...
...
Next Story

థియేట‌ర్లో ఆడియ‌న్స్‌తో క‌లిసి ర‌చ్చ చేసిన కిర‌ణ్ అబ్బ‌వ‌రం-కె ర్యాంప్ పాట‌కు డ్యాన్స్‌-వేరే లెవల్- వీడియో వైర‌ల్‌

కె ర్యాంప్ సక్సెన్ ను ఎంజాయ్ చేస్తున్నాడు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం. ఈ రొమాంటిక్ కామెడీ మూవీ క్రమంగా పుంజుకుంటోంది. ఈ నేపథ్యంలో థియేటర్లకు వెళ్లి ఆడియన్స్ ను డైరెక్ట్ గా కలుస్తున్నాడు కిరణ్. ఇలా థియేటర్లో అతను డ్యాన్స్ చేసిన వీడియో వైరల్ గా మారింది.

Published on: Oct 20, 2025, 08:43:34 IST
Advertisement

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ఫుల్ జోష్ లో ఉన్నాడు. అతని లేటెస్ట్ రొమాంటిక్ కామెడీ మూవీ ‘కె ర్యాంప్’ క్రమంగా కలెక్షన్లు పెంచుకుంటూ పోతోంది. ఈ మూవీకి పాజిటివ్ టాక్ కూడా పెరుగుతోంది. ఈ క్రమంలోనే థియేటర్లకు వెళ్లి ఆడియన్స్ ను ఈ మూవీ సక్సెస్ ను సెలబ్రేట్ చేసుకుంటున్నాడు కిరణ్ అబ్బవరం.

ఆడియన్స్ తో సెలబ్రేషన్స్

థియేటర్లో డ్యాన్స్ చేస్తున్న కిరణ్ అబ్బవరం (instagram-Kiran Abbavaram)
థియేటర్లో డ్యాన్స్ చేస్తున్న కిరణ్ అబ్బవరం (instagram-Kiran Abbavaram)

దీపావళి పండగ సందర్భంగా అక్టోబర్ 18న థియేటర్లలో రిలీజైంది కె ర్యాంప్. మొదట మిక్స్ డ్ టాక్ వచ్చినా ఈ మూవీ క్రమంగా పుంజుకుంటోంది. ఇందులో కిరణ్ అబ్బవరం, యుక్తి తరేజా, నరేష్ వీకే, సాయి కుమార్ తదితరులు నటించారు. ఈ సినిమా సక్సెస్ ను ఆడియన్స్ తో సెలబ్రేట్ చేసుకునేందుకు కిరణ్ అబ్బవరం థియేటర్ల బాట పట్టాడు.

థియేటర్లో డ్యాన్స్

కె ర్యాంప్ సక్సెస్ సెలబ్రేషన్స్ లో భాగంగా ఓ థియేటర్లో కిరణ్ అబ్బవరం డ్యాన్స్ చేసిన వీడియో వైరల్ గా మారింది. ఆడియన్స్ మధ్యలో నిలబడి వాళ్లతో కలిసి స్టెప్పులేశాడు కిరణ్. ఈ వీడియో ను తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లో పోస్టు చేశాడు. వీడియోపై ‘‘మీరు ఇచ్చిన సక్సెస్ మీతో సెలబ్రేట్ చేసుకుంటుంటే’’ అని ఫైర్ ఎమోజీలు పెట్టాడు. ‘‘వేరే లెవల్ ఫీలింగ్. ప్రతి ఒక్కరికీ థ్యాంక్ యూ’’ అని క్యాప్షన్ తో ఈ వీడియోను పోస్టు చేశాడు.

రొమాంటిక్ కామెడీ

రిచ్ ఫ్యామిలీకి చెందిన బలాదూర్ కుమార్ అబ్బవరం (కిరణ్ అబ్బవరం). తండ్రి (సాయి కుమార్) గారాబంతో చదువును పక్కనపెట్టి ఫ్రెండ్స్ తో కలిసి ఎంజాయ్ చేస్తుంటాడు. కానీ కొడుకును మార్చాలని ప్రయత్నించిన తండ్రి ఓ పండితుడు సలహాతో కేరళలోని కాలేజీలో జాయిన్ చేస్తాడు. కానీ అక్కడికి వెళ్లినా కుమార్ లో మార్పు రాదు. అక్కడ కాలేజీలో మెర్సీ జాయ్ (యుక్తి తరేజా)ని ప్రేమిస్తాడు. కానీ మెర్సీకి ఓ ప్రాబ్లెం ఉందని తెలుస్తుంది. మరి తర్వాత ఏం జరిగిందన్నదే కె ర్యాంప్ మూవీ.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks