Kriti Sanon Boyfriend: బాయ్‌ఫ్రెండ్‌ను క్యూటీ అని పిలిచిన కృతి సనన్.. ఈ పోస్ట్ తో మరింత క్లారిటీ.. అసలు ఎవరీ కబీర్?
Kriti Sanon Boyfriend: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ తన వ్యక్తిగత జీవితాన్ని ఎప్పుడూ మీడియా కంట పడకుండా చాలా సీక్రెట్ గా ఉంచుతుంది. అయితే, తన రూమర్డ్ బాయ్‌ఫ్రెండ్ కబీర్ బహియా పుట్టినరోజు సందర్భంగా కృతి పెట్టిన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
Kriti Sanon Boyfriend: కబీర్ బహియా పుట్టినరోజును పురస్కరించుకుని కృతి సనన్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఒక క్యూట్ ఫొటోను షేర్ చేసింది. బీచ్ వెకేషన్‌లో కబీర్ ఎంతో సరదాగా ఉన్న ఆ ఫొటోను పోస్ట్ చేస్తూ, "హ్యాపీ బర్త్‌డే క్యూటీ" (Happy Birthday cutie) అని రాసుకొచ్చారు. అంతేకాకుండా దానికి ఒక హార్ట్ ఎమోజీతో పాటు, దిష్టి తగలకుండా ఉండే ఈవిల్-ఐ (Evil-eye) ఎమోజీని కూడా జత చేశారు.

కృతి క్లారిటీ ఇచ్చేసిందా?
ఇటీవల దీపావళి వేడుకల్లో కూడా కృతి సనన్, కబీర్ కలిసి సందడి చేసిన విషయం తెలిసిందే. తన కుటుంబ సభ్యులు, స్నేహితులతో పాటు కబీర్‌తో కలిసి దిగిన ఫొటోలను షేర్ చేస్తూ.. "నాకు అత్యంత ఇష్టమైన వ్యక్తులతో నా ఫేవరెట్ సమయం" అని కృతి క్యాప్షన్ ఇచ్చారు. ఇప్పుడు బర్త్ డే పోస్టుతో తన రిలేషన్ షిప్ పై కృతి క్లారిటీ ఇచ్చిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
పెళ్లి తర్వాతే దానిపై మాట్లాడతా!
గతంలో ఒక జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కబీర్ బహియాతో ఉన్న రిలేషన్‌షిప్ గురించి కృతి సనన్‌కు ప్రశ్న ఎదురైంది. దీనిపై ఆమె స్పందిస్తూ.. "కనీసం నాకు పెళ్లయ్యే వరకు నా వ్యక్తిగత జీవితం గురించి బయట మాట్లాడాలని అనుకోవడం లేదు. నాకు పెళ్లయిన రోజున కచ్చితంగా దీని గురించి మాట్లాడతాను. కొన్ని విషయాలు నాకు, నా సన్నిహితులకు మాత్రమే పరిమితమై ఉండాలి" అని స్పష్టం చేశారు.

ఎవరీ కబీర్ బహియా?
లండన్‌కు చెందిన కబీర్ బహియా ఒక ప్రముఖ వ్యాపారవేత్త. కబీర్ 2020లో స్థాపించిన 'వరల్డ్‌వైడ్ ఏవియేషన్ అండ్ టూరిజం లిమిటెడ్' (Worldwide Aviation and Tourism Limited) సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్‌గాlp వ్యవహరిస్తున్నారు. ఈ సంస్థ ఎయిర్‌లైన్ రిప్రజెంటేషన్ సేవలను అందిస్తుంది.
యూకేలోని ప్రముఖ ట్రావెల్ కంపెనీ ‘సౌతాల్ ట్రావెల్’ యజమాని కుల్జిందర్ బహియా కుమారుడే ఈ కబీర్.
రెండేళ్లుగా
గత రెండేళ్లుగా కృతి, కబీర్ పలు పార్టీలు, ఫ్యామిలీ ఫంక్షన్లలో కలిసి కనిపిస్తున్నారు. ముఖ్యంగా కృతి చెల్లెలు నుపుర్ సనన్ వివాహ వేడుకల్లో కబీర్ ప్రత్యేక ఆకర్షణగా నిలవడంతో వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారనే వార్తలకు మరింత బలం చేకూరింది. అయితే, ఇప్పటివరకు వీరిద్దరూ తమ రిలేషన్‌షిప్‌ను అధికారికంగా ధృవీకరించలేదు.
కృతి సనన్ సినిమాలు
కెరీర్ పరంగా కృతి సనన్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ఈ ఏడాది జూన్ 5న విడుదలైన 'హై జవానీ తో ఇష్క్ హోనా హై', ఆ తర్వాత జూన్ 19న థియేటర్లలోకి వచ్చిన రొమాంటిక్ డ్రామా 'కాక్‌టెయిల్ 2' చిత్రాలతో ఆమె ప్రేక్షకులను అలరించారు. 'కాక్‌టెయిల్ 2'లో షాహిద్ కపూర్, రష్మిక మందన్న కీలక పాత్రలు పోషించారు.
ప్రస్తుతం కృతి సనన్ ప్రముఖ నిర్మాణ సంస్థ మాడాక్ ఫిల్మ్స్ బ్యానర్‌లో ఒక హారర్ సినిమాలో నటించేందుకు సిద్ధమవుతోంది. ఆమె కెరీర్‌లో తొలి పూర్తిస్థాయి హారర్ చిత్రం ఇదే కావడం విశేషం. మాడాక్ ఫిల్మ్స్‌తో కృతికి ఇది తొమ్మిదో సినిమా.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


