Mailurai: నిర్మాతగా శ్రీ హన్సిక పెద్దిరెడ్డి- నాగబాబుతో మైలురాయి టైటిల్ లాంచ్- స్వప్న, ప్రియాంక, నిహారిక కొణిదెల తరహాలో!
Sri Hansika Peddireddy Mailurai Title Launch By Nagababu: తెలుగు సినీ ఇండస్ట్రీలోకి నిర్మాతగా మరో మహిళ రానుంది. శ్రీ హన్సిక పెద్దిరెడ్డి ప్రొడ్యూసర్‌గా వేసిన తొలి అడుగు మైలురాయి. తాజాగా మైలురాయి టైటిల్ లాంచ్ పోస్టర్‌ను నాగబాబు విడుదల చేశారు. ఈ సందర్భంగా నాగబాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
Sri Hansika Peddireddy Mailurai Title Launch By Nagababu: హన్సి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం. 1గా శ్రీ హన్సిక పెద్దిరెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘మైలురాయి’. తవిటిరాజు తలచింతల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి టాలెంటెడ్ డైరెక్టర్ రఘువర్ధన్ కోట్ల దర్శకత్వం వహిస్తున్నారు.

మైలురాయి సినిమా నటీనటులు
యువ నటీనటులు జగన్ యోగిరాజు, నవ్య చిట్యాల హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. వీరితో పాటు సీనియర్ నటుడు దేవీ ప్రసాద్ కీలక పాత్రలో కనిపించనున్నారు. లక్ష్మణ్ మీసాల, పవన్ రమేష్, సునందిని, అంజు వాల్గుమన్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
నాగబాబుతో మైలురాయి టైటిల్ లాంచ్ రిలీజ్
తాజాగా మైలురాయి మూవీ టైటిల్ లాంచ్ పోస్టర్‌ను సీనియర్ నటుడు, నిర్మాత, ఏపీ శాసనమండలి సభ్యుడు, ఏపీ గ్రీన్ ఛైర్మన్ నాగబాబు విడుదల చేశారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ.. "ఈ సినిమా టైటిల్ ‘మైలురాయి’ చాలా ఆసక్తికరంగా ఉంది. నిర్మాత హన్సిక మంచి సినిమాతో తన కెరీర్‌ను ప్రారంభించారు. ఔత్సాహిక దర్శకుడు, యువ హీరోతో ఈ చిత్రాన్ని రూపొందించడం అభినందనీయం" అని అన్నారు.
అశ్వనీదత్, నా కుమార్తెల్లాగా
"ఫిల్మ్ మేకింగ్‌లో మహిళలకు ఉండే బాధ్యత, క్రమశిక్షణ ఎంతో గొప్పవి. ఇప్పటికే అశ్వనీదత్ గారి కుమార్తెలు స్వప్న దత్, ప్రియాంక దత్, నా కుమార్తె నిహారిక, సుప్రియ యార్లగడ్డ వంటి వారు చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. హన్సిక కూడా వారి బాటలోనే పయనిస్తూ మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను. ఈ చిత్ర బృందంలోని ప్రతి ఒక్కరికీ నా శుభాకాంక్షలు" అని నాగబాబు తెలిపారు.
పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు
నిర్మాత శ్రీ హన్సిక పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. "మా హన్సి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం. 1గా రూపొందుతున్న ‘మైలురాయి’ టైటిల్ లాంచ్ పోస్టర్‌ను నాగబాబు గారి చేతుల మీదుగా విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే టీజర్, పాటలను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం" అని వెల్లడించారు.
లవ్ అండ్ ఫ్యామిలీ డ్రామాగా
సహ నిర్మాత తవిటిరాజు తలచింతల మాట్లాడుతూ.. ‘మైలురాయి’ చిత్రాన్ని లవ్ అండ్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిస్తున్నామని తెలిపారు. ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ను విడుదల చేసిన నాగబాబు గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.
ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేసేలా ఉంటుంది
హీరో జగన్ యోగిరాజు మాట్లాడుతూ.. "ఈ సినిమాలో హీరోగా నటించడం చాలా సంతోషంగా ఉంది. సినిమా షూటింగ్ పూర్తయింది. నాగబాబు గారు విడుదల చేసిన టైటిల్ పోస్టర్‌కు మంచి స్పందన వస్తోంది. త్వరలోనే టీజర్, పాటలు, ట్రైలర్‌ను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాం. ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేసేలా ఈ సినిమా ఉంటుంది" అని చెప్పుకొచ్చారు.
భావోద్వేగాలతో కూడిన ప్రేమకథ
"హన్సి ప్రొడక్షన్స్ ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతుండటం ఆనందంగా ఉంది. ‘మైలురాయి’ భావోద్వేగాలతో కూడిన ప్రేమకథ. అన్ని వర్గాల ప్రేక్షకులకు ఈ చిత్రం కచ్చితంగా నచ్చుతుందని భావిస్తున్నాను" అని డైరెక్టర్ రఘువర్ధన్ కోట ఆశాభావం వ్యక్తం చేశారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


