే సాధించింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించాలంటే కనీసం రూ.60 కోట్లు వసూలు చేయాలి. 2023లో వచ్చిన బ్లాక్‌బస్టర్ 'ది కేరళ స్టోరీ'కి సీక్వెల్ గా కేరళ స్టోరీ 2 వచ్చింది. కేరళ స్టోరీ మూవీ రిలీజ్ అప్పుడు ఫస్ట్ డే రూ.8.03 కోట్ల వసూళ్లు సాధించింది.
ఆక్యుపెన్సీ అంతంతమాత్రమే
కేరళ స్టోరీ 2 సినిమా ఆక్యుపెన్సీ కూడా అంతంతమాత్రంగానే ఉంది. దేశ వ్యాప్తంగా చాలా థియేటర్లలో సీట్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. నేషనల్ క్యాపిటల్ రీజియన్ (NCR)లో 473 షోలలో 14% ఆక్యుపెన్సీ మాత్రమే నమోదైంది. ముంబైలో 538 షోలతో 8.75% గా ఆక్యుపెన్సీ ఉంది. పూణె 11.25%, హైదరాబాద్ 11.75%, బెంగళూరు 6.75% ఆక్యుపెన్సీ నమోదు చేశాయి.
4 షోలకు 68 టికెట్లు
{{/usCountry}}కేరళ స్టోరీ 2 సినిమా ఆక్యుపెన్సీ కూడా అంతంతమాత్రంగానే ఉంది. దేశ వ్యాప్తంగా చాలా థియేటర్లలో సీట్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. నేషనల్ క్యాపిటల్ రీజియన్ (NCR)లో 473 షోలలో 14% ఆక్యుపెన్సీ మాత్రమే నమోదైంది. ముంబైలో 538 షోలతో 8.75% గా ఆక్యుపెన్సీ ఉంది. పూణె 11.25%, హైదరాబాద్ 11.75%, బెంగళూరు 6.75% ఆక్యుపెన్సీ నమోదు చేశాయి.
4 షోలకు 68 టికెట్లు
{{/usCountry}}బుక్ మై షో డేటా ప్రకారం తిరువనంతపురంలోని లూలూ మాల్‌లోని పీవీఆర్ లో 4 షోలకు కలిపి కేవలం 68 టికెట్లు మాత్రమే బుక్ అయ్యాయి. మరోవైపు డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (DYFI) కార్యకర్తలు 'ది కేరళ స్టోరీ 2' ప్రదర్శిస్తున్న కేరళలోని థియేటర్ల ముందు నిరసనలు చేపట్టారు.
కేరళ రాష్ట్ర ప్రతిష్ఠను ఈ సినిమా దెబ్బతీస్తుందని వాళ్లు వాదిస్తున్నారు. సినిమాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, పోస్టర్లు చింపేస్తున్నారు. దీంతో థియేటర్ల ముందు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.