...
...
Next Story

Mega Family: కొణిదెల పవన్ తేజ్ హీరోగా జంట-టైటిల్, ఫస్ట్ లుక్ లాంచ్- మెగా ఫ్యామిలీలో మరో పెద్ద హీరోగా పేరు తెచ్చుకోవాలని!

Konidela Pavan Tej Janta Title First Look Launch: మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన మరో కొత్త హీరో కొణిదెల పవన్ తేజ్. అతను హీరోగా నటిస్తోన్న రెండో సినిమా జంట. తాజాగా జంట మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ లాంచ్‌ను అమలాపురంలో గ్రాండ్‌గా లాంచ్ చేశారు. ఆ విశేషాలపై లుక్కేద్దాం.

Published on: Nov 16, 2026, 13:16:51 IST
Advertisement

Konidela Pavan Tej Janta Title First Look Launch: మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన మరో హీరో కొణిదెల పవన్ తేజ్. చిరంజీవి కజిన్ సోదరుడు (బాబాయ్ లేదా పెదనాన్న కుమారుడు) సూర్య ప్రకాష్ రావు కొడుకు కొణిదెల పవన్ తేజ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా "జంట". ఈ చిత్రంలో పాడిని కుమార్ హీరోయిన్‌గా నటిస్తోంది.

రూరల్ బ్యాక్ డ్రాప్‌లో

కొణిదెల పవన్ తేజ్ హీరోగా జంట-టైటిల్, ఫస్ట్ లుక్ లాంచ్- మెగా ఫ్యామిలీలో మరో పెద్ద హీరోగా పేరు తెచ్చుకోవాలని!
కొణిదెల పవన్ తేజ్ హీరోగా జంట-టైటిల్, ఫస్ట్ లుక్ లాంచ్- మెగా ఫ్యామిలీలో మరో పెద్ద హీరోగా పేరు తెచ్చుకోవాలని!

జంట సినిమాను వసుంధర ఆర్ట్స్ బ్యానర్‌పై రాజేష్ గునిశెట్టి, వీరు యాదవ్ నిర్మిస్తున్నారు. రూరల్ బ్యాక్ డ్రాప్‌లో సాగే ఒక యూనిక్ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు రాజశేఖర్ యాదవ్ రూపొందిస్తున్నారు. తాజాగా నవంబర్ 15న జంట మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ లాంఛ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి మెట్ల రమణబాబు, అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి మెట్ల రమణబాబు మాట్లాడుతూ.. "ఇక్కడ దసరా బుల్లోడు సినిమా నుంచి ఎన్నో మూవీస్ షూటింగ్స్ జరుపుకున్నాయి. జంట సినిమా చిత్రీకరణకు ఈ ప్రాంతాన్ని ఎంచుకోవడం సంతోషంగా ఉంది. కొణిదెల పవన్ తేజ్‌కు హీరోగా ఇది రెండో సినిమా. జంట సినిమాతో కొణిదెల పవన్ తేజ్ మెగా ఫ్యామిలీలో మరో పెద్ద హీరోగా పేరు తెచ్చుకోవాలి. ఈ సినిమా టీమ్ అందరికీ నా బెస్ట్ విషెస్ అందిస్తున్నా" అని అన్నారు.

2 నెలలు అమలాపురంలో

డీవోపీ రాహుల్ శ్రీ వాస్తవ్ మాట్లాడుతూ.. "రెండు నెలల అమలాపురంలో షూటింగ్ చేయబోతున్నాం. మీ అందరి సపోర్ట్ మా సినిమా షూటింగ్‌కు కావాలి. మా డైరెక్టర్ నాపై నమ్మకంతో ఈ సినిమాలో తీసుకున్నారు. ఆయన నమ్మకాన్ని నిలబెట్టుకునేలా కష్టపడతాం" అని తెలిపారు.

అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు మాట్లాడుతూ.. "ఆహ్లాదకర వాతావరణానికి నెలవైన అమలాపురంలో జంట సినిమా షూటింగ్ ప్రారంభం కావడం సంతోషంగా ఉంది. ఈ సినిమా టీమ్ అందరికీ నా బెస్ట్ విషెస్ అందిస్తున్నా" అని అన్నారు.

"స్థానికంగా మరిన్ని సినిమాలు షూటింగ్స్ జరగాలి. అప్పుడే ఇక్కడ వారికి ఉపాధి, ఆదాయం లభిస్తాయి. హైదరాబాద్‌లో సినిమా స్టూడియోస్‌లా, ఇక్కడ ఉన్న లొకేషన్స్‌తో నేచర్ స్టూడియో ఉందని చెప్పుకోవచ్చు. జంట సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా" అని ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు ఆకాంక్షించారు.

మరొకరు డీల్ చేయలేరు

ప్రొడ్యూసర్ రాజేష్ గునిశెట్టి మాట్లాడుతూ.. "ఈ సినిమా కోసం రెండేళ్లుగా వర్క్ చేసుకుంటున్నాం. మా సినిమా కంటెంట్‌కు తగినట్లు అమలాపురంలోని లొకేషన్స్ యాప్ట్ అవుతాయని అనిపించి ఇక్కడికి వచ్చాం. అమలాపురం నుంచి వచ్చిన ప్రొడ్యూసర్స్‌గా మా సినిమా ఇక్కడ స్థానికంగా షూటింగ్ జరుపుకోవడం సంతోషంగా ఉంది" అని అన్నారు.

"ఈ స్క్రిప్ట్‌ను మా డైరెక్టర్ రాజశేఖర్ తప్పితే మరొకరు డీల్ చేయలేరు. ఆయన వల్లే ఈ సినిమా ఇక్కడిదాకా వచ్చింది. ఈ సినిమాతో ఒక యూనిక్, క్రియేటివ్ డైరెక్టర్ టాలీవుడ్‌కు రాబోతున్నాడని చెప్పగలను. ఈ సినిమా మంచి విజయం సాధిస్తుంది. ఈ మూవీకి వర్క్ చేసిన వాళ్లంతా గర్వంగా ఫీలవుతారు" అని చెప్పుకొచ్చారు నిర్మాత రాజేష్ గునిశెట్టి.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks