Ott Thriller: ఓటీటీలోకి డైరెక్ట్‌గా సైకలాజికల్ థ్రిల్లర్.. సినిమాల్లో హోమోసెక్సువల్ పాత్రలపై నటి సంచలన వ్యాఖ్యలు
Ott Thriller: బాలీవుడ్ నటి కొంకణ సేన్ శర్మ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆమె నటించిన సైకలాజికల్ థ్రిల్లర్ ఆక్యూజ్ట్ మూవీ డైరెక్ట్ గా ఓటీటీలోకి రానుంది. ఈ నేపథ్యంలో సినిమాల్లో హోమోసెక్సువల్ క్యారెక్టర్లపై కొంకణ బోల్డ్ కామెంట్లు చేసింది.
హోమోసెక్సువల్ (స్వలింగ సంపర్కం) గురించి, సినిమాల్లో దీనికి సంబంధించిన క్యారెక్టర్ల గురించి బాలీవుడ్ నటి కొంకణ సేన్ శర్మ హాట్ కామెంట్లు చేసింది. మన సినిమాలు ఎప్పుడూ ఒకే మూసలో సాగుతాయని, సమస్య ఉంటే తప్పా హోమోసెక్సువల్ క్యారెక్టర్లను చూపించరని కొంకణ సంచలన వ్యాఖ్యలు చేసింది.

ఓటీటీలోకి సైకలాజికల్ థ్రిల్లర్
కొంకణ సేన్ శర్మ, ప్రతిభా రాంటా ప్రధాన పాత్రలు పోషించిన సైకలాజికల్ థ్రిల్లర్ ‘అక్యూజ్ట్’ మూవీ డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ కానుంది. ఈ సినిమా పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఫిబ్రవరి 27న నేరుగా డిజిటల్ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో కొంకణ సేన్ చేసిన కామెంట్లు తెగ వైరల్ గా మారాయి.
హోమోసెక్సువల్
అక్యూజ్డ్ రిలీజ్ కోసం బాలీవుడ్ నటి కొంకణ సేన్ శర్మ రెడీ అయింది. ఈ మూవీలో ఆమె లండన్ కు చెందిన డాక్టర్ గా నటించింది. మరో మహిళ (ప్రతిభా రాంటా)తో ఆమె లవ్ లో పడుతుంది. ఈ సినిమాలో హోమోసెక్సువల్ కపుల్ గా వీళ్లు నటించారు. మరోవైపు ఆమె పని చేసే చోట లైంగింక వేధింపులకు పాల్పడే వ్యక్తిగా కొంకణ సేన్ శర్మ క్యారెక్టర్ పై ఆరోపణలు వస్తాయి.
కొంకణ కామెంట్లు
"సినిమాల్లో హోమోసెక్సువల్ (స్వలింగ సంపర్క) పాత్రలను మనం ఒక సమస్యగానే చూపిస్తాం. అంతే కానీ వాటిని జనరల్ గా అన్ని క్యారెక్టర్లలాగానే సాధారణంగా ఉంచడం లేదు. ఇంకా కొన్ని దశాబ్దాల కిందటి లాగే వాళ్లను హేళన చేస్తూ, అవమానిస్తూ కామెడీ ట్రాక్ లు సినిమాల్లో పెడుతున్నారు. దివ్యాంగులను కూడా వాళ్ల సమస్యలను చూపించడం కోసమే సినిమాల్లో క్యారెక్టర్లు క్రియేట్ చేస్తారు. కానీ అందరిలాగే కామన్ గా చూపించాలనుకోరు’’ అని కొంకణ సేన్ పేర్కొంది.
ఒకే మూసలో
‘‘మన సినిమా ప్రపంచం వైవిధ్యంగా ఉండటం లేదు. ఎప్పుడూ ఒకే మూసలో సాగుతోంది. ఎప్పుడూ స్ట్రెయిట్, పురుషుడు, హిందీ మాట్లాడేవారి చుట్టూనే సినిమాలు తిరుగుతున్నాయి. కానీ మా సినిమాలో హోమోసెక్సువల్ ను ఒక సమస్యగా చూపించలేదు’’ అని కొంకణ సేన్ తెలిపింది.
నేచురల్ గా
అక్యూజ్ట్ మూవీలో ప్రధాన పాత్ర పోషించిన మరో నటి ప్రతిభా రాంటా మాట్లాడుతూ.. ‘‘స్క్రిప్ట్ చదివేటప్పుడే ఇవి (హోమోసెక్సువల్) మామూలు జంటలాగే అనిపించాయి. అవును ఇది స్వలింగ సంపర్క జంట పాత్రలే. కానీ అది ఎక్కడా అతిగా అనిపించదు. పరిస్థితులు చాలా వాస్తవికంగా ఉంటాయి. నమ్మకం కోల్పోవడం, తన భాగస్వామి కోసం ఏ స్థాయికైనా వెళ్లడం వంటివి చాలా నేచురల్ గా ఉంటాయి’’ అని చెప్పింది.
అక్యూజ్డ్ గురించి..
అక్యూజ్ట్ ట్రైలర్ ప్రకారం.. ఈ సినిమాలో గీతిక (కొంకణ), మీరా (ప్రతిభ)ల హోమోసెక్సువల్ సంబంధంపై అన్ని వైపుల నుంచి తీవ్రమైన విమర్శలు వస్తాయి. ఆరోపణలతో వీళ్లు తీవ్ర ఒత్తిడికి లోనవుతారు. ఏళ్ల తరబడి కష్టపడి నిర్మించుకున్న తన కెరీర్ కళ్ల ముందే కుప్పకూలుతుంటే గీతిక నిస్సహాయంగా చూస్తూ ఉండిపోతుంది. మరి వీళ్ల రిలేషన్ షిప్ ఎలాంటి మలుపు తీసుకుంది అన్నది సినిమాలో చూడాల్సిందే.
సీమా అగర్వాల్, యష్ కేస్వాని కథ అందించిన ఈ చిత్రానికి అనుభూతి కశ్యప్ దర్శకత్వం వహించారు. కరణ్ జోహార్, అదర్ పూనావాలా, సోమెన్ మిశ్రా నిర్మించిన ఈ సైకలాజికల్ థ్రిల్లర్ ఫిబ్రవరి 27న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


