...
...
Next Story

2 రోజుల్లో 11 కోట్లకుపైగా కె ర్యాంప్ కలెక్షన్స్.. 52 శాతం రికవరీ.. డే బై డే పెరుగుతున్న కిరణ్ అబ్బవరం మూవీ వసూళ్లు

హీరో కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ రొమాంటిక్ కామెడీ యాక్షన్ థ్రిల్లర్ సినిమా కె ర్యాంప్. డైరెక్టర్ జైన్స్ నాని దర్శకత్వం వహించిన కె ర్యాంప్ సినిమా అక్టోబర్ 18న థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఈ క్రమంలో రెండు రోజుల్లో కె ర్యాంప్ సినిమా కలెక్షన్స్ ఎంతో ఇక్కడ లుక్కేద్దాం.

Published on: Oct 20, 2025, 14:10:19 IST
Advertisement

సక్సెస్‌ఫుల్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ రొమాంటిక్ కామెడీ యాక్షన్ థ్రిల్లర్ సినిమా కె ర్యాంప్. అక్టోబర్ 18న విడుదలైన కె ర్యాంప్ మూవీ బ్లాక్ బస్టర్ జర్నీ కంటిన్యూ చేస్తోంది. ఈ దీపావళికి రిలీజైన చిత్రాల్లో కాస్తా మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద మాత్రం సత్తా చాటుతోంది.

డే బై డే కలెక్షన్స్ పెంచుకుంటూ

2 రోజుల్లో 11 కోట్లకుపైగా కె ర్యాంప్ కలెక్షన్స్.. 52 శాతం రికవరీ.. డే బై డే పెరుగుతున్న కిరణ్ అబ్బవరం మూవీ వసూళ్లు
2 రోజుల్లో 11 కోట్లకుపైగా కె ర్యాంప్ కలెక్షన్స్.. 52 శాతం రికవరీ.. డే బై డే పెరుగుతున్న కిరణ్ అబ్బవరం మూవీ వసూళ్లు

డైరెక్టర్ జైన్స్ నాని దర్శకత్వం వహించిన కె ర్యాంప్ సినిమా ఛాంపియన్‌గా నిలిచి డే బై డే కలెక్షన్స్ పెంచుకుంటూ వెళ్తోంది. మొదటి రోజును మించిన వసూళ్లు రెండో రోజు ఈ సినిమాకు దక్కాయి. రెండు రోజుల్లో కె ర్యాంప్ మూవీ ప్రపంచవ్యాప్తంగా 11.3 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు దక్కించుకుందని నిర్మాతలు పేర్కొన్నారు.

కిరణ్ అబ్బవరం టూర్ వల్ల

రెండు రోజుల కలెక్షన్స్‌తోనే కె ర్యాంప్ మూవీ 50 శాతం వసూళ్లు రికవరీ చేసినట్లు ట్రాక్ టాలీవుడ్ సైట్ పేర్కోంది. కె ర్యాంప్ సినిమాను ప్రేక్షకుల దగ్గరకు రీచ్ చేయడంలో హీరో కిరణ్ అబ్బవరం సక్సెస్ అయ్యారు. ఆయన చేసిన టూర్స్ వల్ల మూవీపై క్రేజ్ ఏర్పడింది. మాస్, యూత్, ఫ్యామిలీ ప్రేక్షకులు "K-ర్యాంప్" సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు. బీ, సీ సెంటర్స్‌లో మంచి కలెక్షన్స్ రాబడుతోందీ ఈ మూవీ.

రివ్యూస్‌తో సంబంధం లేకుండా

కె ర్యాంప్ సినిమాకు క్రిటిక్స్ నుంచి వచ్చిన రివ్యూస్‌కు ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద వస్తున్న కలెక్షన్స్‌కు ఏమాత్రం పొంతన లేదు. రివ్యూస్‌తో సంబంధం లేకుండా అన్ని వర్గాల ఆడియెన్స్ ఆదరణతో డీసెంట్ కలెక్షన్స్ సాధిస్తోంది కె ర్యాంప్ చిత్రం.

హీరోయిన్‌గా యుక్తి తరేజా

ఇతర కీలక పాత్రల్లో వీకే నరేష్, సాయికుమార్, వెన్నెల కిషోర్, మురళీధర్ గౌడ్ తమ నటనతో ఆకట్టుకున్నారు. రిచెస్ట్ చిల్లర్ గాయ్ క్యారెక్టర్‌లో కిరణ్ అబ్బవరం చేసిన పర్‌ఫార్మెన్స్ కె ర్యాంప్ సినిమాకు హైలెట్‌గా నిలుస్తోంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe