...
...
Next Story

Tax Free Movie: ఆ కృష్ణుడి మూవీకి బంపర్ ఆఫర్- ట్యాక్స్ ఫ్రీగా ప్రకటించిన సీఎం- తక్కువ ధరకే టికెట్స్, యూత్ కోసమే!

Krishnavataram Part 1 Hridayam Tax Free UP Government: శ్రీకృష్ణుడి లీలా విశేషాలతో తెరకెక్కిన కృష్ణావతారం పార్ట్ 1: హృదయం చిత్రానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పన్ను మినహాయింపు ప్రకటించింది. భారతీయ సంస్కృతిని నేటి తరానికి చేరువ చేయాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.

Published on: May 12, 2026, 05:44:47 IST
Advertisement

Krishnavataram Part 1 Hridayam Tax Free: భారతీయ వెండితెరపై పురాణగాథలకు, ఆధ్యాత్మిక చిత్రాలకు ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది. తాజాగా ‘కృష్ణావతారం పార్ట్ 1: హృదయం’ చిత్రం బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈ సినిమాకు బంపర్ ఆఫర్ ప్రకటించింది.

ట్యాక్స్ ఫ్రీ సదుపాయం

ఆ కృష్ణుడి మూవీకి బంపర్ ఆఫర్- ట్యాక్స్ ఫ్రీగా ప్రకటించిన సీఎం- తక్కువ ధరకే టికెట్స్, యూత్ కోసమే!
ఆ కృష్ణుడి మూవీకి బంపర్ ఆఫర్- ట్యాక్స్ ఫ్రీగా ప్రకటించిన సీఎం- తక్కువ ధరకే టికెట్స్, యూత్ కోసమే!

రాష్ట్రవ్యాప్తంగా కృష్ణావతారం పార్ట్ 1 హృదయం చిత్రానికి పన్ను మినహాయింపు (Tax-Free) కల్పిస్తూ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నిర్ణయం తీసుకున్నారు. శ్రీకృష్ణుడి జీవన పరమార్థాన్ని, భారతీయ సంస్కృతిని అద్భుతంగా ఆవిష్కరించినందుకు గుర్తింపుగా ఈ గౌరవం దక్కింది.

సాధారణంగా ఒక సినిమాను ట్యాక్స్ ఫ్రీగా ప్రకటించారంటే, టికెట్ ధరలపై వినోదపు పన్ను ఉండదు. దీనివల్ల సామాన్య ప్రేక్షకులకు తక్కువ ధరకే టికెట్లు అందుబాటులోకి వస్తాయి. తద్వారా మరింత ఎక్కువ మంది ప్రజలు థియేటర్లకు వెళ్లి ఈ పౌరాణిక గాథను వీక్షించే అవకాశం కలుగుతుంది.

యువత కోసమే ఈ ప్రత్యేక చొరవ

కృష్ణావతారం పార్ట్ 1: హృదయం సినిమా బృందంతో భేటీ అయిన సందర్భంగా సీఎం యోగి ఆదిత్యనాథ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఈ సినిమాకు సంబంధించి ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని సమాచార శాఖను ఆదేశించారు.

"నేటి యువత, విద్యార్థులు మన దేశ సంస్కృతిని, ఘనమైన వారసత్వాన్ని అర్థం చేసుకోవాలి. ఇలాంటి చిత్రాలు వారిలో ఆధ్యాత్మిక స్పృహను పెంపొందిస్తాయి" అని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అభిప్రాయపడ్డారు.

మే 7న థియేటర్లలో విడుదలైన ‘కృష్ణావతారం పార్ట్ 1: హృదయం’ విడుదల అయింది. బాక్సాఫీస్ వద్ద తొలుత కాస్త నెమ్మదిగా కలెక్షన్స్ రాబట్టిన కృష్ణావతారం పార్ట్ 1: హృదయం సినిమా వీకెండ్‌లో పుంజుకుంది. మౌత్ టాక్ బాగుండటంతో ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు.

ఈ సినిమా వసూళ్ల వివరాలు ఇలా ఉన్నాయి:

మొదటి రోజు గురువారం: రూ. 42 లక్షలు

శుక్రవారం: రూ. 1.15 కోట్లు

శనివారం: రూ. 2.25 కోట్లు

ఆదివారం: రూ. 3.50 కోట్లు

4 రోజుల కలెక్షన్స్

మొత్తంగా ఇప్పటివరకు కృష్ణావతారం పార్ట్ 1: హృదయం చిత్రం 4 రోజుల్లో రూ. 7.32 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయంతో రానున్న రోజుల్లో ఈ వసూళ్లు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.

సిద్ధార్థ్ గుప్త, సంస్కృతి జయానా, సుస్మితా భట్ కీలక పాత్రల్లో నటించిన కృష్ణావతారం పార్ట్ 1: హృదయం చిత్రానికి హార్దిక్ గజ్జర్ దర్శకత్వం వహించారు. క్రియేటివ్ ల్యాండ్ స్టూడియోస్ ఎంటర్‌టైన్‌మెంట్, అతశ్రీకథా మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా ఈ ప్రాజెక్టును నిర్మించాయి.

మూడు భాగాలుగా ఫ్రాంచైజీ

మొత్తం మూడు భాగాలుగా రానున్నా ఈ కృష్ణావతారం ఫ్రాంచైజీలో ‘హృదయం’ మొదటి అధ్యాయం. ప్రస్తుతం విజయవంతంగా రన్ అవుతోన్న కృష్ణావతారం పార్ట్ 1: హృదయం సినిమా ఆధ్యాత్మిక ప్రేమికులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe