కింగ్ ఆఫ్ పాప్, లెజండరీ డ్యాన్సర్ మైఖేల్ జాక్సన్ బయోపిక్ ఆధారంగా ఓ సినిమా రాబోతుంది. ‘మైఖేల్’ టైటిల్ తో ఈ మూవీ రిలీజ్ కు రెడీ అవుతోంది. మైఖేల్ జాక్సన్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న అత్యంత ఆసక్తికరమైన బయోపిక్ ఇది. ఈ మూవీ ట్రైలర్ ను తాజాగా రిలీజ్ చేశారు. ఈ బయోపిక్ లో మైఖేల్ జాక్సన్ గా అతని మేనల్లుడు జాఫర్ జాక్సన్ నటిస్తున్నాడు.
మైఖేల్ ట్రైలర్

తన డ్యాన్స్, సాంగ్స్ తో ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన పాప్ స్టార్, దివంగత మైఖేల్ జాన్సన్ బయోపిక్ అంటే వరల్డ్ వైడ్ ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఆయన జీవితంలో బయటకు తెలియని చీకటి రహస్యాలు ఎన్నో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మైఖేల్ మూవీపై ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది. దీంతో మైఖేల్ మూవీ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాకు ఆంటోయిన్ ఫుక్వా డైరెక్టర్.
డెబ్యూ
మైఖేల్ బయోపిక్ సినిమాలో మైఖేల్ జాక్సన్ గా అతని రియల్ లైఫ్ లోని మేనల్లుడు జాఫర్ జాక్సన్ నటిస్తున్నాడు. ఈ సినిమాతో తన ఫీచర్ ఫిల్మ్ డెబ్యూ చేస్తున్నాడు. మైఖేల్ ట్రైలర్ ఐకానిక్ మ్యూజిక్, గూస్ బంప్స్ తెప్పించే డ్యాన్స్, మైఖేల్ జాక్సన్ కెరీర్ గురించి చెబుతోంది. ఈ ట్రైలర్ తో మూవీపై అంచనాలు మరింత పెరిగిపోయాయి.
2019లో అనౌన్స్ మెంట్
మైఖేల్ జాక్సన్ బయోపిక్ మూవీ ఆలస్యమవుతూ వచ్చింది. ఈ ప్రాజెక్ట్ ను 2019లో ప్రకటించారు. రీ షూట్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కారణంగా సినిమా ఆలస్యమైంది. 2025లో రిలీజ్ చేయాలనుకున్నా సాధ్యం కాలేదు. ఇప్పుడు ఏప్రిల్ 24, 2026న థియేటర్లలోకి రానుంది మైఖేల్ మూవీ.
బెర్లిన్ ప్రీమియర్
మైఖేల్ మూవీ రిలీజ్ నేపథ్యంలో లయన్స్ గేట్ ప్రత్యేకంగా ఏప్రిల్ 10, 2026న బెర్లిన్ ప్రీమియర్ ఈవెంట్ నిర్వహించనుంది. దీన్ని మైఖేల్ మూవీ గ్లోబల్ రోల్ అవుట్ ఈవెంట్ లో భాగంగా నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఫ్యాన్స్ కు, మీడియాకు స్పెషల్ స్క్రీనింగ్ వేస్తారు.
ఈ క్యారెక్టర్లు
{{/usCountry}}మైఖేల్ మూవీ రిలీజ్ నేపథ్యంలో లయన్స్ గేట్ ప్రత్యేకంగా ఏప్రిల్ 10, 2026న బెర్లిన్ ప్రీమియర్ ఈవెంట్ నిర్వహించనుంది. దీన్ని మైఖేల్ మూవీ గ్లోబల్ రోల్ అవుట్ ఈవెంట్ లో భాగంగా నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఫ్యాన్స్ కు, మీడియాకు స్పెషల్ స్క్రీనింగ్ వేస్తారు.
ఈ క్యారెక్టర్లు
{{/usCountry}}మైఖేల్ సినిమాలో మైఖేల్ జాక్సన్ గా జాఫర్ జాక్సన్ నటిస్తున్నాడు. మైఖేల్ జాక్సన్ తండ్రిగా కోల్మన్ డోమింగో, తల్లి కేథరీన్ జాక్సన్ గా నియా లాంగ్, మేనేజర్ గా మైల్స్ టెల్లర్ నటిస్తున్నారు. ఇక ట్రైలర్ చూసిన ఫ్యాన్స్ అదిరిపోయిందనే కామెంట్లు పెడుతున్నారు. మైఖేల్ జాక్సన్ ఐకానిక్ మూవ్స్ ను జాఫర్ సరిగ్గా చేశాడనే టాక్ వినిపిస్తోంది. ఈ మూవీ రిలీజ్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నామనే పోస్టులు పెడుతున్నారు.