Niharika Konidela: జేడీ చక్రవర్తితో నిహారిక కొణిదెల కొత్త సినిమా పాకెట్ రాకెట్స్.. కథ కూడా చెప్పేసిన మేకర్స్

Niharika Konidela Pocket Rockets JD Chakravarthy: మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మిస్తున్న కొత్త చిత్రం 'పాకెట్ రాకెట్స్' అధికారికంగా షూటింగ్ పూర్తయింది. రుద్ర ఆత్రి దర్శకత్వంలో వహిస్తున్న ఈ అర్బన్ డ్రామాలో జేడీ చక్రవర్తి కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

Published on: Oct 29, 2026, 12:29:01 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Niharika Konidela Pocket Rockets JD Chakravarthy: మెగా డాటర్ నిహారిక కొణిదెల నేతృత్వంలోని పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, మాక్సిమం సిటీ స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న నూతన చిత్రం ‘పాకెట్ రాకెట్స్’. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన నిర్మాణం నుంచి వస్తున్న తదుపరి చిత్రం కావడంతో టాలీవుడ్‌లో ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తి నెలకొంది.

జేడీ చక్రవర్తితో నిహారిక కొణిదెల కొత్త సినిమా పాకెట్ రాకెట్స్.. కథ కూడా చెప్పేసిన మేకర్స్
జేడీ చక్రవర్తితో నిహారిక కొణిదెల కొత్త సినిమా పాకెట్ రాకెట్స్.. కథ కూడా చెప్పేసిన మేకర్స్

అర్బన్ డ్రామాగా పాకెట్ రాకెట్స్

పాకెట్ రాకెట్స్ సినిమాకు రుద్ర ఆత్రి రచన, దర్శకత్వం వహిస్తున్నారు. అర్బన్ డ్రామాగా తెరకెక్కుతోన్న పాకెట్ రాకెట్స్ సినిమా షూటింగ్ ప్రక్రియ పూర్తి చేసుకుని, ప్రస్తుతం నిర్మాణానంతర (పోస్ట్ ప్రొడక్షన్) పనుల్లో శరవేగంగా ముందుకుసాగుతోంది.

పాకెట్ రాకెట్స్ చిత్రంలో 'కమిటీ కుర్రోళ్లు' ఫేమ్ త్రినాథ్ వర్మ, నూతన నటుడు నిర్మల్ కథానాయకులుగా నటిస్తుండగా, 'శుభం' ఫేమ్ శ్రియా కొంతం కథానాయికగా అలరించనుంది. వర్ధమాన నటీనటులతో పాటు సీనియర్ నటుడు జేడీ చక్రవర్తి ఒక కీలక పాత్రలో కనిపించనుండటం ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా మారింది. .

పేదరికం, ఆశయం.. మధ్యలో ప్రమాదకరమైన జూదం!

జేడీ చక్రవర్తి నటనానుభవం వెండితెరపై సరికొత్త ఎనర్జీని తీసుకువస్తుందని చిత్రబృందం నమ్ముతోంది. 'పాకెట్ రాకెట్స్' కథాంశం ఒక పేద కుటుంబానికి చెందిన ప్రతిభావంతుడైన విద్యార్థి చుట్టూ తిరుగుతుంది. విదేశాల్లో చదువుకోవాలనే బలమైన కోరిక ఉన్నప్పటికీ, ఆర్థిక స్థోమత లేకపోవడం అతడికి పెద్ద అవరోధంగా మారుతుంది.

ఆశయాన్ని నెరవేర్చుకోవడానికి సులువైన మార్గంగా జూదాన్ని ఎంచుకుంటాడు ఆ విద్యార్థి. ఆ క్రమంలో ఒక క్రూరమైన, మాయగాడైన జూదం ముఠా నాయకుడి కంటపడతాడు. అక్కడి నుంచి అతడి జీవితం ఎలా మలుపు తిరిగింది? కష్టపడి సాధించాల్సిన భవిష్యత్తు కోసం ఎంచుకున్న తప్పుడు దారి అతడిని ఎలాంటి ప్రమాదంలోకి నెట్టింది? అనే కోణంలో తీవ్ర ఉత్కంఠభరితంగా సాగుతుంది.

బలమైన సాంకేతిక బృందం

ఒక మంచి జీవితం కోసం విలువలను పణంగా పెట్టాల్సి వస్తే పరిణామాలు ఎలా ఉంటాయో చూపే అర్బన్ థ్రిల్లర్‌గా పాకెట్ రాకెట్స్ చిత్రాన్ని మలిచారు. ఈ చిత్రాన్ని పద్మజ కొణిదెల, రాహుల్ రాఘవేంద్ర, రాహుల్ నిమ్మకూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రమేష్ మాన్యం ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.

సాంకేతిక విభాగంలో ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. ఎడురోలు రాజు ఛాయాగ్రహణం సమకూరుస్తుండగా, జ్ఞాని సంగీతాన్ని ఇస్తున్నారు. అన్వర్ అలీ ఎడిటింగ్‌, విష్ణు వర్ధన్ పుల్లా ప్రొడక్షన్ డిజైన్‌ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. రాజేష్ లంక స్టంట్ మాస్టర్‌గా, జేడీ కొరియోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు.

'కమిటీ కుర్రోళ్లు' విజయం తర్వాత మరో ప్రయత్నం

పబ్లిసిటీ బాధ్యతలను బియాండ్ మీడియాకు చెందిన ఎస్.కె. నాయుడు, ఫణి కందుకూరి చూసుకుంటున్నారు. యదు వంశీ దర్శకత్వంలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ నిర్మించిన 'కమిటీ కుర్రోళ్లు' చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడమే కాకుండా 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ అవార్డును గెలుచుకుంది.

డిజిటల్ కంటెంట్ నుంచి

ఓటీటీ సిరీస్‌లు, డిజిటల్ కంటెంట్ నుంచి వెండితెరకు ప్రయాణమైన పింక్ ఎలిఫెంట్ సంస్థకు ఈ అవార్డు ఒక మైలురాయిగా నిలిచింది. ఆ వరుస విజయాన్ని కొనసాగిస్తూ ఇప్పుడు 'పాకెట్ రాకెట్స్' మూవీతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. త్వరలోనే విడుదల తేదీ, ఇతర వివరాలను మేకర్స్ అధికారికంగా ప్రకటించనున్నారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More