...
...
Next Story

చెల్లి పెళ్లిలో అక్క డ్యాన్స్- ఆదిపురుష్ హీరోయిన్ కృతి సనన్ వీడియో వైరల్- అతను పాట పాడటంతో!

బాలీవుడ్ బ్యూటీ, ఆదిపురుష్ హీరోయిన్ కృతి సనన్ చెల్లెలు నుపుర్ సనన్ సింగర్ స్టెబిన్ బెన్ పెళ్లి వేడుకలు రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో అంగరంగ వైభవంగా జరిగాయి. ప్రముఖ గాయకులు బి ప్రాక్, సాగర్ భాటియా తమ సంగీతంతో వివాహ వేడుకలో జోష్ నింపారు. దాంతో చెల్లి పెళ్లిలో అక్క కృతి సనన్ డ్యాన్స్ చేసింది.

Published on: Jan 12, 2026, 17:01:24 IST
Advertisement

సనన్ కుటుంబంలో పెళ్లి సందడి అంబరాన్నంటింది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ చెల్లెలు, నటి నుపుర్ సనన్.. తన చిరకాల మిత్రుడు, పాపులర్ సింగర్ స్టెబిన్ బెన్‌తో ఏడడుగులు వేశారు. రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో అత్యంత వేడుకగా, కొద్దిమంది సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో నుపుర్ సనన్, స్టెబిన్ వివాహం జరిగింది.

సంగీతంతో హోరెత్తిన ఆఫ్టర్ పార్టీ

చెల్లి పెళ్లిలో అక్క డ్యాన్స్- ఆదిపురుష్ హీరోయిన్ కృతి సనన్ వీడియో వైరల్- అతను పాట పాడటంతో!
చెల్లి పెళ్లిలో అక్క డ్యాన్స్- ఆదిపురుష్ హీరోయిన్ కృతి సనన్ వీడియో వైరల్- అతను పాట పాడటంతో!

క్రైస్తవ సంప్రదాయం ప్రకారం జరిగిన ఈ వివాహ వేడుక అనంతరం ఏర్పాటు చేసిన ఆఫ్టర్ పార్టీలో సంగీత విద్వాంసులు బి ప్రాక్, సాగర్ భాటియా (సాగర్ వాలీ కవ్వాలీ) తమ ప్రదర్శనతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఒక వీడియోలో, సాగర్ భాటియా ‘ఐసే నా జావో పియా’ అనే పాట పాడుతుండగా.. ప్రభాస్ ఆదిపురుష్ హీరోయిన్ కృతి సనన్ ఎంతో ఉత్సాహంగా ఆయనతో కలిసి పాడుతూ, స్టెప్పులేస్తూ కనిపించారు. మరో వీడియోలో నూతన వధూవరులు ‘దూల్హే కా సెహ్రా’, ‘తేరే బినా నా గుజారా ఏ’ వంటి గీతాలకు డ్యాన్స్ చేస్తూ అతిథులను అలరించారు.

కుటుంబంతో కలిసి గొంతు కలిపిన బి ప్రాక్

ప్రముఖ గాయకుడు బి ప్రాక్ స్టేజ్ పైకి రావడంతో వేడుకలో జోష్ రెట్టింపు అయ్యింది. అక్షయ్ కుమార్, నుపుర్ సనన్ నటించిన మ్యూజిక్ ఆల్బమ్ ‘ఫిల్హాల్’ పాటను ఆయన ఆలపిస్తుండగా.. సనన్ కుటుంబ సభ్యులంతా కలిసి పాడుతూ ఆ క్షణాన్ని ఒక మధుర జ్ఞాపకంగా మార్చుకున్నారు.

ఎప్పటికీ తోడుంటామంటూ..

తమ పెళ్లి ఫోటోలను నుపుర్, స్టెబిన్ ఆదివారం (జనవరి 11) ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు. "నేను ఒప్పుకున్నాను.. ఎప్పటికీ.. ఎల్లప్పుడూ తోడుంటాను" అనే అర్థం వచ్చేలా క్యాప్షన్ ఇచ్చారు. ఈ ఫోటోలలో నుపుర్ తెలుపు రంగు వివాహ గౌనులో మెరిసిపోతుండగా, స్టెబిన్ స్టైలిష్ సూట్‌లో ఎంతో హుందాగా కనిపించారు.

కృతి సనన్ సోషల్ మీడియా పోస్టుల్లోనూ స్టెబిన్ అప్పుడప్పుడు కనిపిస్తూ ఉండేవారు. ఇప్పుడు అధికారికంగా పెళ్లితో ఒకటి కావడంతో నెటిజన్లు, సినీ ప్రముఖులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా, రవితేజ టైగర్ నాగేశ్వరరావు సినిమాతో టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది నుపుర్ సనన్.

ఇదిలా ఉంటే తెలుగులో మహేశ్ బాబు వన్ నెనొక్కడినే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన కృతి సనన్ నాగ చైతన్య దోచెయ్, ప్రభాస్ ఆదిపురుష్ సినిమాల్లో హీరోయిన్‌గా చేసింది. ఇప్పుడు చెల్లి పెళ్లిలో సాగర్ భాటియా పాట పాడటంతో అక్క కృతి సనన్ డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe