మేము 15 మందితో 3 గంటల్లో రెడీ చేస్తే జ్యోతి వచ్చి అరగంటలో పూర్తి చేశారు.. హీరోయిన్‌పై కొరియోగ్రాఫర్ రాజ్ కుమార్ ప్రశంసలు
గుప్పెడంత మనసు సీరియల్‌లో జగతిగా అలరించిన బుల్లితెర బ్యూటీ జ్యోతి పూర్వజ్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన సినిమా కిల్లర్. పూర్వజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నుంచి ఇటీవల ఫైర్ అండ్ ఐస్ సాంగ్ లాంచ్ చేశారు. ఈ లాంచ్ ఈవెంట్‌లో హీరోయిన్ జ్యోతి పూర్వజ్‌పై యాక్షన్ కొరియోగ్రాఫర్ రాజ్ కుమార్ ప్రశంసలు కురిపించారు.
బుల్లితెర స్టార్ సీరియల్ గుప్పెడంత మనసు నటి జ్యోతి పూర్వజ్, పూర్వజ్, మనీష్ గిలాడ లీడ్ రోల్స్‌లో నటిస్తున్న సినిమా "కిల్లర్". చంద్రకాంత్ కొల్లు, విశాల్ రాజ్, అర్చన అనంత్, గౌతమ్ చక్రధర్ కొప్పిశెట్టి ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.

పూర్వజ్ దర్శకత్వంలో కిల్లర్
జ్యోతి పూర్వజ్ హీరోయిన్‌గా చేసిన కిల్లర్ సినిమాను థింక్ సినిమా, ఏయూ అండ్ ఐ స్టూడియోస్ బ్యానర్స్‌పై పూర్వజ్, పద్మనాభ రెడ్డి నిర్మిస్తున్నారు. ఉర్వీశ్ పూర్వజ్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. కిల్లర్ మూవీకి పూర్వజ్ దర్శకత్వం వహించారు.
కిల్లర్ ఫైర్ అండ్ ఐస్ సాంగ్ లాంచ్
త్వరలో కిల్లర్ మూవీని గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ఈ క్రమంలో ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల కిల్లర్ మూవీ నుంచి ఫైర్ అండ్ ఐస్ సాంగ్‌ను హైదరాబాద్‌లో రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో హీరోయిన్ జ్యోతి పూర్వజ్‌పై యాక్షన్ కొరియోగ్రాఫర్ రాజ్ కుమార ప్రశంసలు కురిపించారు.
యాక్షన్ కొరియోగ్రాఫర్ ప్రశంసలు
యాక్షన్ కొరియోగ్రాఫర్ రాజ్ కుమార్ మాట్లాడుతూ.. "జ్యోతి గారు తనకు యాక్షన్ తెలియదు అనేవారు. కానీ, మేము 15 మందితో అటాక్ చేసే ఒక యాక్షన్ సీక్వెన్స్ ప్లాన్ చేశాం. ఆ సీక్వెన్స్ రెడీ చేయడానికి మాకు 3 గంటలు టైమ్ పట్టింది. కానీ, జ్యోతి గారు వచ్చి అరగంటలో మొత్తం యాక్షన్ పార్ట్ చేశారు. మేము షాక్ అయ్యాం. ఈ సినిమాలో జ్యోతి గారు చేసిన యాక్షన్ సీక్వెన్సులకు మంచి రెస్పాన్స్ వస్తుంది" అని ప్రశంసించారు.
జ్యోతి కోసమైనా సినిమాను చూడాలి
ఇదే ఈవెంట్‌లో యాక్టర్ విశాల్ రాజ్ మాట్లాడుతూ.. "కిల్లర్ సినిమాలో జ్యోతి పూర్వజ్ గారితో కలిసి నటించడం హ్యాపీగా ఉంది. ఆమె ఈ చిత్రంలో బాగా పర్‌ఫార్మ్ చేశారు. తన కోసమైనా ఈ సినిమాను మీరు చూడాలి" అని అన్నారు.
మనకెంతో ఫ్రీడమ్ ఇస్తారు
"డైరెక్టర్ పూర్వజ్‌తో వర్క్ చేయడం ఏ నటుడికైనా సులువు. మనకెంతో ఫ్రీడమ్ ఇస్తారు. మీతో పాటే నేను ఈ సాంగ్ చూస్తున్నా. డైరెక్టర్ పూర్వజ్ ఇంకా పెద్ద మూవీస్ చేయాలని కోరుకుంటున్నా" అని నటుడు విశాల్ రాజ్ తెలిపారు.
నటుడు కావాలనేది అమ్మ డ్రీమ్
నటుడు గౌతమ్ చక్రధర్ మాట్లాడుతూ.. "నేను యాక్టర్ కావాలనేది మా అమ్మ డ్రీమ్. ఈ సినిమాతో నన్ను తెరపై చూసుకోబోతున్నా. ఈ చిత్రంలో బ్యూటిఫుల్ విజువల్ ఎఫెక్ట్స్, యాక్షన్ పార్ట్స్ ఉంటాయి. వాటి కోసం టీమ్ ఎంత కష్టపడ్డారో మీరు ఊహించుకోవచ్చు. డైరెక్టర్ పూర్వజ్ మనందరికీ నచ్చేలా ఈ సినిమాను రూపొందించారు" అని తెలిపారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


