టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం చివరిగా క, కే ర్యాంప్ సినిమాలతో అలరించాడు. ఇప్పుడు తాజాగా చెన్నై లవ్ స్టోరీ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. శ్రీ గౌరి ప్రియ హీరోయిన్‌గా చేస్తున్న ఈ సినిమాకు రవి నంబూరి దర్శకత్వం వహించారు. నిర్మాత ఎస్‌కేఎన్, డైరెక్టర్ సాయి రాజేష్ ప్రొడ్యూసర్స్‌గా నిర్మించారు.
గుర్తుందా సాంగ్ లాంచ్ ఈవెంట్

పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ సంగీతం అందించిన చెన్నై లవ్ స్టోరీ నుంచి గుర్తుందా సాంగ్ రిలీజ్ చేశారు. ఇందుకోసం హైదరాబాద్‌లో గుర్తుందా సాంగ్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో కిరణ్ అబ్బవరం ఇంట్రెస్టింగ్ విషయాలు తెలిపాడు.
హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. "చెన్నై లవ్ స్టోరీ మూవీ డాల్బీలో చేస్తుండటం సంతోషంగా ఉంది. సినిమా కోసం మా టీమ్ అంతా చాలా ఎఫర్ట్స్ పెడుతున్నారు. ఎడిటర్ సంతోష్ ఒక్కో సీన్ కట్ చేసి చూపిస్తూ, మంచి సజెషన్స్ ఇస్తున్నాడు. అలాగే విశ్వాస్ డీవోపీగా నాతో ట్రావెల్ చేస్తూ వస్తున్నాడు. మనవాళ్లు మనతో సినిమా చేస్తున్నప్పుడు ప్రాజెక్ట్ మీద మరింత నమ్మకం కలుగుతుంటుంది" అని అన్నాడు.
దేవతలా హీరోయిన్ అనిపించాలి
"విజయ్ పొలాకీ మాస్టర్ నాతో మంచి కూల్ స్టెప్స్ చేయించాడు. అనంత శ్రీరామ్ గారు అన్ని సాంగ్స్ బ్యూటిఫుల్‌గా రాశారు. ఈ మూవీలో హీరోయిన్ ఒక దేవతలా అనిపించాలి. అలాంటి నిడివి గల పాత్రలో శ్రీ గౌరి చాలా బాగా పర్‌ఫార్మ్ చేసింది. ఆమె నటన ఎంత బాగుందో త్వరలో స్క్రీన్స్ మీద చూస్తారు" అని కిరణ్ అబ్బవరం తెలిపాడు.
"రవి నంబూరితో వర్క్ చేయడం సంతోషంగా ఉంది. ఆయన రాసిన డైలాగ్స్ నటుడిగా నన్ను మరింత ఎగ్జైట్ చేశాయి. రచయితగా రవి ఈ చిత్రంతో మరింత మంచి పేరు తెచ్చుకుంటాడు. దర్శకుడిగా రవితో నాకు మంచి వేవ్ లెంగ్త్ కుదిరింది" అని చెన్నై లవ్ స్టోరీ దర్శకుడిని ప్రశంసించాడు కిరణ్ అబ్బవరం.
బడ్జెట్ ఎంతని ఆలోచించరు
{{/usCountry}}"రవి నంబూరితో వర్క్ చేయడం సంతోషంగా ఉంది. ఆయన రాసిన డైలాగ్స్ నటుడిగా నన్ను మరింత ఎగ్జైట్ చేశాయి. రచయితగా రవి ఈ చిత్రంతో మరింత మంచి పేరు తెచ్చుకుంటాడు. దర్శకుడిగా రవితో నాకు మంచి వేవ్ లెంగ్త్ కుదిరింది" అని చెన్నై లవ్ స్టోరీ దర్శకుడిని ప్రశంసించాడు కిరణ్ అబ్బవరం.
బడ్జెట్ ఎంతని ఆలోచించరు
{{/usCountry}}"ఎస్‌కేఎన్ గారికి మూవీ అంటే చాలా ప్యాషన్. ఎప్పుడూ హిట్ సినిమా చేయాలనే మాట్లాడుతుంటారు తప్ప బడ్జెట్ ఎంత ఏంటి అని ఆలోచించరు. ఈ ఒక్క పాట కోసం కోటి రూపాయల ఖర్చు చేసి సెట్ వేశారు. ఆయనకు మూవీ పట్ల ఉన్న ప్యాషన్ హీరోగా నన్ను చాలా ఎగ్జైట్, ఇన్స్‌పైర్ చేసింది. నన్ను ఎంతో బాగా చూసుకున్నారు" అని నిర్మాతను పొగిడాడు కిరణ్ అబ్బవరం.
"సాయి రాజేశ్ గారు కథ చెప్పినప్పుడే ఈ సినిమా బలంగా ఉండబోతోందని అర్థమైంది. రాజా వారు రాణి గారు తర్వాత నేను ఈ సినిమాలో సెటిల్డ్‌గా ఉండే క్యారెక్టర్ చేస్తున్నా. సాయి రాజేశ్ గారు ఉంటే మనం పూర్తి నమ్మకంతో ఉండొచ్చు అని అర్థమైంది. ఈ రోజు మా మూవీ ప్రమోషన్ కంటెంట్‌కు వస్తున్న రెస్పాన్స్, సినిమా మీద ఏర్పడిన క్రేజ్, మా మూవీ గురించి అందరూ మాట్లాడుకోవడం సంతోషంగా ఉంది" అని హీరో ఆనందం వ్యక్తం చేశాడు.
థియేటర్స్‌లో మ్యాజిక్ కాన్సర్ట్ అయినట్లు
"మణిశర్మ గారు ఏడు పాటలు కంపోజ్ చేశారు. ఏడు పాటల్ని మీరు థియేటర్స్‌లో సెలబ్రేట్ చేసుకుంటారు. మా మూవీ రిలీజ్ అయిన రోజు థియేటర్స్‌లో మ్యూజిక్ కాన్సర్ట్ అయినట్లు ఉంటుంది. ఇండియన్ సినిమా గ్రేటెస్ట్ లవ్ స్టోరీస్‌లో ఒకటిగా చెన్నై లవ్ స్టోరీ మూవీ మీకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది" అని ధీమాగా చెప్పాడు హీరో కిరణ్ అబ్బవరం.